Rakul Preet Singh: కోహ్లీ లైక్‌తో అవనీత్‌కు 20 లక్షల మంది ఫాలోవర్స్ - రకుల్ ప్రీత్ సింగ్ రియాక్షన్ ఇదే!
Avneet Kaur: బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్‌కు విరాట్ కోహ్లీ లైక్‌తో 20 లక్షల మంది ఫాలోవర్స్ పెరిగారని.. ప్రమోషన్స్ కూడా ఎక్కువయ్యాయనే వార్తలపై హీరోయిన్ రకుల్ స్పందించారు.

Rakul Preet Singh Reaction On Avneet Kaur Follwers: బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్ ఫోటో కింద స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లైక్ చేయడం ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. దీనిపై విరాట్ కోహ్లీ ఇన్ స్టా ఫీడ్ క్లియర్ చేస్తుండగా పొరపాటున లైక్ బటన్ ప్రెస్ అయ్యిందంటూ క్లారిటీ ఇచ్చారు. అయినా.. ఇంకా దీనిపై రచ్చ సాగుతూనే ఉంది.
2 మిలియన్ ఫాలోవర్స్.. రకుల్ రియాక్షన్
కోహ్లీ లైక్ కొట్టిన తర్వాత అవనీత్‌కు ఏకంగా 2 మిలియన్ల మంది ఫాలోవర్స్ పెరిగారు. దీనిపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా రియాక్ట్ అయ్యారు. దేశంలో మనం ఇంత ఖాళీగా ఉన్నామంటూ తనదైన స్టైల్‌లో సెటైర్లు వేశారు. 'ఇది చాలా బాధ కలిగించే విషయం. మనమంతా ఇంత ఖాళీగా ఉన్నామా? అనిపించింది. అతడి లైక్ ఆమెకు 2 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను పెంచింది. ఆ లైక్ ఉద్దేశపూర్వకంగా చేశారా.. పొరపాటున జరిగిందా? అనేది కూడా ఆలోచించలేదు.
ఇన్ స్టాలో ఒక్కోసారి పొరపాటున మన స్నేహితులను కూడా అన్ ఫాలో అవుతుంటాం. కానీ, కోహ్లీ సెలబ్రిటీ కావడంతో అతనికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు కూడా వైరల్ చేస్తున్నారు. ఇది చాలా విచారకరం. దీనిపై ఆయన వివరణ కూడా ఇచ్చారు. సెలబ్రిటీలకు సంబంధించి చిన్న చిన్న విషయాలను కూడా చాలా జాగ్రత్తగా పెద్దవిగా చూస్తున్నారు. సోషల్ మీడియాలో చాలామంది టైం వృథా చేస్తున్నారు. నా దృష్టిలో ఇది అనవసరం.' అని అన్నారు.
Also Read: 'ఖలేజా' రీ రిలీజ్‌లో బిగ్ ట్విస్ట్ - మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం.. అసలు కారణం ఏంటో తెలుసా?
అసలేం జరిగిందంటే?
కొద్ది రోజుల కిందట బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్ (Avneet Kaur) ఫోటో కింద విరాట్ కోహ్లీ లైక్ కనిపించింది. బోల్డ్ ఫోటోస్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేసే ఈమె ఫోటోకు కోహ్లీ ఎందుకు లైక్ కొట్టారంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. అసలేం జరిగిందో తెలుసుకునే లోపే నెటిజన్లు ఇష్టం వచ్చినట్లు ఈ స్క్రీన్ షాట్స్ వైరల్ చేస్తూ రచ్చ చేసేశారు. ఈ క్రమంలో దీనిపై స్వయంగా విరాట్ కోహ్లీనే స్పందించి వివరణ ఇచ్చారు. తన ఇన్ స్టా ఫీడ్ క్లియర్ చేసేటప్పుడు.. బహుశా అల్గారిథం మిస్టేక్ వల్ల ఇలా జరిగి ఉండొచ్చంటూ క్లారిటీ ఇచ్చారు. దీని వెనుక ఎలాంటి ఉద్దేశం కూడా లేదని.. అనవసర ఊహాగానాలు చెయ్యొద్దని కోరారు. ఈ పోస్ట్ పెట్టిన తర్వాత ఇన్ స్టా అల్గారిథం మిస్టేక్ వల్ల అని అనడంతో దానిపైనా నెటిజన్లు పోస్టులు పెట్టారు.
అయితే, కోహ్లీ లైక్ తర్వాత అవనీత్‌కు ఏకంగా 2 మిలియన్ల మంది ఫాలోవర్స్ పెరిగారని.. ఆమెకు ప్రమోషన్స్ కూడా ఎక్కువవుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపైనే తాజాగా రకుల్ స్పందించారు. సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిందంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం రకుల్ 'ఇండియన్ 3'లో నటిస్తున్నారు.





















