అన్వేషించండి

Varun Tej - Chiranjeevi: ప్లానింగ్‌తోనే లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు, వ‌రుణ్ తేజ్‌పై మెగాస్టార్ కామెంట్స్

Varun Tej - Chiranjeevi: వ‌రుణ్ తేజ్ ప్ర‌తీది ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్తాడ‌ని, అలాంటి ప్లానింగ్ తోనే లావ‌ణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడ‌ని చిరంజీవి అన్నారు.

Chiranjeevi Comments About Varun Tej, Lavanya's Marriage: 'ఆప‌రేష‌న్ వాలంటైన్' మెగా హీరో వ‌రుణ్ తేజ్ న‌టించిన ఈ సినిమా ఎన్నో వాయిదాల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు మార్చి 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీనికి సంబంధించి ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు ఆయ‌న‌. ఇక ఇప్పుడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రావ‌డంతో ఈవెంట్ ఇంకా గ్రాండ్ స‌క్సెస్ అయ్యింది. ఈ ఈవెంట్ లో చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. లావ‌ణ్య త్రిపాఠి, వ‌రుణ్ తేజ్ పెళ్లి చేసుకోవ‌డంపై ఆయ‌న చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. చిరంజీవి ఏమ‌న్నారంటే? 

ప్లాన్డ్ గానే లావ‌ణ్య‌ను పెళ్లి చేసుకున్నాడు

 ‘‘నాకు తెలిసి ఇలాంటి యంగ్ స్ట‌ర్స్ ఎవ‌రికీ రాని అవ‌కాశం, మా కుటుంబంలో ఉన్న ఇతర హీరోలకు రాని అవ‌కాశం వ‌రుణ్ కి వ‌చ్చింది. అవ‌కాశం వ‌చ్చింది అనే కంటే.. త‌ను వాటిని అందిపుచ్చుకున్నాడు అనాలి. అందిపుచ్చుకోవ‌డ‌మే కాకుండా ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ స్థాయిలో నిల‌బ‌డ్డాడు. వ‌రుణ్ చేసే ప్ర‌తి సినిమా చాలా డిఫ‌రెంట్. ఉదాహ‌ర‌ణ‌కు ఫ‌స్ట సినిమా 'ముకుంద' చూస్తే రూర‌ల్, ల‌వ‌బుల్ బాయ్. ఆ త‌ర్వాత 'కంచె' ఎప్పుడో వ‌ర‌ల్డ్ వార్ - 2 టైంలో, 1947 నాటి మిల‌ట‌రీ సైనికుడు. ఆ త‌ర్వాత ఆస్ట్రొనాట్ గా చేశాడు. ఇక 'గ‌ద్ద‌ల కొండ గ‌ణేశ్'. అది నా ఫేవ‌రెట్ సినిమా. దాంట్లో యాక్టింగ్ చాలా బాగా చేశాడు. త‌న గెట‌ప్, ఆహార్యం, హెయిర్ స్టైల్ అన్నీ నాకు చాలా చాలా న‌చ్చుతాయి. ఎన్నారై గా చేసిన ఫిదా. వాళ్ల బాబాయ్ ఇన్ స్పిరేష‌న్ తో చేసిన 'తొలిప్రేమ‌'. ఇక ఇప్పుడు లేటెస్ట్ సినిమాల వ‌ర‌కు ప్ర‌తీది చాలా ప్లాన్డ్ గా ముందుకు వెళ్తాడు. స‌క్సెస్ చేసుకుంటూ వ‌చ్చాడు. ఇక ఆ ప్లాన్ లో ఒక భాగ‌మే లావ‌ణ్య‌ను కూడా క‌ట్టుకున్నాడు. ప్ర‌తీది ప్లాన్ చేసి, స‌క్సెస్ చేసుకుంటూ వ‌చ్చాడు. అన్నీ జోన‌ర్స్ ట‌చ్ చేశాడు. నేను యాక్ష‌న్ హీరో యాక్ష‌న్ సినిమాలే చేస్తా, లవ్ స్టోరీలే చేస్తా అని అనుకోకుండా.. వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ, డిఫ‌రెంట్ పాత్ర‌లు చేస్తూ స‌క్సెస్ అయ్యాడు’’ అని వ‌రుణ్ తేజ్ గురించి చెప్పారు చిరంజీవి. ఇక ఆయ‌న లావ‌ణ్య త్రిపాఠి గురించి చెప్పిన‌ప్పుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి చెప్పిన‌ప్పుడు అక్క‌డి  ప్రాంగ‌ణం మొత్తం అభిమానుల కేరింత‌ల‌తో మారుమోగిపోయింది. 

లావ‌ణ్య త్రిపాఠి, వ‌రుణ్ తేజ్ ఈ మ‌ధ్యే పెళ్లి బంధంతో ఒక్క‌టైన విష‌యం తెలిసిందే. ఇట‌లీలో వీళ్ల పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. ఎన్నో ఏళ్లుగా ప్రేమ‌లో ఉన్న లావ‌ణ్య త్రిపాఠి, వ‌రుణ్ తేజ్ పెద్ద‌ల స‌మ‌క్షంలో ఒకట‌య్యారు. ఇక పెళ్లి త‌ర్వాత లావ‌ణ్య త్రిపాఠి 'మిస్ ప‌ర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. వ‌రుణ్ తేజ్ 'ఆప‌రేష‌న్ వాలంటైన్' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. నిజానికి ఈ సినిమా ఫిబ్ర‌వ‌రీలోనే విడుద‌ల కావాల్సి ఉండ‌గా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇక ఎట్ట‌కేల‌కు మార్చి 1న ప్రేక్ష‌కుల ముందు రానుంది. 

పైలెట్ గా వ‌రుణ్ తేజ్.. 

ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ పైలెట్ గా క‌నిపించ‌నున్నారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడి, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో ఈ సినిమా తెర‌కెక్కించారు. ఫిబ్రవరి 14న ఈ సంఘ‌ట‌న జ‌రిగిన నేప‌థ్యంలోనే సినిమాకి  'వాలెంటైన్‌' అని పేరు పెట్టిన‌ట్లు చిత్ర బృందం గ‌తంలో ప్ర‌క‌టించింది. ఇక ఈ సినిమాని బాలీవుడ్‌ డైరెక్టర్‌ శక్తి ప్రతాప్ సింగ్‌ తెరకెక్కించాడు. ఈ చిత్రం వరుణ్‌ తేజ్‌ సరసన మాజీ మిస్‌ ఇండియా మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా నటించింది. న‌వ‌దీప్ త‌దిత‌రులు ప్ర‌ధాన ప్రాత‌లు పోషించారు. ఈ సినిమాతోనే వ‌రుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. దీంతో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. ఎన్నోరోజులుగా ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్సెస్ కి ఈ సినిమా ఊర‌ట క‌లిగిస్తుందో లేదో చూడాలి మ‌రి.

Also read: ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్‌: నువ్వు లేకపోతే చచ్చిపోతానని మురారికి వార్నింగ్ ఇచ్చిన ముకుంద - తనని మర్చిపోలేకపోతున్నానని కృష్ణకు చెప్పిన మురారి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
KCR Vs Revanth: రేవంత్ అసెంబ్లీ సవాల్ - కేసీఆర్‌ వెళ్తారా?
రేవంత్ అసెంబ్లీ సవాల్ - కేసీఆర్‌ వెళ్తారా?
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
Telangana Assembly Sessions: ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
Embed widget