Gaddar Film Awards: 2014 - 2023 సినిమాలకు గద్దర్ అవార్డులు - బెస్ట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే
Gaddar Awards: 2014 నుంచి 2023 వరకూ రిలీజ్ అయిన సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించింది. ప్రతి ఏటా 3 సినిమాలకు అవార్డులు ప్రకటించారు.

Gaddar Film Awards For 2014 To 2023 Winners List: తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను శుక్రవారం ప్రకటించింది. ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుతో కలిసి సీనియర్ నటుడు మురళీ మోహన్ ఈ అవార్డులను ప్రకటించారు. 2014 నుంచి 23 వరకు ఏడాదికి ఒకటి చొప్పున బెస్ట్ ఫిల్మ్స్‌కు పురస్కారాలు ప్రకటించారు. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన మూవీస్ లిస్ట్‌లో తీసుకున్నారు. ప్రతి ఏటా 3 సినిమాలకు అవార్డులు ప్రకటించారు.
బెస్ట్ ఫిల్మ్స్ ఇవే..
- 2014 బెస్ట్ ఫిల్మ్స్ - రన్ రాజా రన్ (ఫస్ట్), పాఠశాల (సెకండ్), అల్లుడు శీను (థర్డ్)
- 2015 బెస్ట్ ఫిల్మ్స్ - రుద్రమదేవి (ఫస్ట్), కంచె (సెకండ్), శ్రీమంతుడు (థర్డ్)
- 2016 బెస్ట్ ఫిల్మ్స్ - శతమానంభవతి (ఫస్ట్), పెళ్లిచూపులు (సెకండ్), జనతాగ్యారేజ్ (థర్డ్)
- 2017 బెస్ట్ ఫిల్మ్స్ - బాహుబలి 2 (ఫస్ట్), ఫిదా (సెకండ్), ఘాజీ (థర్డ్)
- 2018 బెస్ట్ ఫిల్మ్స్ - మహానటి (ఫస్ట్), రంగస్థలం (సెకండ్), కేరాఫ్ కంచరపాలెం (థర్డ్)
- 2019 బెస్ట్ ఫిల్మ్స్ - మహర్షి (ఫస్ట్), జెర్సీ (సెకండ్), మల్లేశం (థర్డ్)
- 2020 బెస్ట్ ఫిల్మ్స్ - అల వైకుంఠపురములో (ఫస్ట్), కలర్ ఫోటో (సెకండ్), మిడిల్ క్లాస్ మెలోడీస్ (థర్డ్)
- 2021 బెస్ట్ ఫిల్మ్స్ - ఆర్ఆర్ఆర్ (ఫస్ట్), అఖండ (సెకండ్), ఉప్పెన (థర్డ్)
- 2022 బెస్ట్ ఫిల్మ్స్ - సీతారామం (ఫస్ట్), కార్తికేయ 2 (సెకండ్), మేజర్ (థర్డ్)
- 2023 బెస్ట్ ఫిల్మ్స్ - బలగం (ఫస్ట్), హనుమాన్ (సెకండ్), భగవంత్ కేసరి (థర్డ్)
స్పెషల్ జ్యూరీ అవార్డ్స్
అలాగే, ఎన్టీఆర్ అవార్డుకు బాలకృష్ణ, పైడి జయరాజ్ అవార్డుకు మణిరత్నం, బీఎన్ రెడ్డి అవార్డుకు డైరెక్టర్ సుకుమార్, నాగిరెడ్డి చక్రపాణి అవార్డుకు అట్లూరి పూర్ణచంద్రరావు, కాంతారావ్ ఫిల్మ్ అవార్డుకు విజయ్ దేవరకొండ, రఘపతి వెంకయ్య అవార్డుకు యండమూరి వీరేంద్రనాథ్‌లను ఎంపిక చేసినట్లు చెప్పారు.
Also Read: 'ఖలేజా' రీ రిలీజ్‌లో బిగ్ ట్విస్ట్ - మహేష్ బాబు ఫ్యాన్స్ ఆగ్రహం.. అసలు కారణం ఏంటో తెలుసా?
దాదాపు 14 ఏళ్ల తర్వాత గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2024 ఏడాదికి సంబంధించి గద్దర్ అవార్డులను గురువారం ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజుతో కలిసి జ్యూరీ ఛైర్ పర్సన్ జయసుధ మీడియా సమావేశంలో అవార్డులు ప్రకటించారు. ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా.. ప్రభాస్ 'కల్కి 2898 ఏడి', సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా 'పొట్టేల్', థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా'లక్కీ భాస్కర్' మూవీస్ ను అవార్డులు వరించాయి.
జాతీయ సమైక్యత, మత సామరస్యం, సామాజిక అభ్యున్నతిపై బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ - కమిటీ కుర్రోళ్లు, ఉత్తమ ప్రజాదరణ చిత్రం - ఐ అండ్ మై ఫ్రెండ్స్, హిస్టరీ విభాగంలో ఫీచర్ హెరిటేజ్ మూవీ - రజాకార్, ఉత్తమ బాలల చిత్రం - 35 ఇది చిన్న కథ కాదు, ఉత్తమ పరిచయ దర్శకుడు - యధువంశీ (కమిటీ కుర్రవాళ్లు)లకు అవార్డులు దక్కాయి. అలాగే.. బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ (పుష్ప 2), బెస్ట్ యాక్ట్రెస్‌గా నివేదా థామస్ (35 ఇది చిన్న కథ కాదు), బెస్ట్ డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్ (కల్కి), బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా SJ సూర్య (సరిపోదా శనివారం), బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)లను పురస్కారాలు వరించాయి.






















