అన్వేషించండి

Market Mahalakshmi: అమ్మాయితో చెంపదెబ్బలు తిని, అమ్మతోనూ తిని... పాపం సాఫ్ట్‌వేర్ పోరడు!

కాయగూరల మార్కెట్‌లో అమ్మాయితో సాఫ్ట్‌వేర్ కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే కథతో రూపొందిన సినిమా 'మార్కెట్ మహాలక్ష్మి'. శ్రీవిష్ణు టీజర్ లాంచ్ చేశారు.

Market Mahalakshmi movie teaser launched by Sree Vishnu: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే యువకుడు ఒక మార్కెట్‌లో కాయగూరలు అమ్మే అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే కథతో రూపొందిన సినిమా 'మార్కెట్ మహాలక్ష్మి'. ఇందులో 'కేరింత' మూవీ ఫేమ్ పార్వతీశం హీరోగా నటించారు. టైటిల్ పాత్రలో ప్రణీకాన్వికా నటించారు. కథానాయికగా ఆమెకు తొలి చిత్రమిది. యువ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా సినిమా టీజర్ విడుదల అయ్యింది.

ప్రపోజ్ చేస్తే చెంపదెబ్బ కొట్టిన హీరోయిన్!
'మార్కెట్ మహాలక్ష్మి' టీజర్ చూస్తే... తనకు ఇండిపెండెంట్ అమ్మాయిలు అంటే ఇష్టం అని చెప్పే సాఫ్ట్‌వేర్ యువకుడిగా పార్వతీశాన్ని పరిచయం చేశారు. ఆ తర్వాత మార్కెట్ మహాలక్ష్మిగా, కూరగాయలు అమ్మే అమ్మాయిగా ప్రణీకాన్వికా పాత్రను చూపించారు. 

హీరోది అమలాపురం. అతడికి ఉద్యోగం రావడంతో ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది. మార్కెట్టులో మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడతాడు. అయితే, ఆ అమ్మాయితో అతని తల్లికి గొడవ అవుతుంది. నచ్చిందని చెబితే అమ్మాయి లాగి పెట్టి ఒక్క చెంపదెబ్బ ఇచ్చింది. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసినందుకు అమ్మ కూడా కొట్టింది. పాపం... ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చివరికి ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది మనకు తెలియాలంటే సినిమా చూడాలి.

Also Readప్రభాస్ సినిమా నుంచి తీసేశారు... పవన్‌ కళ్యాణ్‌తో అసలు నటించలేదు... రకుల్ టాలీవుడ్ జర్నీలో ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్!

టీజర్ చూశా... చాలా బావుంది! - శ్రీ విష్ణు
వీఎస్ ముఖేష్ దర్శకత్వంలో 'మార్కెట్ మహాలక్ష్మి' తెరకెక్కింది. బి2పి స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని అఖిలేష్ కలారు ప్రొడ్యూస్ చేశారు. హర్షవర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

టీజర్ విడుదల చేసిన తర్వాత హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ... ''మూవీ టీజర్ చూశా. చాలా ఫన్నీగా ఉంటూనే... హీరో హీరోయిన్ల క్యారెక్టరైజెషన్లను పరిచయం చేశారు. నాకు అది నచ్చింది. హీరో పార్వతీశం నాకు ఇష్టమైన వ్యక్తి. అతని కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకు వస్తుందని బలంగా నమ్ముతున్నా. దర్శకుడు వియస్ ముఖేష్ చేసిన ఈ కొత్త ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్'' అని చెప్పారు. హీరో పార్వతీశం మాట్లాడుతూ... ''మా టీజర్ చేసినందుకు శ్రీ విష్ణు గారికి నా థాంక్స్. మా టీజర్ మీకు నచ్చితే పది మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా'' అని అన్నారు.

Also Read: ఆహాలో ఆంటోనీ - తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న మలయాళ సినిమా

Market Mahalakshmi: అమ్మాయితో చెంపదెబ్బలు తిని, అమ్మతోనూ తిని... పాపం సాఫ్ట్‌వేర్ పోరడు!

కమెడియన్ మహబూబ్ బాషా మాట్లాడుతూ... ''మా సినిమా టీజర్ హీరో శ్రీ విష్ణు గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే... 'మార్కెట్ మహాలక్ష్మి' లాంటి సబ్జెక్ట్ ఓరియెంటెడ్  కధలు శ్రీ విష్ణు గారు చాలా చేశారు. చేస్తూనే ఉన్నారు. ఆయన నాకు ఎంతో ఇష్టమైన హీరో. అందువల్ల, మరింత హ్యాపీగా ఉంది'' అని చెప్పారు. 'మార్కెట్ మహాలక్షి' సినిమాకు కళా దర్శకుడు: సంజన కంచల, నృత్య దర్శకత్వం: రాకీ, నేపథ్య సంగీతం: సృజన్ శశాంక, సాహిత్యం: వీఎస్ ముఖేష్ - జోయ్ ఎమ్నావ్, కూర్పు: ఆర్ఎం విశ్వనాథ్ కుంచానపల్లి, ఛాయాగ్రహణం: సురేంద్ర చిలుముల, స్వరాలు: జోయ్ ఎమ్నావ్, నిర్మాత: అఖిలేష్ కిలారు, రచన - దర్శకత్వం: వీఎస్ ముఖేష్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
YS Jagan: బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
Embed widget