అన్వేషించండి

Mahesh Babu Namrata : నేను షాపింగ్ చేయను... నమ్రతే చేస్తుంది - మహేష్ బాబు

Gowri Signatures Store Launch : మహేష్ బాబు, నమ్రత దంపతులు గౌరీ సిగ్నేచర్ స్టోర్ ప్రారంభోత్సవంలో సందడి చేశారు. అప్పుడు డ్రసింగ్ సెలక్షన్, నమ్రతతో షాపింగ్ గురించి మహేష్ బాబు మాట్లాడారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) చాలా సరదా మనిషి. ఆయన ఎంత అందంగా ఉంటారో... ఆయన మాటలు కూడా అంతే అందంగా ఉంటాయి. ఆ మాటల్లో ఛలోక్తులు, పంచ్ డైలాగ్స్ కూడా అలవోకగా వచ్చేస్తాయి. సినిమాలకు సంబంధించిన ప్రెస్‌ మీట్స్‌లో మహేష్ బాబు కనిపించడం కామన్! అలాగే, తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే ప్రోడక్ట్స్ ప్రెస్‌ మీట్‌లలో కూడా! బట్, ఫర్ ఏ ఛేంజ్... ఫస్ట్ టైమ్ సతీమణి నమ్రతతో కలిసి లగ్జరీ & కస్టమైజ్డ్ వెడ్డింగ్ డ్రస్, జ్యువెలరీ స్టోర్ ప్రారంభోత్సవంలో మహేష్ బాబు సందడి చేశారు. 

మా ఆవిడతో కలిసి ఫస్ట్ టైమ్ ఇలా వచ్చా! - మహేష్ 
మహేష్ బాబు, నమ్రత దంపతుల చేతుల మీదుగా హైదరాబాద్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36లో గౌరీ సిగ్నేచర్ స్టోర్ ప్రారంభమైంది. ఆ తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో ''ఫస్ట్ టైమ్ అనుకుంట... మా ఆవిడతో ఇలా ప్రెస్ మీట్ కి రావడం'' అని మహేష్ బాబు తన స్పీచ్ స్టార్ట్ చేశారు. దాంతో ఒక్కసారిగా అందరూ నవ్వేశారు. ఆయన పక్కన కూర్చున్న నమ్రత కూడా! ఉదయ్, శ్రీనివాస్ తమ స్నేహితులు అని, వాళ్ళ కోసం తాము ఇక్కడికి వచ్చామని చెప్పారు. 

నమ్రతకు అవకాశం ఇస్తే షాప్ మొత్తం కొంటుంది - మహేష్
తనకు కంపెనీ ఇవ్వడానికి మహేష్ బాబు గౌరీ స్టోర్ ఓపెనింగుకు వచ్చారని నమ్రత తెలిపారు. ఆ తర్వాత మహేష్ బాబును 'స్టోర్ మొత్తం చూశారు కదా! ఒకవేళ మీ వైఫ్ కోసం ఏ శారీ సెలెక్ట్ చేస్తారు? ఆవిడ కోసం మీరు షాపింగ్ చేస్తారా?' అని అడిగితే... ''సాధారణంగా తన కోసం నేను షాపింగ్ చేయను. నా కోసమే తాను షాపింగ్ చేస్తుంది. ఒకవేళ అవకాశం ఇస్తే... ఇప్పుడు ఈ స్టోరులో ఉన్నవి అన్నీ సెలెక్ట్ చేస్తుంది'' అని చెప్పారు. ఆ తర్వాత మైక్ తీసుకున్న నమ్రత... ''ఈ రోజు మహేష్ జేబుకు గట్టిగా చిల్లు పడటం ఖాయం'' అని నవ్వేశారు. అంటే... మహేష్ బాబుతో షాపింగ్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టిస్తానని పరోక్షంగా అలా చెప్పారన్నమాట.  

రాజమౌళి సినిమా గురించి చెబుతా!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నారు మహేష్ బాబు. దీని తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల మధ్య మరొక సినిమా చేసే అవకాశం ఉందని ఆ మధ్య ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపించింది. వార్తలు వచ్చాయి కూడా! అయితే... అటువంటిది ఏమీ లేదని తెలిసింది.

Also Read : రోజాకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా - మహేష్‌తో సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్

'గుంటూరు కారం' తర్వాత చేయబోయే రాజమౌళి సినిమా గురించి మహేష్ బాబును అడగ్గా... 'చెబుతా! అన్ని విషయాలు త్వరలో చెబుతా' అని అన్నారు. గౌరీ సిగ్నేచర్ స్టోర్ ప్రారంభోత్సవంలో మరొక సినిమా గురించి మాట్లాడలేదు. సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' విడుదల కానుంది. 

Also Read : 'మ్యాన్షన్‌ 24' రివ్యూ : హాట్‌స్టార్‌లో ఓంకార్‌ వెబ్‌ సిరీస్‌ - భయపెట్టిందా? లేదా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభంఎంతో అందమైన ఈ వైజాగ్ వ్యూ పాయింట్ గురించి మీకు తెలుసా..?అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీనచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Galiveedu MPDO: అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేత వీరంగం - ఎంపీడీవోను తన్ని పిడిగుద్దులు, తీవ్ర ఉద్రిక్తత
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
Mother in law should die: అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
అత్త త్వరగా చచ్చిపోవాలి - నోటుపై రాసి దేవుడి హుండీలో వేశారు - ఎంత టార్చర్ పడుతున్నారో?
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Embed widget