By: ABP Desam | Updated at : 27 May 2022 03:41 PM (IST)
'మేజర్' సినిమాలో అడివి శేష్, సయీ మంజ్రేకర్, రేవతి
థియేటర్లలో టికెట్ రేట్ ఎంత? ప్రస్తుతం ఈ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే... ఒక్కో సినిమాకు ఒక్కో రేటు వసూలు చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2' సినిమాలకు తెలంగాణాలో, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో నాలుగు వందలకు పైగా వసూలు చేశారు. సింగల్ స్క్రీన్లలో రెండు వందలకు పైగా ఉంది. 'ఎఫ్ 3' సినిమాకు టికెట్ రేట్స్ పెంచడం లేదని నిర్మాత 'దిల్' రాజు ప్రకటించారు. అయితే... ఆ సినిమాకు మల్టీప్లెక్స్‌లలో 300, సింగల్ స్క్రీన్లలో 175 వరకూ అమ్మారు. 'మేజర్' సినిమాకు మాత్రం నిజంగా టికెట్ రేట్లు తగ్గించారు.
అడివి శేష్ కథానాయకుడిగా నటించిన సినిమా 'మేజర్'. ముంబై ఉగ్రదాడిలో అమరులైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ఇది. ఈ సినిమాకు తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేటు 195 రూపాయలు, సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు 150 రూపాయలుగా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో మల్టీప్లెక్స్ టికెట్ రేటు 177, సింగిల్ స్క్రీన్ రేటు 147 రూపాయలుగా నిర్ణయించారు. కరోనా తర్వాత తక్కువ టికెట్ రేటు వసూలు చేస్తున్న చిత్రమిదే.
Also Read: 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?
శివకార్తికేయన్ 'కాలేజ్ డాన్' సినిమాకు తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లలో రూ. 200 టికెట్ రేటు ఉంది. టామ్ క్రూజ్ 'టాప్ గన్: మావెరిక్'కు కూడా సేమ్ రేటు. ఆ రెండు సినిమాలతో పోల్చినా... 'మేజర్' టికెట్ రేటు ఐదు రూపాయలు తక్కువే.
Alia Bhatt On First Night: బాగా అలసిపోయాం- ఫస్ట్ నైట్పై ఆలియా భట్ బోల్డ్ కామెంట్
Kalyaan Dhev: కూతురి బర్త్ డే, విష్ చేయని కళ్యాణ్ దేవ్ - తెరపైకి మరోసారి శ్రీజ విడాకుల వ్యవహారం!
Shruti Haasan Health: క్రిటికల్ కండిషన్ లో శృతిహాసన్ - రూమర్స్ పై మండిపడ్డ నటి!
Regina Cassandra: 2019లో కులు మనాలి రూమ్‌లో ఒకటి జరిగింది, అతడిని మిస్సవుతున్నా - ఆలీతో రెజీనా
Vijay Sethupathi: రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో విజయ్ సేతుపతి - పాన్ ఇండియా లెవెల్లో!
IND vs ENG, 5th Test: ఓటమికి తోడు టీమ్ఇండియాకు మరో షాక్! WTC ఫైనల్ అర్హతకు ప్రమాదం!
Pegasus House Committee : గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది - నివేదికను అసెంబ్లీకిస్తామన్న భూమన !
జియో యూజర్స్‌కు గుడ్ న్యూస్, ఈ ప్లాన్స్ తీసుకుంటే Netflix, Amazon Prime సబ్స్క్రిప్షన్ ఉచితం
KCR BRS Postpone : కేసీఆర్ జాతీయ పార్టీ ఇప్పుడే కాదా ? మూడో సారి గెలవడమే ప్రస్తుత లక్ష్యమా ?