MC Tod Fod Death: బాలీవుడ్‌లో విషాదం - 24 ఏళ్లకు 'గల్లీ బాయ్' ర్యాపర్ ఎంసీ తోడ్ ఫోడ్ మృతి, రణ్‌వీర్ సింగ్ భావోద్వేగం
MC Tod Fod aka Dharmesh Parmar passed away at the age of 24: ర్యాపర్ ఎంసీ తోడ్ ఫోడ్ మృతి చెందారు. హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకురాలు జోయా అక్తర్, నటుడు సిద్ధాంత్ చతుర్వేది నివాళులు అర్పించారు.
ర్యాపర్ ధర్మేశ్వర్ పర్మార్ మృతి చెందారు. అసలు పేరు కంటే స్క్రీన్ నేమ్ ఎంసీ తోడ్ ఫోడ్ పేరుతో ఆయన పాపులర్ అయ్యారు. ఆయన వయసు 24 ఏళ్ళు. 'గల్లీ బాయ్' సినిమాలో 'ఇండియా 91' ట్రాక్ తో ఎంసీ తోడ్ ప్రసిద్ధి చెందారు. రోడ్డు ప్రమాదం కారణంగా ఆయన మృతి చెందినట్టు సమాచారం. అయితే... మృతికి అసలు కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు.
ఎంసీ తోడ్ ఫోడ్ మరణించిన వార్త తెలిసిన తర్వాత ప్రముఖ బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ స్పందించారు. తోడ్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి 'హార్ట్ బ్రేక్' ఎమోజీ పోస్ట్ చేశారు. 'గల్లీ బాయ్'తో పేరు తెచ్చుకుని, ఇటీవల 'గెహరాయియా'లో నటించిన సిద్ధాంత్ చతుర్వేది 'రిప్ బాయ్' అని పోస్ట్ చేశారు. దర్శకురాలు జోయా అక్తర్ "నువ్వు చాలా త్వరగా వెళ్లిపోయావ్. మన దారులు కలిసినందుకు నేను కృతజ్ఞతతో ఉంటాను. రెస్ట్ ఇన్ పీస్ భాయ్" అని పోస్ట్ చేశారు.
Also Read: కోడి కత్తి వాడిన రాజమౌళి, ఖైదీ సీఎం - నాగబాబు వెటకారం! వైఎస్ వివేకాది సహజ మరణమా?
View this post on Instagram
View this post on Instagram