అన్వేషించండి

NTR Neel Movie: ఎన్టీఆర్ నీల్ మూవీకి కొత్త టైటిల్! - అసలు కారణం అదేనా?

NTR: ఎన్టీఆర్ నీల్ కాంబో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీపై హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి 'డ్రాగన్' అనే టైటిల్ ప్రచారంలో ఉండగా.. మరో కొత్త టైటిల్ కోసం మేకర్స్ చూస్తున్నారట.

Makers Looking For New Title To NTR Neel Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' (ప్రచారంలో ఉన్న టైటిల్). ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. తాజాగా ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ టైటిల్ మారుస్తారనే ప్రచారం సాగుతోంది.

అసలు కారణం ఏంటంటే?

ఈ మూవీకి కొత్త టైటిల్ కోసం నిర్మాతలు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి 'డ్రాగన్' అనే టైటిల్ పెడతారని ప్రచారం సాగింది. ఇప్పటికీ సోషల్ మీడియాలోనూ.. మూవీ అప్‌డేట్స్ విషయంలోనూ ఇదే టైటిల్ అంటూ పేర్కొన్నారు. అయితే.. 'డ్రాగన్' ఇటీవలే వచ్చిన తమిళ మూవీ పేరుతో రిజిస్టర్ అవడం వల్ల సమస్య తలెత్తింది. దీన్ని 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' పేరుతో తెలుగులోనూ డబ్ చేశారు. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా.. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు.

ఎన్టీఆర్ 'డ్రాగన్' వేరే లెవల్‌లో ఉంటుందని అప్పట్లోనే నిర్మాత కామెంట్స్ చేశారు. దీంతో సినిమా టైటిల్ కూడా అదే కన్ఫర్మ్ చేశారంటూ అంతా భావించారు. ఇప్పటికే ఈ పేరు తమిళ మూవీ పేరుతో రిజిస్టర్ కావడం, చట్టపరమైన చిక్కులు, ఫ్యాన్స్‌కు కన్ఫ్యూజన్ లేకుండా వేరే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట. ఎన్టీఆర్ రేంజ్, భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఏ టైటిల్ పెడతారో అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Also Read: కోహ్లీ లైక్‌తో అవనీత్‌కు 20 లక్షల మంది ఫాలోవర్స్ - రకుల్ ప్రీత్ సింగ్ రియాక్షన్ ఇదే!

ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన 'సప్తసాగరాలు దాటి' ఫేం రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, టి సిరీస్ ఫిలిమ్స్ ‌(గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్) సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ ‌వై నిర్మిస్తున్నారు. రవిబ్రసూర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక యాక్షన్ సీన్స్ షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. అయితే, అనుకోని కారణాలతో జూన్ 25,  2026న రిలీజ్ చేస్తామని ఇటీవలే ప్రకటించారు.

ఫ్యాన్స్‌కు నిరాశే..

ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేస్తారని అంతా భావించారు. అయితే.. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'వార్ 2' నుంచి అప్డేట్ ఉందని దీన్ని వాయిదా చేశారు. 'వార్ 2' నుంచి ఆ రోజున టీజర్ రిలీజై ఫ్యాన్స్‌కు  గూస్ బంప్స్ తెప్పించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Embed widget