Pawan Kalyan: ఫోనులో పవన్ కళ్యాణ్ వినే పాట అదొక్కటే... అది ఏ సినిమాలో పాటో తెలుసా?
Pawan Kalyan Mobile Song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో పాటలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి, ఆయన ఇష్టంగా వినే పాట ఏదో తెలుసా? ఆయన ఫోనులో ఉన్న పాట ఏమిటో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వ్యక్తిత్వంతో పాటు ఆయన సినిమాలను అభిమానించే ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. పవన్ సినిమాల్లో పాటలకు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి ఆయనకు ఇష్టమైన పాట ఏది? ఆయన ఫోనులో ఉన్న పాట ఏది? అనేది తెలుసా?
సువ్వి సువ్వి... పవన్ ఫోనులో ఉన్నది!
పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా 'ఓజీ' (They Call Him OG). ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి టీం మూడు పాటలు విడుదల చేసింది. ఫస్ట్ సాంగ్ 'ఫైర్ స్ట్రోమ్...' హీరోయిజం ఎలివేట్ చేసేలా ఉంది. ఇటీవల విడుదల చేసిన 'గన్స్ అండ్ రోజెస్' సాంగ్ కూడా అంతే. యాక్షన్ నేపథ్యంలో వచ్చే పాట అని అర్థం అవుతోంది.
'ఓజీ'లో పవన్ కళ్యాణ్, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ మీద ఒక సాంగ్ తీశారు. అది 'సువ్వి సువ్వి...'. పవన్ కళ్యాణ్ ఫోనులో ఉన్న పాట కూడా అదొక్కటే. ఈ మాట 'ఓజీ' సంగీత దర్శకుడు తమన్ చెప్పారు.
Also Read: ఎక్స్‌క్లూజివ్... బాలకృష్ణ 'అఖండ 2' రిలీజ్ డేట్ ఖరారు - థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే?
View this post on Instagram
సెప్టెంబర్ 25న థియేటర్లలోకి 'ఓజీ' సినిమా రానున్న సందర్భంగా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. సంగీత దర్శకుడు తమన్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న 'తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4'లో ఓజీ స్పెషల్ ఎపిసోడ్ చేశారు. 'ఓజీ ఐడల్ పార్టీ' పేరుతో రూపొందిన ఆ కార్యక్రమానికి హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ వచ్చారు. అలాగే స్టేజిపై 'సువ్వి సువ్వి...' సింగర్ శ్రీ రంజని స్పెషల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఫోనులో సువ్వి సువ్వి పాట ఒక్కటే ఉందని తమన్ తెలిపారు. అది సంగతి.
'ఓజీ' పాటలు ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని సంగీత దర్శకుడు తమన్ ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. తమిళ సాంగ్స్, తమిళ సినిమాల్లో ఆర్ఆర్ గురించి గొప్పగా మాట్లాడే వాళ్ళందరికీ 'ఓజీ'తో సమాధానం ఇస్తానని చెప్పారు. ఆయన అన్నట్టుగానే బ్లాక్ బస్టర్ సాంగ్స్ డెలివరీ చేశారు. సినిమా మీద అంచనాలు భారీ స్థాయికి వెళ్లడంలో పాటల పాత్ర చాలా ఉంది.





















