Ra Ra Hussooru Nattho Song : నరేష్, పవిత్రల 'మళ్ళీ పెళ్లి'లో రెయిన్ సాంగ్ - రేపే విడుదల
Malli Pelli Movie Songs : నరేష్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన సినిమా 'మళ్ళీ పెళ్లి'. ఇందులో ఓ పాట విడుదల చేశారు. మరో పాటను రేపు విడుదల చేయనున్నారు.
![Ra Ra Hussooru Nattho Song : నరేష్, పవిత్రల 'మళ్ళీ పెళ్లి'లో రెయిన్ సాంగ్ - రేపే విడుదల Malli Pelli movie Ra Ra Hussooru Nattho Song from Naresh Pavitra Lokesh's will be out on tomorrow Ra Ra Hussooru Nattho Song : నరేష్, పవిత్రల 'మళ్ళీ పెళ్లి'లో రెయిన్ సాంగ్ - రేపే విడుదల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/04/74a3ccee75ab749a6fc40dffccf09d7a1683181611339313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నవరస రాయ డా. నరేష్ విజయకృష్ణ (Naresh) కథానాయకుడిగా రూపొందిన సినిమా 'మళ్ళీ పెళ్లి' (Malli Pelli Movie). ఇందులో ఆయనకు జోడీగా, కథానాయికగా ప్రముఖ నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) నటించారు. వాళ్ళిద్దరిపై తీసిన 'ఉరిమే మేఘమా...' పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. సినిమాలో తొలి గీతమది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేయడానికి రెడీ అయ్యారు.
'రా రా హోసూరు నాతో'... రేపే విడుదల!
Rara Hussooru Nattho Song : 'మళ్ళీ పెళ్లి' చిత్రంలోని 'రా రా హోసూరు నాతో' పాటను శుక్రవారం ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఆల్రెడీ విడుదల చేసిన 'ఉరిమే మేఘమా...' పాటకు మంచి స్పందన లభిస్తోందని సంతోషం వ్యక్తం చేసింది. 'రా రా హోసూరు నాతో' సాంగ్ స్టిల్స్ చూస్తే... నరేష్, పవిత్రా లోకేష్ జంటతో పాటు మరో జంట కూడా ఉంటుందని అర్థమైంది. వాళ్ళు ఎవరనేది రేపు తెలుస్తుంది.
Also Read : శరత్ బాబును చంపేసిన సెలబ్రిటీలు - సోషల్ మీడియాలో అంతే!
It's Time for the Mesmerising Single #RaraHussooruNattho 🎶 from #MalliPelli 💞
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) May 4, 2023
Releasing Tomorrow @ 11.11 AM 😍#MalliPelliOnMay26 💥#PavitraLokesh @MSRajuOfficial @vanithavijayku1@sureshbobbili9 @ArulDevofficial @VKMovies_ @adityamusic pic.twitter.com/ageCinP9le
మే 26న 'మళ్ళీ పెళ్లి' విడుదల
Malli Pelli Release On May 26th : వేసవిలో 'మళ్ళీ పెళ్లి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ నెల 26న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
Also Read : డివోర్స్ ఫోటోషూట్‌తో వైరల్ అయిన నటికి కొత్త సమస్య? - భర్త ఒక్కడే కాదు, ఇంకా 99!
'మళ్ళీ పెళ్లి' చిత్రానికి మెగా మూవీ మేకర్ ఎం.ఎస్. రాజు (MS Raju) దర్శకుడు. నరేష్ విజయ కృష్ణ నిర్మాత. దీంతో లెజెండరీ ప్రొడక్షన్ హౌస్ విజయ కృష్ణ మూవీస్ సంస్థను పున:ప్రారంభించారు. సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా 'మళ్ళీ పెళ్లి' అని, ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఆయన తెలిపారు.
ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన తొలి పాట!
ఇటీవల సినిమాలో తొలి పాట 'ఉరిమే కాలమా...'ను విడుదల చేశారు. ఆ గీతానికి అనంత శ్రీరామ్ (Anantha Sriram) సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. సురేష్ బొబ్బిలి అందించిన బాణీ అందించారు. లేటు వయసులో ప్రేమలో పడిన ఓ జంట పరిస్థితిని పాటలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇక, టీజర్ చూస్తే నరేష్, పవిత్ర నిజ జీవితంలో జరిగిన అంశాలతో సినిమా తీసినట్లు అర్థం అవుతోంది. నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి ఆరోపణలు... ఆమె ప్రెస్ మీట్... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నానని హోటల్ కు వెళ్లడం... ఆ మధ్య బెంగళూరులో నడిచిన హై డ్రామా... 'మళ్ళీ పెళ్లి' టీజర్ చూస్తే అవన్నీ గుర్తుకు వస్తాయి.
జయసుధ, శరత్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్న 'మళ్ళీ పెళ్లి' సినిమాలో వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)