Sagar New Movie: 'మొగలి రేకులు' సాగర్ హీరోగా కొత్త సినిమా - థియేటర్లలోకి పవర్‌ఫుల్ పోలీస్‌గా...
Mogali Rekulu serial hero Sagar new movie: 'మొగలి రేకులు' సీరియల్ ద్వారా పాపులరైన హీరో సాగర్. ఇప్పుడు ఆయన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
![Sagar New Movie: 'మొగలి రేకులు' సాగర్ హీరోగా కొత్త సినిమా - థియేటర్లలోకి పవర్‌ఫుల్ పోలీస్‌గా... Mogali Rekulu serial hero Sagar plays powerful police officer in his new movie The 100 Sagar New Movie: 'మొగలి రేకులు' సాగర్ హీరోగా కొత్త సినిమా - థియేటర్లలోకి పవర్‌ఫుల్ పోలీస్‌గా...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/04/ea91c06127827346fa8978fefc5e74191707025781733313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హీరో సాగర్ అని చెబితే ప్రేక్షకులు గుర్తు పట్టడం కొంచెం కష్టం ఏమో! 'మొగలి రేకులు' సీరియల్ స్టార్ ఆర్కే నాయుడు లేదా మున్నా అని చెబితే ఠక్కున గుర్తు పడతారు. బుల్లితెరపై సూపర్ స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న నటుడు సాగర్. తెలుగు టీవీ వీక్షకులకు ఆర్కే నాయుడుగా ఆయన సుపరిచితులు. అయితే... ఇప్పుడు ఆయన సీరియల్స్ చేయడం లేదు. సినిమాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నారు. పవర్‌ఫుల్ పోలీస్‌గా టీవీలో సూపర్ హిట్ అందుకున్న ఆయన... ఇప్పుడు వెండితెరపై పవర్‌ఫుల్ పోలీస్‌గా సందడి చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
సాగర్ హీరోగా 'ద 100'... త్వరలో థియేటర్లలోకి!
'సిద్ధార్థ' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్ కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'షాదీ ముబారక్' సినిమా చేసి విజయం అందుకున్నారు. ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న సినిమా 'ద 100'. ఆల్రెడీ విడుదలైన సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'ద 100' చిత్రానికి రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడు. ఇంతకు ముందు ఆయన పలు ఇండిపెండెంట్ ఫిలిమ్స్ తీశారు. వాటికి చాలా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఇప్పుడు 'ద 100' సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు.
'ద 100'లో ఐపీఎస్ అధికారిగా సాగర్!
'ద 100' సినిమాలో విక్రాంత్ అనే ఐపీఎస్ అధికారి పాత్రలో సాగర్ నటిస్తున్నారు. ఈ సినిమా, అందులో తన పాత్ర కోసం ఆయన ఫిట్నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ''ఇదొక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. కమర్షియల్ అంశాలు కూడా ఉన్నాయి. స్క్రీన్ ప్లే కూడా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, మంచి యాక్షన్... రెండిటి మేళవింపుతో సినిమా రూపొందుతోంది'' అని దర్శకుడు తెలిపారు.
Also Read: నేహా శెట్టికి మరో ఆఫర్ - పవన్ కళ్యాణ్ దర్శకుడి కొత్త సినిమాలో!
'మొగలి రేకులు' సీరియల్ చూసిన ప్రేక్షకులకు అందులో ఆర్కే నాయుడు క్యారెక్టర్ తప్పకుండా గుర్తుండి ఉంటుంది. పోలీస్ పాత్రలో సాగర్ చేసిన పెర్ఫార్మన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు 'ద 100' సినిమాలోనూ ఆయన పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. సో... వెండితెరపై ఆయనకు ఈ సినిమా చాలా స్పెషల్ కానుందని చెప్పవచ్చు. 'ద 100' సినిమాతో పోలీస్ అధికారిగా వెండితెరపై కూడా ఆయన భారీ విజయం అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. త్వరలో విడుదల తేదీతో పాటు మరిన్ని వివరాలు వెల్లడిస్తామని దర్శకుడు రాఘవ్ ఓంకార్ శశిధర్ చెప్పారు.
Also Read: బ్రహ్మానందం కమెడియన్ కాదు... అంతకు మించి! హాస్య బ్రహ్మ నటనతో ఏడిపించిన పాత్రలు ఏవో తెలుసా?
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి', బాలీవుడ్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ రణబీర్ కపూర్ 'యానిమల్'తో పాటు పలు హిట్ చిత్రాలకు సంగీతం సమకూర్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ 'ద 100' చిత్రానికి సంగీత దర్శకుడు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు.
Also Read: నాగలాపురం నాగమ్మగా లక్ష్మీ మంచు - ఐదు భాషల్లో ఫాంటసీ ఫిల్మ్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)