అన్వేషించండి

Allu Arjun Wishes Chiranjeevi: చిరంజీవి బర్త్‌డే రోజున విష్ చేయడంలో అల్లు అర్జున్ తీరు మారిందా? ఫ్యాన్స్ ఎందుకు ఫైర్ అవుతున్నారు.

Allu Arjun Vs Mega Fans: మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ మ‌ధ్య వార్‌ మరింత ముదురుపాకాన పడుతోంది. చిరంజీవికి బ‌న్నీ బ‌ర్త్ డే విషెస్ పెట్ట‌డంపై ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. అవసరం లేదు పక్కకు పొమ్మంటున్నారు.

Mega Fans Fire  On Allu Arjun : మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఆగ‌స్టు 22. టాలీవుడ్ వ‌న్ అండ్ ఓన్లీ వ‌న్ మెగాస్టార్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయ‌న అభిమానులు, సినీ సెల‌బ్రిటీలు, ప్ర‌ముఖులు ప్ర‌తి ఒక్క‌రు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా త‌మ అభిమానాన్ని పంచుకుంటున్నారు. అయితే, ఒక సెల‌బ్రిటీ పెట్టిన విషెస్‌పై మాత్రం మెగా ఫ్యాన్స్‌ మండిప‌డుతున్నారు. నీ విషెస్ మాకు వ‌ద్దు అంటూ చిరు ఫ్యాన్స్ విరుచుకుప‌డుతున్నారు. కార‌ణం.. అల్లు అర్జున్ వ్యవహార శైలి. మొన్నటి ఎన్నికల్లో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు బుధవారం జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌లో బన్నీ కామెంట్స్ మెగా ఫ్యాన్స్‌కు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి  

అస‌లు ఏం జ‌రిగిందంటే?

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంద్భంగా సెల‌బ్రిటీలంతా విషెస్ తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగానే అల్లు అర్జున్ కూడా మెగాస్టార్ కి ట్విట్ట‌ర్ ద్వారా విషెస్ చెప్పారు. "మ‌న మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు" అని ఆయ‌న పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆయ‌న‌పై ఫైర్ అవుతున్నారు. అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు. "నీ విషెస్ మాకు వ‌ద్దు" అంటూ కామెంట్లు పెడుతున్నారు. గ‌త కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని, దాని వ‌ల్ల ఈసారి సాదాసీదాగా శుభాకాంక్ష‌లు చెప్పార‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు ఫ్యాన్స్. 

 

ఈసారే అలా చెప్పారా? 

ఫ్యాన్స్ అనుకుంటున్న‌ట్లు అల్లు అర్జున్ ఈసారి మాత్ర‌మే అలా సింపుల్ గా విష్ చేశారా? అంటే కాదు. గ‌త ప‌దేళ్లుగా ఆయ‌న చిరంజీవిని అలానే విష్ చేస్తున్నారు. ప్ర‌తి ఏడాది సింపుల్ గా విష్ చేస్తూ వ‌చ్చారు బ‌న్నీ. 'మెగాస్టార్ కి హ్యాపీ బ‌ర్త్ డే', 'వ‌న్ అండ్ ఓన్లీ వ‌న్ మెగాస్టార్ కి హ్యాపీ బ‌ర్త్ డే', 'హ్యాపీ బ‌ర్త్ డే బాస్' అంటూ ఇలా విష్ చేశారు ఆయ‌న‌. ఇక కొన్నిసార్లు మాత్రం చిరుతో దిగిన ఫొటోల‌ను పెట్టి విష్ చేశారు బ‌న్నీ. అప్పుడు ఇప్పుడు ఒకేలా విష్ చేశారు అల్లు అర్జున్. ఇటీవల జరిగిన పరిణామాలతో ఆయన చెప్పిన విషెస్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు.      


Allu Arjun Wishes Chiranjeevi: చిరంజీవి బర్త్‌డే రోజున విష్ చేయడంలో అల్లు అర్జున్ తీరు మారిందా?  ఫ్యాన్స్ ఎందుకు ఫైర్ అవుతున్నారు.

అస‌లు వివాదం ఏంటి? 

నిజానికి ఈ వివాదం ఇప్ప‌టిది కాదు. ఏపీ ఎన్నిక‌ల నాటిది. మెగా ఫ్యామిలీ అంతా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కి, జ‌న‌సేన‌కి స‌పోర్ట్ చేశారు. కానీ, అల్లు అర్జున్ మాత్రం నంద్యాల‌లో వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు. దీంతో ఫ్యాన్స్ అప్పుడు ఆయ‌న‌పై సీరియ‌స్ అయ్యారు. ఆ త‌ర్వాత నాగ‌బాబు మాట్లాడిన కొన్ని మాట‌లు అల్లు అర్జున్ ని ఉద్దేశించిన‌వే అని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డ్డారు. సాయి ద‌ర్గ్ తేజ్ అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేయ‌డం లాంటివి జ‌రిగాయి. మొన్నీ మధ్య పవన్ కల్యాణ్ కూడా పుష్ప సినిమాపై కామెంట్స్ చేయడం వైరల్ అయింది. ఒకప్పుడు హీరో అడవులను రక్షించేలా సినిమాలు చేసే వాళ్లని ఇప్పుడు మాత్రం స్మగ్లర్లుగా అడవిని కొల్లగొట్టే వారుగా నటిస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. 

ఈ వివాదం కొనసాగుతుండగానే బుధవారం ఒక సినిమా ఫంక్ష‌న్ లో అల్లు అర్జున్ చేసిన కొన్ని కామెంట్స్ కూడా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన‌ట్లు ఉన్నాయ‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. తాను నమ్మిన వాళ్ల కోసం ఎక్కడికైనా వెళ్తానంటూ చెప్పుకొచ్చారు. అంటే వైసీపీ అభ్యర్థి కోసం చేసిన ప్రచారంపైనే కామెంట్ చేశారని అంటున్నారు. దీనిపై ఓపెన్‌గానే అభిమానులు మండిపడ్డారు. ఇంద్ర సినిమా రీ రిలీజ్‌కు వచ్చిన ఫ్యాన్స్‌ అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసే వీడియోలు, విమర్శించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయు. 

Also Read: మాట మార్చిన అల్లు అర్జున్... పాత వీడియోలు తీసి మరీ ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Today Weather Report: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలపై అల్పపీడనం ప్రభావం- తెలంగాణలో తగ్గేదేలే అంటున్న చలిపులి
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలపై అల్పపీడనం ప్రభావం- తెలంగాణలో తగ్గేదేలే అంటున్న చలిపులి
Smriti Mandhana 2 World Records: రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదు
రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదు
Embed widget