By: ABP Desam | Updated at : 21 Sep 2023 08:16 PM (IST)
Photo Credit : Manchu Lakshmi Siima/Twitter
టాలీవుడ్ లో సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మి. ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టిన ఈమె వరుస సినిమాలు చేస్తూ మరోపక్క వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కోసారి ఆమె చేసే పోస్టులన్నీ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. అందుకు రీజన్ ఏంటో తెలియకపోయినా కొన్నిసార్లు మంచి లక్ష్మిని సోషల్ మీడియాలో నెటిజెన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఆ ట్రోలింగ్ పట్టించుకోని మంచి లక్ష్మి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది.
అయితే తాజాగా మంచు లక్ష్మికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ గా మారింది. అందుకు కారణం ఆ వీడియోలో మంచి లక్ష్మి ఓ వ్యక్తి మీద చేయి చేసుకోవడమే. ఇంతకీ మేటర్ ఏంటంటే.. కొద్ది రోజుల క్రితం దుబాయ్ వేదికగా సైమా అవార్డుల వేడుక జరిగిన విషయం తెలిసిందే కదా. దక్షిణ భారతదేశానికి చెందిన చాలామంది సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. మంచి లక్ష్మి కూడా సైమా అవార్డ్స్ ఫంక్షన్ కి హాజరయ్యారు. ఈ క్రమంలోనే వేదిక బయట మంచు లక్ష్మి మాట్లాడుతుండగా ఓ వ్యక్తి కెమెరాకు అడ్డంగా వెళ్లడంతో కోపంగా ఆ వ్యక్తి వీపు మీద కొట్టింది. ఆ తర్వాత కెమెరా వైపు తిరిగి మాట్లాడుతుంటే మరో వ్యక్తి అడ్డు వచ్చాడు.
Hello Durrrrrrr....#lakshmiManchu #ManchuLakshmi #SIIMA2023 #SIIMAAwards2023 #SIIMA #viralvideo #Trending #Memes pic.twitter.com/HMNxbB4UYh
— Coffee in a Chai Cup (@coffeeinachaic1) September 21, 2023
దాంతో కోపంగా "డ్యూడ్ కెమెరాకు అడ్డు రాకుండా ఉండాలనేది మినిమం బేసిక్స్" అంటూ మంచు లక్ష్మి అతనిపై ఫైర్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అయితే వీరిలో చాలామంది మాత్రం మంచి లక్ష్మి ఇంత చిన్న విషయానికి అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదంటూ ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. ఇక తాజాగా జరిగిన సైమా అవార్డు ఫంక్షన్ లో బెస్ట్ యాక్టర్ గా జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.
సైమా అవార్డ్స్ కోసం ఎన్టీఆర్ ప్రత్యేకంగా దుబాయ్ వెళ్లడం, ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ కి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యింది. ఇక మంచు లక్ష్మి విషయానికొస్తే.. ప్రస్తుతం ఈమె ప్రధాన పాత్రలో 'అగ్ని నక్షత్రం' అనే సినిమా తెరకెక్కుతోంది. మంచు ఎంటర్టైన్మెంట్ అండ్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు, మంచు లక్ష్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మంచి లక్ష్మి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనుంది. మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వంశీకృష్ణ దర్శకత్వంలో ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ మర్డర్ మిస్టరీగా రూపొందుతున్న ఈ సినిమాలో సముద్రఖని, విస్వంత్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read : డబ్బు కోసం రమ్యకృష్ణని పెళ్లి చేసుకోలేదు - సోలోగా ఉండాలనుకున్నా: కృష్ణవంశీ
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Animal: 'యానిమల్'లో హీరోయిన్‌గా ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేశారా? అసలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా
Nani : విజయ్, రష్మిక ప్రైవేట్ పిక్ కాంట్రవర్సీపై స్పందించిన నాని!
రికార్డులు బద్దలుకొడుతున్న ‘సలార్’ ట్రైలర్, రూ.230 కోట్లు దాటిన ‘యానిమల్’ - నేటి టాప్ సినీ విశేషాలివే!
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
Bhatti Vikramarka: సీఎం పదవి వస్తే బాధ్యతగా చేస్తా - భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
/body>