Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' నిర్మాత ఏఎం రత్నంకు అస్వస్థత! - టీం ఫుల్ క్లారిటీ
AM Ratnam: ఓ వైపు పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' రిలీజ్ పనులు శరవేగంగా సాగుతుండగా.. మరోవైపు నిర్మాత ఏఎం రత్నం అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన మేనేజర్ క్లారిటీ ఇచ్చారు.

AM Ratnam Fell Ill Due To Hari Hara Veera Mallu Release Busy Schedule: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అవెయిటెడ్ పీరియాడికల్ అడ్వెంచరస్ మూవీ 'హరిహర వీరమల్లు'. పలుమార్లు వాయిదా తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మూవీ టీం రిలీజ్ పనుల్లో బిజీగా ఉంది.
నిర్మాతకు అస్వస్థత.. టీం క్లారిటీ
ఈ సినిమాకు సంబంధించి రీ రికార్డింగ్ వర్క్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ క్రమంలో నిర్మాత ఏఎం రత్నం శుక్రవారం అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చాయి. ఆయన హైబీపీతో కళ్లు తిరిగి పడిపోయారని.. ఒమేగా ఆస్పత్రి వైద్యులు ఆయనకు చికిత్స అందించారనే ప్రచారం సాగింది. సినిమా రిలీజ్ షెడ్యూల్ టెన్షన్స్ కారణంగానే నిర్మాత అస్వస్థతకు గురయ్యారనే టాక్ వినిపించింది.
దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పీఆర్ఓ స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని.. ఏఎం రత్నం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. అవాస్తవాలు ప్రచారం చేయడం వల్ల అనవసర ఆందోళనలకు గురి చేస్తున్నారని.. వదంతులు నమ్మొద్దని సూచించారు.
The speculation regarding AM Ratnam’s health is completely incorrect. At this time, spreading unverified information only causes unnecessary concern. Let’s respect the truth and stop fueling baseless rumors.#HariHaraVeeraMallu
— L.VENUGOPAL🌞 (@venupro) May 30, 2025
పవన్ డబ్బింగ్ పూర్తి
ఈ సినిమాలో తన డబ్బింగ్ వర్క్‌ను ఇటీవలే పవన్ కల్యాణ్ పూర్తి చేశారు. కేవలం 4 గంటల్లోనే ఆయన డబ్బింగ్ వర్క్ ఫినిష్ చేశారని మూవీ టీం ట్వీట్ చేసింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజా పాలనలో బిజీగా ఉన్న పవన్ ఉన్న కాస్త టైంలో తాను సైన్ చేసిన మూవీస్ కంప్లీట్ చేస్తున్నారు. ప్రస్తుతం 'సుజీత్' దర్శకత్వంలో 'ఓజీ' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ విలన్ ఇమ్రాన్ హష్మీ డెంగ్యూ బారిన పడగా.. ఆయన అవసరం లేని సీన్స్‌ను పవన్‌పై త్వరగా కంప్లీట్ చేస్తున్నారు డైరెక్టర్.
హరిహర వీరమల్లు గురించి..
మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో పవన్ కల్యాణ్ వీర యోధుడిగా 'హరిహర వీరమల్లు'లో కనిపించనున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ రోల్‌లో నటించారు. వీరితో పాటు అనుపమ్ ఖేర్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, సత్యరాజ్, పూజిత పొన్నాడ, అనసూయ తదితరులు తదితరులు కీలకపాత్రలు పోషించారు. నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.దయాకర్‌రావు మూవీని నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. ఫస్ట్ పార్ట్ 'స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో తెరకెక్కుతోంది. ఈ మూవీ సగ భాగాన్ని క్రిష్ డైరెక్ట్ చేయగా.. మిగిలిన భాగాన్ని ఎఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ తెరకెక్కించారు. రెండో పార్ట్‌ను కూడా ఆయనే తెరకెక్కించనున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ మూవీ వస్తుండడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





















