Manchu Manoj: మనోజ్ వద్దని ఎంతో మంది చెప్పినా ప్రొడ్యూసర్ పట్టించుకోలేదు - ఫ్యామిలీని నిలబెట్టారంటూ మంచు మనోజ్ ఎమోషనల్
Mirai Success Meet: 'మిరాయ్' మూవీలో తనను భాగం చేసినందుకు దర్శక నిర్మాతలకు రుణపడి ఉంటానని మంచు మనోజ్ అన్నారు. తన కుటుంబాన్ని నిలబెట్టారంటూ సక్సెస్ మీట్‌లో ఎమోషనల్ అయ్యారు.

Manchu Manoj Emotional Speech In Mirai Success Meet: 'మిరాయ్' సక్సెస్‌తో చాలా రోజుల తర్వాత ఫుల్ జోష్‌లో ఎంజాయ్ చేస్తున్నారు మంచు మనోజ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆయన 'మహావీర్ లామా'గా నెగిటివ్ రోల్‌లో నటించి మెప్పించారు. తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ఎమోషనల్ అయిన మనోజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
మనోజ్ వద్దని చెప్పుంటారు
'మిరాయ్' మూవీలో తనను భాగం చేసినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు మనోజ్. 12 ఏళ్ల తర్వాత బిగ్ సక్సెస్‌తో తన ఫోన్ మోగుతూనే ఉందని... ఎంతో మంది అభినందిస్తున్నప్పటికీ ఇదంతా కలలానే ఉందని చెప్పారు. 'డైరెక్టర్ కార్తిక్‌కు జన్మంతా రుణపడి ఉంటాను. నాలో ఉన్న భయాన్ని ఆయన తొలగించారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా ఎంతో ధైర్యంగా ప్రాజెక్ట్ పూర్తి చేశారు. 'మనోజ్‌తో సినిమా వద్దు' అని ఎంతో మంది ఆయనకు చెప్పి ఉంటారు. అవేవీ ఆయన పట్టించుకోలేదు. ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ అద్భుతంగా వచ్చాయి. మా టీం తెలుగు సినిమానే గర్వపడేలా చేసింది. మనోజ్ గెలవాలని కోరుకున్న అందరికీ పేరు పేరునా పాదాభివందనం చేస్తున్నా.' అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఎప్పుడు ఆ భయం ఉండేది
ఇంతకు ముందు తాను ఎక్కడికి వెళ్లినా 'అన్నా... కమ్ బ్యాక్ ఎప్పుడు?' అని అంతా ప్రశ్నించేవారని... వారితో ధైర్యంగా త్వరలోనే వస్తా అని చెప్పినా ఎక్కడో తనలో ఓ భయం ఉండేదని అన్నారు మనోజ్. 'చాలా సినిమాలు చివరిలో క్యాన్సిల్ అయ్యేవి. ఒకటి అనుకుంటే మరొకటి జరిగేది. సరిగ్గా అలాంటి టైంలోనే కార్తిక్ నన్ను నమ్మారు. నేను పెరిగినట్లు నా పిల్లల్ని పెంచగలనా అని ఎప్పుడూ భయపడుతూ ఉండేవాడిని. ఆ భయాన్ని కార్తిక్ తీసేశారు. ఆయన నన్ను మాత్రమే కాదు నా కుటుంబాన్ని కూడా నిలబెట్టారు. ఇకపై వరుసగా సినిమాలు చేస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తాను.' అంటూ చెప్పారు.
ఫస్ట్ డే కలెక్షన్స్
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మిరాయ్' హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.27.20 కోట్లు వసూళ్లు సాధించినట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. అటు ఓవర్సీస్‌లోనూ రెస్పాన్స్ అదిరిపోయింది. తొలి రోజు విదేశాల్లో 7 లక్షల డాలర్లు వసూలు చేసినట్లు తెలిపింది. దీనిపై హీరో తేజా సజ్జా స్పందిస్తూ... 'మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయ్.' అంటూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ మూవీలో తేజ సజ్జా సూపర్ యోధగా నటించారు. మహావీర్ లామాగా నెగిటివ్ రోల్‌లో మంచు మనోజ్ నటించారు. తేజ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా... జగపతిబాబు, శ్రియ, కౌశిక్ మెహతా కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ మూవీని నిర్మించారు. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ వర్క్స్‌పై సినీ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా 'మిరాయ్' మూవీని ఎంజాయ్ చేస్తున్నారు.






















