అన్వేషించండి

Gangster Movies: ప్రభాస్ to పవన్ కల్యాణ్, బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అవుతున్న గ్యాంగ్‌స్టర్స్!

ప్రభాస్ నుంచి పవన్ కల్యాణ్ వరకూ పలువురు స్టార్ హీరోలు గ్యాంగ్‌స్టర్ జోనర్ లో సినిమాలు చేస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఆ చిత్రాలంటే తెలుసుకుందాం.

గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. గత 80 ఏళ్లలో ఇదే జోనర్ లో భాషతో సంబంధం లేకుండా ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో గ్యాంగ్‌స్టర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ పలువురు స్టార్ హీరోలు గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేస్తున్నారు. బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్న పాన్ ఇండియా మూవీస్ ఏంటో చూద్దాం.

సలార్:
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'సలార్'. గ్యాంగ్‌స్టర్ బ్యాక్ డ్రాప్ లో భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. KGF తర్వాత దర్శకుడు 2 పార్ట్స్ గా తీసుకున్న మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా డార్లింగ్ లుక్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. లేటెస్టుగా వచ్చిన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మళయాళ స్టార్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని 2023 సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

OG:
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో OG ఒకటి. సాహో ఫేం సుజిత్ రెడ్డి దీనిని దర్శకుడు. ఇదొక పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామా అని తెలుస్తోంది. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ ను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు. DVV ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించబడుతున్న ఈ సినిమాని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పుష్ప 2:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ ''పుష్ప: ది రైజ్''. గతేడాది చివర్లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'పుష్ప : ది రూల్' సినిమాకి రెండో భాగమిది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్.. ఎర్ర చందనం సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది మొదటి భాగంలో చూపించారు. ఇప్పుడు రెండో భాగంలో గ్యాంగ్ స్టర్ గా పుష్పరాజ్ జీవితాన్ని చూపించబోతున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.

Also Read: Allu Arjun - Trivikram Movie: మహాభారతం స్ఫూర్తితో త్రివిక్రమ్ - బన్నీ సినిమా?

లియో:
కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ తమిళ్ మూవీ 'లియో'. ఖైదీ, విక్రమ్ ఫేం లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. లోకి సినిమాటిక్ యూనివర్స్ (LCU) ఫ్రాంచైజీలో భాగంగా గ్యాంగ్ స్టర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. సంజయ్ దత్, అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దసరా కానుకగా 2023 అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది.

కింగ్ ఆఫ్‌ కోట (KOK):
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కింగ్ ఆఫ్‌ కోట'. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ అభిలాష్ జోషి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలయిన టీజర్ కు విశేష స్పందన లభించింది. ఇందులో ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, అనిఖా సురేంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జి స్టూడియోస్ సంస్థతో కలిసి దుల్కర్ తన సొంత ప్రొడక్షన్ లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2023 ఆగస్టు 25న ఈ చిత్రం రిలీజ్ అవుతుంది.

యానిమల్:
'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'యానిమల్'. గ్యాంగ్ స్టర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, తృప్తి దిమ్రి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ కుమార్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే లీకైన రణ్ బీర్ గ్యాంగ్ స్టర్ లుక్ ఫ్యాన్స్ లో ఆసక్తిని కలిగించింది. ఇటీవల వచ్చిన టీజర్ అంచనాలను రెట్టింపు చేసింది. టీ సిరీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాని 2023 డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

Also Read : ప్రాజెక్ట్-K బిగ్ అప్‌డేట్, అంతర్జాతీయ వేదికపై టైటిల్ రివీల్ - ఎక్కడంటే?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget