అన్వేషించండి

Mannara Chopra: దర్శకుడి ముద్దుపై స్పందించిన హీరోయిన్ మన్నారా చోప్రా - అందుకే అలా చేశారట!

మన్నారా చోప్రా.. ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘తిరగబడరా శివ’ ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తోంది. తాజా ముద్దు వివాదంపై స్పందించింది.

మామూలుగానే సినీ సెలబ్రిటీలపై ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. వారు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు.. ఇలాంటి చిన్న చిన్న విషయాలను ప్రేక్షకులు చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా స్టేజ్‌పై ఉన్నప్పుడు సెలబ్రిటీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి సమయంలో వారు చేసే చిన్న తప్పులు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతాయి. తాజాగా హీరోయిన్ మన్నారా చోప్రాకు సంబంధించిన ఒక వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతోంది. డైరెక్టర్ ఏఎస్ రవికుమార్.. తనకు స్టేజ్‌పై ముద్దు పెట్టడం అనేది సోషల్ మీడియాలో సునామీ సృష్టించింది. తాజాగా ఈ వైరల్ వీడియోపై మన్నారా స్పందించింది.

మలుపు తిరిగింది..
మన్నారా చోప్రా.. ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘తిరగబడరా సామి’ ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తోంది. తాజాగా ఈ మూవీని ప్రమోట్ చేయడం కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది టీమ్. ఆ ఈవెంట్‌లో ఎవరూ ఊహించని విధంగా మన్నారా బుగ్గపై ముద్దుపెట్టాడు దర్శకుడు ఏఎస్ రవికుమార్. దర్శకుడు చేసిన పనికి మన్నారా కూడా షాక్ అయ్యిందని కానీ స్టేజ్‌పైన ఏమీ మాట్లాడలేకపోయింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో దీనిపై స్పందించింది. ‘‘నా సినిమా ప్రమోషన్ ఇలా మలుపు తిరుగుతుందని ఊహించలేదు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో పూర్తిగా ఈ వీడియోలో ఉంది. నా స్పేస్‌ను నాకు వదిలేయమని మీడియా వారిని విన్నవిస్తున్నాను. ఈ సందర్భంలో ఇంకా ఏమీ మాట్లాడడానికి నేను సిద్ధంగా లేను’’ అంటూ మూవీ ప్రమోషన్ ఈవెంట్‌లో తన స్పీచ్ వీడియోను షేర్ చేసింది మన్నారా.

షూట్ లేనప్పుడు కూడా ఫోన్లు చేసేవారు..
సోషల్ మీడియా ద్వారా దర్శకుడు ఏఎస్ రవికుమార్ తనకు ముద్దుపెట్టడంపై స్పందించిన తర్వాత కూడా మన్నారా వీడియో.. ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. అందుకే తను ఎక్కడికి వెళ్లినా కూడా ఆ సందర్భం గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా ఎయిర్‌పోర్టులో మన్నారాను చూసిన మీడియా.. మరోసారి దర్శకుడు ముద్దుపెట్టడంపై తన స్పందన ఏంటని ప్రశ్నించారు. ‘‘దర్శకుడికి నా పని చాలా బాగా నచ్చిందనుకుంటా. షూటింగ్ లేనప్పుడు కూడా నాకు ఫోన్స్ చేస్తూనే ఉంటారు. ఆయన అప్పుడు కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయినట్టున్నారు. అసలు ఆ వీడియో వైరల్ అయిన విధానం నాకు కూడా ఆశ్చర్యాన్నే కలిగిస్తోంది’ అంటూ దర్శకుడు ఎగ్జైట్మెంట్‌లో అలా చేశాడని మన్నారా.. ఈ విషయం గురించి మామూలుగానే స్పందించింది.

తప్పుడు ఉద్దేశ్యం లేదు..
‘‘నా సినిమా విడుదల అవుతోంది. ఇది ఒక మంచి సినిమా. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నాను. జరిగిన సంఘటన కేవలం ఆయన ఎగ్జైట్మెంట్ వల్లే జరిగింది. కొన్నిసార్లు మనుషులు ఎగ్జైట్ అయిపోయి, ఏం చేస్తుంటారో తెలియదు. సౌత్ ఇండస్ట్రీ అనేది నాకు ఎప్పుడూ ఇష్టమే. అక్కడి ప్రేక్షకులు నన్ను ఎప్పుడూ ప్రేమించారు. దర్శకుడి ప్రవర్తనలో తప్పు ఉద్దేశ్యం ఉందని నేను అనుకోవడం లేదు’’ అని మన్నారా పూర్తిగా క్లారిటీ ఇచ్చింది. ఇక మన్నారా చోప్రా నటించిన ‘తిరగబడరా సామి’.. సెప్టెంబర్ 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదల అవుతున్న వైరల్ వీడియో ద్వారా ఈ సినిమాకు తగినంత ప్రమోషన్ అందింది.

Also Read: సనాతన ధర్మంపై ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు - రామ్ చరణ్ ట్వీట్ వైరల్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget