By: ABP Desam | Updated at : 10 Apr 2022 11:50 AM (IST)
'హర హర వీరమల్లు' సినిమాలో పవన్ కల్యాణ్... శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన స్టిల్
Hari Hara Veera Mallu Movie Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా. ఆయన కథానాయకుడిగా రూపొందుతోన్న లేటెస్ట్ సినిమా 'హరి హర వీరమల్లు' యూనిట్ రోజుకు ఒక కొత్త అప్‌డేట్‌తో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేస్తోంది. రీసెంట్‌గా సినిమా యాక్షన్ షెడ్యూల్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఫైట్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో కూడా విడుదల చేశారు. అందులో పవన్ విన్యాసాలు ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చాయి.
ఇక, ఈ రోజు శ్రీరామ నవమి (Sri Rama Navami Special) సందర్భంగా ఈ రోజు కొత్త స్టిల్ విడుదల చేసింది. అందులో రెండు చేతుల్లో రెండు ఈటెలతో పవన్ కల్యాణ్ కనిపించారు. కళ్ళలో పవర్, ఈ కొత్త స్టిల్ ఫ్యాన్స్‌కు ఫుల్‌గా నచ్చేసింది. మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది.
Also Read: వీరమల్లు షూటింగ్‌కు ముందు పవన్ కల్యాణ్ శ్రీరామ నవమి పూజ
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Hari Hara Veera Mallu (@hhvmfilm)
పవన్ కల్యాణ్ సరసన నిధీ అగర్వాల్ (Nidhi Agarwal) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో నర్గిస్ ఫక్రి (Nargis Fakhri) కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ ఏడాది విజయ దశమికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అయితే... యూనిట్ నుంచి అధికారిక ప్రకటన ఏదీ లేదు.
Naa Saami Ranga Release Date : 'నా సామిరంగ' రిలీజ్ డేట్ ఫిక్స్ - నాగార్జున సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?
ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కంగనా - ఆసక్తికరంగా 'తేజస్' టీజర్!
MAD Trailer: స్టార్టింగ్ టు ఎండింగ్ నవ్వులే నవ్వులు- 'మ్యాడ్' ట్రైలర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!
Rana Daggubati In Thalaivar 170 : అవును, రజనీకాంత్ సినిమాలో రానా - ఇట్స్ అఫీషియల్!
Salman Khan - Somy Ali : నన్ను వాడుకుని సంగీతను సల్మాన్ మోసం చేశాడు - పాకిస్తాన్ నటి సంచనల ఆరోపణలు
KTR Tweet on MODI: మోదీజీ మూడు హామీల సంగతేంటి- ప్రధాని పర్యటనపై కేటీఆర్ కౌంటర్
Amaravati Farmers : కౌలుకూ నోచుకోని అమరావతి రైతులు - వారిపై ప్రభుత్వానికి అంత పగ ఎందుకు ?
India Vs Nepal: ఏసియన్ గేమ్స్‌లో సెమీస్‌లోకి భారత క్రికెట్ జట్టు - నేపాల్‌పై ఘన విజయం
Telangana Congress Side Effects : తెలంగాణ కాంగ్రెస్‌కు చేరికల సైడ్ ఎఫెక్టులు - బుజ్జగించలేకపోతున్నారా ?
/body>