OG Ticket Bookings : పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల్లో 'ఓజీ' బుకింగ్స్ అప్పుడే!
OG Movie Bookings: తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ 'ఓజీ' సంబరాలు మొదలయ్యాయి. త్వరలోనే టికెట్ బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan's OG Ticket Advance Bookings Date In Telugu States: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ హై ఓల్టేజ్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'ఓజీ' ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూవీ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా అక్కడ 24నే ప్రీమియర్స్ కూడా పడనున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కానున్నాయి.
ఆ రోజు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్
పవర్ స్టార్ ఫ్యాన్స్ 'ఓజీ' కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా... తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్‌పై లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ నెల 19 నుంచి టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా అంతే రేంజ్‌లో ఓపెనింగ్స్ న్యూ బెంచ్ మార్క్ సెట్ చేయడం ఖాయమంటూ అటు మూవీ టీం ఇటు పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక అమెరికాలోని అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ 'ఓజీ' మూవీ ట్రెండ్ సృష్టించింది. ఆగస్ట్ 29 నుంచి ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేయగా కొద్ది రోజుల్లోనే నార్త్ అమెరికాలో 40 వేలకు పైగా టికెట్స్ సేల్ అయినట్లు తెలుస్తోంది. ఇంకా జోష్ కొనసాగుతూనే ఉంది.
టికెట్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో 'ఓజీ' టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది. రీసెంట్‌గా వచ్చిన 'హరిహర వీరమల్లు' అటు ఏపీ ఇటు తెలంగాణలోనూ టికెట్ ధరలు పెంచేందుకు అనుమతించారు. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్‌లో అందరికీ అందుబాటులో ఉండేలా కాస్త ధరలు పెంచుకునేందుకు అనుమతించారు. ఇప్పుడు 'ఓజీ' విషయంలోనూ ఏపీలో టికెట్ ధరలు పెరుగుతాయనే ప్రచారం సాగుతోంది. ప్రీమియర్ షోలకు కూడా అనుమతి ఉందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read: త్వరలోనే న్యూ అనౌన్స్‌మెంట్ - టాలీవుడ్ హీరోయిన్ ఎస్తేర్ పోస్ట్ వైరల్... రెండో పెళ్లికి రెడీయేనా?
ట్రైలర్‌కు ముందే బిగ్ సర్ ప్రైజ్!
ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన 'ఓజెస్ గంభీర', 'ట్రాన్స్ ఆఫ్ ఓమీ', లవ్ సాంగ్స్ ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఇప్పుడు మరో సాంగ్ కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అది కూడా ట్రైలర్ రిలీజ్‌కు ముందే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మరో 2 రోజుల్లో 'గన్స్ & రోజెస్' సాంగ్ రిలీజ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ట్రైలర్‌ను ఈ నెల 18న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున విజయవాడలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నెల 20న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారనే ప్రచారం సాగుతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేస్తుండగా... ప్రకాష్ రెడ్డి, జగపతిబాబు, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్ లెజెండ్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.




















