Rhea Chakraborty - Sushant Singh Rajput: ప్రతి రోజూ మిస్ అవుతున్నా - సుశాంత్ సింగ్ వర్ధంతికి రియా చక్రవర్తి పోస్ట్ చూశారా?
Sushant Singh Rajput Death Anniversary: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ లోకాన్ని విడిచి రెండేళ్లు. ఆయన వర్ధంతి సందర్భంగా రియా చక్రవర్తి, సుశాంత్ శ్వేత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు చేశారు.
![Rhea Chakraborty - Sushant Singh Rajput: ప్రతి రోజూ మిస్ అవుతున్నా - సుశాంత్ సింగ్ వర్ధంతికి రియా చక్రవర్తి పోస్ట్ చూశారా? Miss You Everyday - Rhea Chakraborty remembers Sushant Singh Rajput Sushant sister Shweta Singh Kirti pens heartfelt emotional note Rhea Chakraborty - Sushant Singh Rajput: ప్రతి రోజూ మిస్ అవుతున్నా - సుశాంత్ సింగ్ వర్ధంతికి రియా చక్రవర్తి పోస్ట్ చూశారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/14/056c9ca9c20a31654eaefcec778d7059_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sushant Singh Rajput Second Death Anniversary: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇవాళ మనతో లేరు. కానీ, ఆయన నటించిన సినిమాలు ఉన్నాయి. ఆయన జ్ఞాపకాలు ఉన్నాయి. జూన్ 14... హిందీ ప్రేక్షకులు మెచ్చిన, ప్రజలకు నచ్చిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిన రోజు. నేటికి ఆయన మరణించి రెండేళ్లు. ఈ సందర్భంగా పలువురు హిందీ సినిమా ప్రముఖులు, ప్రేక్షకులు ఆయన్ను గుర్తు చేసుకుంటున్నారు. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి, ఆయన సోదరి శ్వేతా సింగ్ కృతి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు చేశారు.
Rhea Chakraborty remembers Sushant Singh: 'మిస్ యు ఎవ్రీ డే' (ప్రతి రోజూ నిన్ను మిస్ అవుతున్నాను) - ఇదీ రియా చక్రవర్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్. ఒక్క మాటలో సుశాంత్ మీద తన ప్రేమను చెప్పారు. దీంతో పాటు పోస్ట్ చేసిన ఫొటోల్లో సుశాంత్, రియా మధ్య ప్రేమ కనిపించింది.
Also Read: వెనక్కి వెళ్ళిన అరుణ్ విజయ్ 'ఏనుగు' - ఎప్పుడు విడుదల అవుతుందంటే?
View this post on Instagram
Sushant Singh Rajput's Sister Shweta Singh kirti Gets Emotional and Pens Heartfelt Note On His 2nd Death Anniversary: ''భాయ్... నువ్వు నీ దేహాన్ని విడిచి వెళ్లి రెండేళ్లు అయ్యింది. విలువల కోసం నిలబడిన నువ్వు ప్రజల గుండెల్లో అమరుడు అయ్యావు. అందరి పట్ల ప్రేమ, దయ, కరుణ చూపించడం నీ సద్గుణం. నువ్వు చాలా మందికి చాలా చేయాలని అనుకున్నావు. నీ గౌరవార్థం మేం ఆ పనులు చేస్తాం. నువ్వు ఈ లోకాన్ని మంచిగా మార్చావు'' అని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి శ్వేతా సింగ్ కృతి పేర్కొన్నారు.
Also Read: విష్ణు మంచు ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే? ఉదయం ఆరు గంటలకు వర్క్ స్టార్ట్
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)