News
News
వీడియోలు ఆటలు
X

Mahesh Babu bag: ఖరీదైన బ్యాగ్‌తో కనిపించిన మహేష్ బాబు, దాని ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవ్వాల్సిందే!

హీరో మహేష్ బాబు తాజాగా ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్తూ, భుజానికి ఓ బ్యాగ్ తగిలించుకుని ఎయిర్ పోర్టులో కనిపించారు. ఆ బ్యాగ్ ధర ఎంతో తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

FOLLOW US: 
Share:

టాలీవుడ్‌లో అత్యంత లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేసే సెలబ్రిటీస్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుంటారు. ఖరీదైన కార్లు, బంగళాతో పాటు విలువైన వస్తువులను కూడా ఆయన సొంతం. తాజాగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి మహేష్ బాబు ఎయిర్ పోర్టులో కనిపించారు. ఈ సందర్భంగా ఆయన భుజానికి వేసుకుని వెళ్లిన ఓ బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది.   

మహేష్ బాబు బ్యాగ్ ఖరీదు ఎంతో తెలుసా?

ఆ తర్వాత మహేష్ దగ్గరున్న బ్యాగ్ గురించి నెటిజన్లు ఆరా తీశారు. ఆ బ్యాగ్ ధర ఎంత? కంపెనీ ఏంటి? సహా పలు విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఆ బ్యాగ్ వివరాలు తెలిసి ఆశ్చర్యపోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు విమానాశ్రయంలో  భుజానికి వేసుకుని తీసుకెళ్లిన ఆ బ్యాగ్ లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. ఈ క్రిస్టోఫర్ MM బ్యాక్‌ ప్యాక్ హై-ఎండ్ ఫ్యాషన్ కు గుర్తుగా చెప్పుకోవచ్చు. ఈ నలుపు రంగు బ్యాగ్‌పై స్కై బ్లూ డిజైన్, సిగ్నేచర్ LV మోనోగ్రామ్ ఉన్నాయి. ఈ బ్యాగ్ ధర రూ.3,92,656 కావడం విశేషం.

View this post on Instagram
 
A post shared by The Tollywood Closet (@the_tollywood_closet)

లగ్జరీ లైఫ్ కు చిహ్నం లూయిస్ విట్టన్ బ్యాగ్

మనలో చాలా మంది  సాధారణ బ్యాక్‌ ప్యాక్‌ ను కొనుగోలు చేసి సంతృప్తి చెందుతారు. అయితే, మహేష్ బాబు లూయిస్ విట్టన్ యాక్సెసరీ మాత్రం చాలా ఖరీదైన బ్యాక్ ప్యాక్. ఇది స్టైలిష్‌గా మాత్రమే కాదు, ఫంక్షనల్‌గా కూడా ఉంటుంది. ఎందుకంటే, ఇది మంచి నాణ్యత కలిగిన మెటీరియల్ తో తయారు చేస్తారు. అంతేకాదు, మల్టీ  కంపార్ట్‌ మెంట్‌లను కలిగి ఉంటుంది. డిజైనర్ ఫ్యాషన్‌లో స్పెషల్ ప్రొడక్టుగా చెప్పుకోవచ్చు. ఆయన ఈ బ్యాగ్ తో ఎయిర్ పోర్టులో కనిపించిన తర్వాత చాలా మంది ఈ బ్యాగ్ గురించి సెర్చ్ చేశారట. చక్కటి డిజైన్, అంతకు మించి వస్తువులను తీసుకెళ్లేందుకు చాలా విశాలంగా ఉంటుందట. ఈ బ్యాగ్ ను కొనుగోలు చేసిన వారంతా, దీనిని లగ్జరీ లైఫ్ కు చిహ్నంగా భావిస్తారట. అందులో భాగంగానే మహేష్ బాబు సైతం లూయిస్ విట్టన్ క్రిస్టోఫర్ MM బ్యాక్‌ ప్యాక్ ను తీసుకున్నారట.

రాజమౌళితో మహేష్ సినిమా      

ఇక ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి వచ్చే ఏడాది నాటికి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారట రాజమౌళి. అడ్వెంజర్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్నఈ చిత్రం ఎక్కువగా అమెజాన్ అడవుల్లో చిత్రీకరించబడుతుందని టాక్.  ఈ సినిమాను రెండు లేదా మూడు పార్ట్ లుగా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2025 చివరి నాటికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.   

Read Also: 'భోళా శంకర్' మేడే స్పెషల్: టాక్సీ డ్రైవర్ గా స్టైలిష్ లుక్ లో మెగాస్టార్

Published at : 01 May 2023 12:29 PM (IST) Tags: Mahesh Babu Louis Vuitton bag Christopher MM backpack Family vacation

సంబంధిత కథనాలు

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

Arjun Kapoor-Malaika Arora: బెడ్‌పై అర్ధనగ్నంగా బాయ్‌ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!

Arjun Kapoor-Malaika Arora: బెడ్‌పై అర్ధనగ్నంగా బాయ్‌ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్

'Hari Hara Veera Mallu Movie: ‘హరిహర వీర మల్లు’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షూటింగ్ మరింత ఆలస్యం?

'Hari Hara Veera Mallu Movie: ‘హరిహర వీర మల్లు’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షూటింగ్ మరింత ఆలస్యం?

టాప్ స్టోరీస్

Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !

Andhra News  :  జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం  !

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి

Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి