అన్వేషించండి

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ నుంచి మరొకరు ఔట్ - మహేష్ వెకేషన్‌కు వెళ్లిన ప్రతిసారీ ఇదే జరుగుతుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో మూవీ ‘గుంటూరు కారం’కు షూటింగ్ తిప్పలు తప్పడం లేదు. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది.

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో ‘గుంటూరు కారం’ సినిమా ఇప్పుట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి మహేష్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా అంటే ఎలా ఉంటుందో పెద్దగా చెప్పనవసరం లేదు. అందుకే ‘గుంటూరు కారం’ కోసం సూపర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అభిమానుల కల ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. మూవీ అనౌన్స్ చేసిన దగ్గరు నుంచీ ఏదొక అడ్డంకి వల్ల సినిమా షూటింగ్ లేట్ అవ్వడం లేదా బ్రేక్ పడటం జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా మహేష్ వెకెేషన్ కు వెళ్తున్న ప్రతీసారీ మూవీలో చాలా మార్పులు జరుగుతున్నాయనే టాక్ ఫిల్మ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

మహేష్ వెకేషన్ కు వెళ్లిన ప్రతీసారీ అదే జరుగుతుందా?

‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ లేట్ అవుతూ వస్తోంది. దీంతో అభిమానుల్లో అసంతృప్తి నెలకొంటుంది. ముఖ్యంగా మహేష్ బాబు వెకేషన్ కు వెళ్తున్న ప్రతీసారి ఏదొక కారణంతో షూటింగ్ కు బ్రేక్ పడుతుందనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. గతంలో మహేష్ వెకేషన్ కు వెళ్లగానే ‘గుంటూరు కారం’ ఫైట్ కొరియోగ్రాఫర్ మారిపోయాడు. మొన్నామధ్య ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే స్థానంలో శ్రీలీల వచ్చింది. ఈసారి మహేష్ లండన్‌ కు ఫ్లైట్ ఎక్కినప్పుడు, సినిమా సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ ఈ ప్రాజెక్ట్ నుంచి దాదాపు తప్పుకున్నారని తెలుస్తోంది. ఆయన స్థానంలో ‘ఓజీ’ కెమెరామెన్ రవి కె చంద్రన్ ను తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో మహేష్ వెకేషన్ కు వెళ్తున్న సమయంలో ప్రాజెక్ట్ లో ఏదొక మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

మహేష్ బాబుకు స్క్రిప్ట్ నచ్చలేదా?

అంతే కాకుండా మహేష్ బాబు వెకేషన్ కు వెళ్తున్న ప్రతీసారీ స్క్రిప్ట్ లో మార్పులు సూచిస్తున్నారట. దీంతో త్రివిక్రమ్ మొదటి అనుకున్న స్క్రిప్ట్ పూర్తిగా మారిపోయిందనే టాక్ వస్తోంది. మహేష్ సూచించిన ప్రతీసారి త్రివిక్రమ్ కూడా స్క్రిప్ట్ ను మారుస్తున్నారట. దీంతో ఇన్ని సార్లు ఎందుకు స్క్రిప్ట్ మారుస్తున్నారు అని మహేష్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. అంతేకాకుండా షూటింగ్ ఆలస్యం అవుతున్న ప్రతీసారీ సినిమా నుంచి కొంతమంది నటీనటులు అలాగే సాంకేతిక నిపుణులు ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నారట. అలా ఇప్పటి వరకూ చాలా మంది తప్పుకున్నారని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 

ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మూవీ మేకర్స్. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ స్థాయిలో ఈ మూవీను నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరి లో ఈ మూవీను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ప్రకటించారు మేకర్స్. అయితే ప్రస్తుత గందరగోళం నేపథ్యంలో మూవీను అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారా లేదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట మహేష్ ఫ్యాన్స్. 

Also Read: ఆ దర్శకుడు వాటి సైజ్ ఎంత? ఓసారి తాకవచ్చా అని అడిగాడు: షెర్లిన్ చోప్రా

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget