Kannappa: విలన్‌గా చేస్తా.. ఫస్ట్ సీన్‌లోనే మిమ్మల్ని కాల్చేస్తా.. - 'కన్నప్ప' ఈవెంట్‌లో మోహన్ బాబు, మోహన్ లాల్ సరదా కామెంట్స్
Mohan Babu: 'కన్నప్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మోహన్ బాబు, మోహన్ లాల్ మధ్య సరదా సంభాషణ వైరల్‌గా మారింది. సినిమాలో విలన్‌గా ఛాన్స్ ఇవ్వాలంటూ ఒకరిని ఒకరు సరదాగా రిక్వెస్ట్ చేసుకున్నారు.

Mohan Babu Mohanlal Funny Moment At Kannappa Pre Release Event: మంచు విష్ణు 'కన్నప్ప' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మలయాళ స్టార్ మోహన్ లాల్, మోహన్ బాబు మధ్య సరదా సంభాషణ జరిగింది. తన సినిమాలో విలన్‌గా చేస్తే ఫస్ట్ సీన్‌లోనే మోహన్ బాబును కాల్చేస్తా అంటూ సరదాగా కామెంట్ చేశారు మోహన్ లాల్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేరళలోని కోచిలో 'కన్నప్ప' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శనివారం సాయంత్రం వేడుకగా సాగింది. ఈ ఈవెంట్‌కు హీరో మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు, ఇతర టీం హాజరయ్యారు. మోహన్ లాల్ ముఖ్య అతిథిగా విచ్చేయగా ఆయనకు మోహన్ బాబు, మంచు విష్ణు ఘనంగా సత్కరించారు.
ఆ భాగ్యం నాకు కల్పించండి
ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడారు. ఇప్పటివరకూ నేను చూసిన స్వీటెస్ట్ పర్సన్స్‌లో మోహన్ బాబు సర్ కూడా ఒకరని.. దాదాపు 600 సినిమాలు చేశారని అన్నారు. 'మీరు నటించే సినిమాలో విలన్‌గా చేయాలని ఉంది.' అంటూ మోహన్ బాబు అడగ్గా.. 'మీరు హీరో.. నేను విలన్‌గా చేస్తా. నాకు ఆ భాగ్యం కల్పించండి.' అంటూ రిక్వెస్ట్ చేశారు మోహన్ లాల్.
'అలా అనొద్దు. మీ సినిమాలో విలన్‌గానే చేయాలనుకుంటున్నా. దయచేసి ఛాన్స్ ఇవ్వండి.' అంటూ మోహన్ బాబు అడగ్గా.. 'విలన్‌గా ఎందుకు చేయాలనుకుంటున్నారు?. ఆంటోనీ ఇది సాధ్యమవుతుందా?' అని మోహన్ లాల్ అనగా కింద ఉన్న ఆంటోనీ పెరంబవూరు ఓకే అన్నారు. దీనికి స్పందించిన మోహన్ లాల్.. 'మీరు విలన్‌గా చేస్తే ఫస్ట్ సీన్‌లోనే మిమ్మల్ని కాల్చి చంపేస్తా.' అంటూ సరదాగా కామెంట్స్ చేశారు.
'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్
'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్ కాగా ఆకట్టుకుంటోంది. తిన్నడిగా విష్ణు, రుద్రుడిగా ప్రభాస్, మహాదేవశాస్త్రిగా మోహన్ బాబు, మోహన్ లాల్ తమదైన డైలాగ్స్‌తో ఆకట్టుకున్నారు. వీఎఫ్ఎక్స్, విజువల్స్ అద్భుతంగా నిలిచాయి. అడవిలో ఉండే మహిమ గల 'వాయులింగం'ను దక్కించుకునేందుకు కొన్ని వర్గాలు పోటీ పడుతుండగా.. దాన్ని తిన్నడు ఎలా కాపాడాడు? అనేదే మూవీ స్టోరీ అని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. తొలి నుంచి నాస్తికుడిగా ఉన్న తిన్నడు పరమ శివ భక్తుడిగా ఎలా మారాడు?, రుద్రుడు ఎలా అతని దారి మార్చాడు? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ఈ మూవీ ట్రైలర్‌పై సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రభాస్, మంచు విష్ణు లుక్స్, డైలాగ్స్ బాగున్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బీజీఎం బాగుందని అంటున్నారు.
ఈ నెల 27న రిలీజ్
'కన్నప్ప' ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'మహాభారతం' సీరియల్ ఫేం ముకేష్ కుమార్ సింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, శివ బాలాజీ, బ్రహ్మానందం, సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నారు.




















