అన్వేషించండి

Manchu Lakshmi: మంచు లక్ష్మి భర్తకు దూరంగా ఉండటానికి కారణమేంటి? ఆమెను నమ్మించి మోసం చేసిందెవరు?

నటి మంచు లక్ష్మి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. భర్తకు దూరంగా ఉండటానికి గల కారణాలను వివరించింది. అలానే స్నేహితులని నమ్మిన వాళ్ళే తనని మోసం చేసారని చెప్పి బాధ పడింది

తెలుగు ప్రేక్షకులకు మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీనియర్ నటుడు మోహన్‌ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె.. హీరోయిన్‌ గా, విలన్‌ గా, క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌ గా, టీవీ హోస్ట్ గా, ప్రొడ్యూసర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు సేవా కార్యక్రమాలతో అందరి మన్ననలు అందుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలలో విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది. అయితే ఆమె తాజాగా ఓ ఇంటర్వూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. 

మంచు లక్ష్మి 2006 లో చెన్నైకి చెందిన ఆండీ శ్రీనివాస్‌ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు సరోగసి ద్వారా ఒక పాపకి జన్మనిచ్చారు. అయితే లక్ష్మీ చాలా కాలంగా ఇండియాలోనే ఉంటుండగా, ఆమె భర్త మాత్రం అమెరికాలో ఉంటున్నారు. దీంతో వీరి పర్సనల్ లైఫ్ మీద అనేక రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో తాను ఎందుకు భర్తతో పాటు ఉండటం లేదనే విషయం మీద ఆమె లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. పెళ్లి తర్వాత తాము యూఎస్ లో ఉన్నామని, పిల్లలు కావాలనుకున్నప్పుడు ఇండియాకి వచ్చామని చెప్పింది. 

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ఇక్కడ మన దేశంలో పిల్లల్ని పెంచినట్లు అమెరికాలో పెంచలేం. అందుకే నేను ఇండియా వచ్చాను. మా ఆయన అక్కడే పనిచేస్తారు కాబట్టి అమెరికాలోనే ఉన్నారు. కానీ తరచుగా ఇక్కడకు వచ్చి కొన్ని రోజులు మాతో పాటు ఉండి వెళ్తారు. గత రెండు నెలలు ఇక్కడే ఉన్నారు. ఇటీవల పాపని తీసుకుని వెళ్లారు. ఇంకో మూడు వారాల్లో తిరిగి వస్తారు. ఆయన అమెరికాలో ఉంటారన్న మాటే కానీ, అక్కడ కన్నా ఇక్కడే ఎక్కువ ఉంటారు అని తెలిపింది.

‘‘మాకు నచ్చిన పని చేసుకుంటూ, నచ్చినట్లు ఉండాలని మేం అనుకున్నాం. కరోనా మనకు ఎంతో నేర్పింది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఎవరో ఫీల్ అవుతారని ఆయన పని వదిలేసుకొని, నా పని వదిలేసుకొని బ్రతకలేం. ఇద్దరి పీస్ ఆఫ్ మైండ్ కు తగ్గట్టుగా ఉంటున్నాం. ఇదే చాలా బాగుంది'' అని మంచు లక్ష్మి చెప్పింది. ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్లే మనల్ని మోసం చేస్తారని నటి మంచు లక్ష్మి తెలిపింది. జనాలు మోసం చెప్పినప్పుడు ఈ బ్రతుకెందుకు, నేను చచ్చిపోతే బాగుండు అని చాలా సార్లు అనిపించిందని చెప్పింది. 

''నమ్మిన వాళ్లు మోసం చేసినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది. ఆ బాధను నేను అనుభవించా. ఎదుటి వ్యక్తులు ఏం చెప్పినా నమ్మేదాన్ని. నేను మోహన్‌ బాబు గారి అమ్మాయిని కదా, నన్నెవరు మోసం చేస్తారు అనే ధీమా ఉండేది. కానీ, నన్నే మోసం చేశారు. అది కూడా తెలిసినవాళ్ళే. ఈ విషయాన్ని బయటకు వచ్చి నేను చెప్పుకోలేను. ఆ వ్యక్తులెవరో ఇప్పుడు చెప్పి అనవసరంగా వాళ్ళను ఫేమస్ చెయ్యను. నన్ను వాడుకొని వాళ్ళు పైకి వెళ్లారు. మనకు కరెక్ట్ కాదు అనుకున్నవాళ్ళని మనం దూరం పెడతాం. కానీ మనవాళ్ళు అని నమ్మించి బుట్టలో వేసినవారే మోసం చేస్తారు. వాళ్ళు 30 ఏళ్లుగా తెలుసు.. మా ఫ్యామిలీకి మంచి స్నేహితులని బాగా నమ్మా. వాళ్లను నమ్మొద్దని నాన్న ఎన్నోసార్లు చెప్పారు. నేను వినలేదు. వాళ్లు మోసం చేసినప్పుడు మనసు విరిగిపోయింది. దాని గురించి మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది. నా పాప వల్ల ఆ బాధ నుంచి బయటకు రాగలిగాను’’ అని మంచు లక్ష్మి చెప్పింది. తనపై వచ్చే మీమ్స్ చూసి ఎంజాయ్‌ చేస్తుంటానని, కానీ కొందరు కావాలని నెగెటివ్‌గా ట్రోల్స్‌ చేస్తున్నప్పుడు బాధపడిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చింది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Nandamuri Alekhya: మోడలింగ్‌లోకి నందమూరి అలేఖ్య... కెరీర్ రీస్టార్ట్ చేసిన తారకరత్న భార్య
మోడలింగ్‌లోకి నందమూరి అలేఖ్య... కెరీర్ రీస్టార్ట్ చేసిన తారకరత్న భార్య
GDN Release : మిరాకిల్ మ్యాన్ మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ స్టోరీ... ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌
మిరాకిల్ మ్యాన్ మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ స్టోరీ... ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌
Bhari Movie: 'బరి'లో తండ్రీ కొడుకులు... తొలిసారి నాగబాబు, వరుణ్ తేజ్ కలిసి
'బరి'లో తండ్రీ కొడుకులు... తొలిసారి నాగబాబు, వరుణ్ తేజ్ కలిసి
Makutam Trailer: శుక్రవారమే మకుటం ట్రైలర్ రిలీజ్... విశాల్ ఏం చేస్తాడో?
శుక్రవారమే మకుటం ట్రైలర్ రిలీజ్... విశాల్ ఏం చేస్తాడో?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget