Manchu Lakshmi: మంచు ఫ్యామిలీలో గొడవలు - సైలెన్స్‌పై మంచు లక్ష్మి రియాక్షన్ ఇదే
Manchu Family Controversy: కుటుంబంలో వివాదం విషయంలో మౌనంగా ఉండడంపై మంచు లక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు. ఎవరికి నచ్చినట్లు వారు రాసుకునే రోజుల్లో సైలెన్స్ బెస్ట్ అని అన్నారు.

Manchu Lakshmi About Manchu Family Issue: కుటుంబంలో వివాదంపై ఏం చెప్పినా తల తోక లేకుండా నచ్చినట్లుగా రాసుకునే రోజులని అందుకే సైలెంట్‌గా ఉన్నట్లు మంచు లక్ష్మి తెలిపారు. 'దక్ష' ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబంలో గొడవలపై ఆమె మాట్లాడారు. ఇంట్లో ఎవరు హిట్ అందుకున్నా... అది అందరి సక్సెస్‌గా భావించి ఎంజాయ్ చేస్తానని చెప్పారు.
అందుకే సైలెన్స్
ఓ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ నలిగిపోతారని అన్నారు మంచు లక్ష్మి. 'ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అంతా బాధ పడతారు. అది ఎక్కడా ఉండేదే. కానీ మేము ఉండేది అద్దాల మేడలో... ఏం చెప్పినా ఏం చేసినా తల తోక కట్ చేసి ఎవరికి నచ్చినట్లు వారు రాసుకునే రోజులివి. అలాంటి టైంలో సైలెంట్‌గా ఉండడమే నాకు బెటర్ అనిపించింది. అందుకే సైలెంట్‌గా ఉన్నా. గతంలో ఏది తప్పు ఏది ఒప్పు అని ఆలోచించేదాన్ని.
ప్రస్తుతం అలా ఆలోచించడం మానేశాను. దాని వల్ల నేను సంతోషంగా ఉంటానా, బాధ పడతానా అనే ఆలోచిస్తున్నా. లైఫ్‌లో ఏదైనా మనకు ఒక పాఠం నేర్పేందుకే వస్తుంది. జీవితంలో ఏం జరిగినా మౌనంగా కూర్చుని ఆలోచిస్తే పరిష్కారం, ప్రశాంతత లభిస్తాయి. తద్వారా సమస్యలు ఏవైనా సులభంగా పరిష్కరించుకోవచ్చు.' అంటూ చెప్పారు.
Also Read: సందీప్ వంగాతో మహేష్ బాబు మూవీ? - 'SSMB29' తర్వాత క్రేజీ ప్రాజెక్ట్!
'మిరాయ్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నా'
ప్రస్తుతం మంచు మనోజ్‌తో పాటే మిరాయ్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పారు మంచు లక్ష్మి. 'కుటుంబంలో ఎవరికి సక్సెస్ వచ్చినా అది అందరిదిగా భావించి ఆనందిస్తా. మిరాయ్ విజయాన్ని నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా. ఒకరి కష్టం వృథా కావాలని ఎప్పుడూ కోరుకోను. జీవిత పాఠాలు నేర్చుకోవాలని అనుకుంటాను. ఈ రంగంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. 'మిరాయ్' సక్సెస్ ఎంజాయ్ చేయాలని మొన్న కలిసినప్పుడు మనోజ్‌కు చెప్పాను. ఒక ఆర్టిస్ట్‌గా వాళ్లకు సలహాలు ఇస్తాను.' అంటూ చెప్పారు.
ఇక 'దక్ష' విషయానికొస్తే చాలా రోజుల తర్వాత మంచు లక్ష్మి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఈ మూవీలో కనిపించబోతున్నారు. మోహన్ బాబు సైతం కీలక రోల్ పోషించారు. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించగా... మంచు ఎంటర్టైన్మెంట్స్, శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మూవీలో సముద్ర ఖని, విశ్వంత్, చిత్రా శుక్లా, మహేష్, వీరేన్ తంబిదొరై తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 19న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















