Raviteja: సంక్రాంతి రేసులో మాస్ మహారాజ - రవితేజ కొత్త సినిమా స్టార్ట్.. ప్రీ లుక్ అదిరిపోయిందిగా..
RT 76 Movie: మాస్ మహారాజ కొత్త మూవీ ప్రారంభమైంది. 'RT 76' మూవీకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

Raviteja's RT 76 Movie Update: మాస్ మహారాజ రవితేజ అంటేనే మనకు పవర్ ప్యాక్ట్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గుర్తొస్తుంది. ప్రస్తుతం ఆయన 'మాస్ జాతర'లో నటిస్తుండగా.. తన నెక్స్ట్ మూవీని సైతం లైన్‌లో పెట్టారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
క్రేజీ కాంబో..
రవితేజ కొత్త మూవీకి ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో చిత్రం ప్రారంభమైంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మిస్తుండగా.. హీరో రవితేజతో పాటు దర్శక నిర్మాతలు ఇతర సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
ప్రీ లుక్ పోస్టర్ అదుర్స్
ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ టీం రిలీజ్ చేయగా రవితేజ రోల్ యాటిట్యూడ్ హైప్ క్రియేట్ చేసింది. బిజినెస్ క్లాస్ ఫ్లైట్‌లో ఓ చేతిలో స్పానిష్ నేర్చుకునే బుక్, మరో చేతిలో షాంపైన్ బాటిల్‌తో మాస్ మాహారాజ అదరగొట్టారు. కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ఉండబోతోందని పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. ఇప్పటివరకూ లేని కొత్త లుక్‌లో రవితేజను చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Be seated and fasten your seat belts for MASS MAHARAAJ @RaviTeja_offl's Entertaining Ride with #RT76 🔥 🛫
— SLV Cinemas (@SLVCinemasOffl) June 5, 2025
A @DirKishoreOffl's bonafide entertainer 💥
Produced by @sudhakarcheruk5 under @SLVCinemasOffl ❤️🔥
In Cinemas Sankranthi 2026 ✈️
Begins with Pooja Ceremony & Muhurtam… pic.twitter.com/I75xIVip4A
వచ్చే ఏడాది సంక్రాంతికి..
ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 16 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. 'దసరా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన నిర్మాత సుధాకర్ చెరుకూరి. ఈయనతో కలిసి రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' చేయగా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కొత్త మూవీ ఒక పవర్ ఫుల్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. రవితేజ మార్క్ సిగ్నేచర్ స్టైల్‌తో పాటు కామెడీ, యాక్షన్, డ్రామా అన్నీ ఉండనున్నాయి.
Also Read: మహేష్ బాబు, రాజమౌళి మూవీ అప్‌డేట్ వచ్చేసింది - కొత్త షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?
ఈ మూవీకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా.. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా.. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చాగంటి విజయ్ కుమార్.
వినాయక చవితికి 'మాస్ జాతర'
రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర' వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీకి కూడా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి.





















