(Source: ECI/ABP News/ABP Majha)
Mehreen New Telugu Movie : ప్రేమికుడి కోసం మెహరీన్ అన్వేషణ - కనబడు కంటికి తొందరగా!
'కనబడు కంటికి తొందరగా...' అంటూ మెహరీన్ పాట పాడుతున్నారు. ఆవిడ ఎవరి కోసం ఆ పాట పాడారు. ఏమైంది? వంటి వివరాల్లోకి వెళితే...
యువ కథానాయిక మెహరీన్ కౌర్ ఫిర్జాదా (Mehreen Kaur Pirzada) నటించిన తాజా తెలుగు సినిమా 'స్పార్క్ లైఫ్'. దీని ద్వారా విక్రాంత్ (Vikranth) హీరోగా పరిచయం అవుతున్నారు. అంతే కాదు... దర్శకుడిగా కూడా ఆయనకు తొలి చిత్రమిది. ఇంకా కథకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో రుక్సార్ థిల్లాన్ మరో కథానాయిక. ఇదొక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో ఐదో పాటను విడుదల చేశారు.
ప్రేమికుడి కోసం మెహరీన్ అన్వేషణ
మలయాళ హిట్ 'హృదయం', తెలుగులో విజయ్ దేవరకొండ & సమంత జంటగా నటించిన 'ఖుషి', నాని 'హాయ్ నాన్న' పాటలతో తెలుగు ప్రేక్షకుల్ని సైతం తన అభిమానులు చేసుకున్న సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహేబ్. 'స్పార్క్' సినిమాకు సైతం చార్ట్ బస్టర్ సాంగ్స్ అందిస్తున్నారు.
ఆల్రెడీ 'స్పార్క్' సినిమాలో నాలుగు పాటలు విడుదల అయ్యాయి. ఇప్పుడు ఐదో పాట 'రాధేశా...' విడుదల చేశారు. దీనిని మెహరీన్ మీద తెరకెక్కించారు.
''కనబడు కంటికి తొందరగా
కనుగొనలేనిక అంత ఇదిగా
కనబడు కంటికి తొందరగా
నిను వెతికేది ఎటు నేరుగా
కనబడు కంటికి తొందరగా''
అంటూ సాగిన ఈ గీతానికి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. శ్వేతా మోహన్ తన గానంతో పాటకు ప్రాణం పోశారు.
''ఏ చిలిపి కోనల్లోనా కిమ్మనక ఉన్నావో...
ఏ వెదురు కానల్లో ఎదురై వేణువూదేవో
ఏ కొలను తీరంలో కొమ్మలకు ఊగేవో...
కోకాలను దాచేస్తూ మరచితివా దోచిన మనసుని''
అంటూ సాగే లిరిక్స్, ఆ లిరికల్ వీడియో చూస్తే... ప్రేమికుడి కోసం మెహరీన్ అన్వేషణ సాగిస్తున్నట్లు అర్థం అవుతోంది.
Also Read : 'గేమ్ ఛేంజర్'కు భారీ డీల్ - విడుదలకు ముందు కోట్లు కొల్లగొట్టిన సాంగ్స్!
Spark Movie Trailer Review : 'స్పార్క్' ట్రైలర్ ప్రారంభం చూస్తే... ఇదొక ప్రేమ కథ అనిపిస్తుంది. మెహరీన్, రుక్సార్... ఇద్దరితోనూ హీరో విక్రాంత్ లవ్ చేసే సీన్స్ ఉన్నాయి. బస్ స్టాపులో చూసిన రుక్సార్ వెంట హీరో పడితే... హీరోని ప్రేమలో పడేస్తాని చెప్పే అమ్మాయిగా మెహరీన్ కనిపించారు. స్టార్ కమెడియన్లు 'వెన్నెల' కిశోర్, సత్య కూడా కనిపించారు. అయితే... ఆ ఇద్దరు అమ్మాయిలతో తిరుగుతూ వాళ్ళను మోసం చేస్తున్నాడా? అని అనుమానం కలుగుతుంది. అయితే... కొద్ది క్షణాలు ట్రైలర్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ టర్న్ తీసుకుంది.
ట్రైలర్ మొదలైన నిమిషం తర్వాత... ఓ అమ్మాయి తర్వాత మరొకరు, వరుసగా హత్యలకు గురైన అమ్మాయిలను చూపించారు. అవి చేసినది హీరో అన్నట్లు చూపించారు. హీరో వెనుక పోలీసులు ఎందుకు పడ్డారు? ఒకవేళ అతనే హత్యలు చేసినట్లు అయితే ఎందుకు చేశారు? ఆ మారణ హోమాన్ని ఎవరు ఆపారు? అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాలి.
Also Read : ఎంత పని చేశావ్ సమంత - అంతా ఆమె స్విమ్ సూట్ గురించే టాపిక్!
నవంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'స్పార్క్' చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నాజర్, సుహాసిని మణిరత్నం, 'వెన్నెల' కిశోర్, షాయాజీ షిండే, సత్య, 'వెన్నెల' కిశోర్, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ తదితరులు ప్రధాన తారాగణం.