By: ABP Desam | Updated at : 03 Mar 2023 10:21 AM (IST)
మంచు మనోజ్ కాబోయే భార్య భూమా నాగ మౌనిక
యువ కథానాయకుడు మంచు మనోజ్ (Manchu Manoj Marriage) పెళ్లి సందడి మొదలైంది. కలెక్షన్ కింగ్, డాక్టర్ మంచు మోహన్ బాబు వారి ఇంట పెళ్లి భాజాలు మోగాయి. అయన రెండో కుమారుడి రెండో వివాహం ఈ రోజు రాత్రి 08.30 గంటలకు జరుగుతుంది. పెళ్లి గురించి మనోజ్ తొలిసారి స్పందించారు. పెళ్లి కుమార్తె ఫోటో షేర్ చేశారు.
మనోజ్ వెడ్స్ మౌనిక
భౌమ నాగ మౌనికా రెడ్డి మెడలో ఈ రోజు (శుక్రవారం) రాత్రి మంచు మనోజ్ మూడు ముళ్ళు వేయనున్నారు. ఇద్దరూ ఏడు అడుగులు వేయనున్నారు. నిన్న మొన్నటి వరకు పెళ్లి గురించి మౌనంగా ఉన్న మనోజ్... తాజాగా సోషల్ మీడియాలో మౌనిక ఫోటో షేర్ చేశారు. 'పెళ్లి కూతురు' అని పేర్కొన్నారు. #ManojWedsMounika, #MWedsM హ్యాష్ ట్యాగ్స్ జోడించారు. తమది ప్రేమ వివాహం అని చెప్పడానికి సంకేతం అన్నట్లు రెడ్ హార్ట్ / లవ్ సింబల్ ఎమోజీ పోస్ట్ చేశారు. తమకు అందరి ఆశీర్వాదం కావాలని చెప్పడానికి అన్నట్లు రెండు చేతులు జోడించిన ఎమోజీ కూడా యాడ్ చేశారు.
Also Read : 'బలగం' రివ్యూ : చావు చుట్టూ అల్లిన కథ - 'దిల్' రాజు ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?
Pellikuthuru @BhumaMounika ❤️#MWedsM #ManojWedsMounika 🙏🏼❤️ pic.twitter.com/eU6Py02jWt
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2023
సంగీత్ ఫోటోలు షేర్ చేసిన లక్ష్మీ మంచు
హైదరాబాదులోని జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్ లో మోహన్ బాబు ఇల్లు ప్రేక్షకులకూ తెలుసు. ఇప్పుడు ఆ ఇంటిని లక్ష్మీ మంచుకు రాసి ఇచ్చినట్లు వినికిడి. అందులో లక్ష్మీతో పాటు మనోజ్ ఉంటున్నారు. ఆ ఇంటిలోనే పెళ్లికి ఏర్పాట్లు చేశారు. గురువారం సంగీత్ వేడుక జరిగినట్లు తెలిసింది. మెహందీ ఫోటోలను సోషల్ మీడియాలో లక్ష్మీ మంచు షేర్ చేశారు. తమ్ముడి పెళ్లి పనులు అన్నిటినీ ఆమె దగ్గర ఉండి చూసుకుంటున్నారని సమాచారం. ఈ వివాహానికి అతికొద్ది మంది బంధు మిత్రులను మాత్రమే ఆహ్వానించారట.
Also Read : 'క్రాంతి' రివ్యూ : తొమ్మిది రోజుల్లో తీసిన సినిమా - రాకేందు మౌళి నటించిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డి గత ఏడాది సెప్టెంబర్ తొలి వారంలో భాగ్య నగరంలోని సీతాఫల్ మండిలోని వినాయక మండపంలో జంటగా కనిపించారు. ఆ సమయంలో గణనాథుడికి పూజలు చేశారు. అప్పుడే ప్రేమ విషయం బయటకు వచ్చింది. అప్పుడు పెళ్లి గురించి ప్రశ్నించగా... అది తన వ్యక్తిగత విషయం అని చెప్పారు. ఆ తర్వాత డిసెంబర్ నెలలో కడప దర్గాను మనోజ్ సందర్శించారు. అక్కడ కొత్త జీవితం ప్రారంభించనున్నట్టు, త్వరలో కొత్త కుటుంబంతో కడప దర్గాకు మళ్ళీ రావాలని ఉన్నట్టు ఆయన తెలిపారు. అప్పుడు మనోజ్, భూమిక పెళ్లి చేసుకుంటారనే స్పష్టత వచ్చింది.
ఎవరీ భూమా మౌనిక?
రాయలసీమలో బలమైన రాజకీయ నేపథ్యం కల భూమా నాగి రెడ్డి, శోభా రెడ్డి దంపతుల రెండో కుమార్తె నాగ మౌనిక. తల్లిదండ్రుల మరణం తర్వాత పిల్లలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాగి రెడ్డి, శోభా రెడ్డిల మొదటి కుమార్తె అఖిల ప్రియ రాజకీయాల్లోకి రాగా... కష్టకాలంలో అక్కకు అండగా నిలిబడుతూ, తమ నియోజకవర్గంలో కార్యకర్తలతో మౌనిక టచ్ లో ఉంటున్నారు.
మంచు మనోజ్ రెండో పెళ్లి ఇది. తొలుత ప్రణతిని మనోజ్ ప్రేమించారు. వాళ్ళిద్దరూ 2015లో పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆ వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. తమ దారులు వేర్వేరు అంటూ 2019లో విడిపోయారు. విడాకుల తర్వాత చాలా రోజులు మనోజ్ ఒంటరిగా ఉన్నారు. అటు భూమా నాగ మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో వివాహం.
Saindhav: గన్నులు, బుల్లెట్లు, బాంబులతో వస్తున్న వెంకటేష్ ‘సైంధవ్’ - రిలీజ్ డేట్ ఫిక్స్!
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
Dasara' movie: ‘దసరా’ సినిమా వెనుక 5 ఆసక్తికర విషయాలు, తెలిస్తే మిస్ చేయకుండా చూస్తారు!
Priyanka Chopra: పెళ్లికి ముందే అండాలను దాచిపెట్టాను, అమ్మే అలా చేయమంది: ప్రియాంక చోప్రా
Shaakuntalam in 3D: 3Dలో ‘శాకుంతలం’ - ఐమ్యాక్స్‌లో ట్రైలర్ చూసి, ప్రేక్షకులు ఫిదా
ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!
Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి