అన్వేషించండి

Mahesh Babu : మహేష్ స్పీడ్ మామూలుగా లేదుగా - ఆరు రోజులు అనుకుంటే...

సూపర్ స్టార్ మహేష్ బాబు స్పీడ్ గురించి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. త్రివిక్రమ్ ఆరు రోజులు ప్లాన్ చేసిన సీక్వెన్స్ అందులో సగం రోజుల్లో కంప్లీట్ చేశారట. 

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో నటించిన చాలా మంది ఆర్టిస్టులు చెప్పే మాటల్లో ఒకటి... 'ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్' అని! ఎంత పెద్ద సన్నివేశం అయినా సరే... ఎంత పెద్ద డైలాగులు ఉన్నా సరే... భావోద్వేగాలు ఎన్ని ఉన్నా సరే... టకాటకా పూర్తి చేస్తారని చెబుతారు. 'గుంటూరు కారం' షూటింగ్ కూడా అదే స్పీడులో పూర్తి చేస్తున్నారట!

మూడు రోజుల్లో ఇంటర్వెల్ సీక్వెన్స్ పూర్తి!
'అతడు', 'ఖలేజా' తర్వాత గురూజీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం 'గుంటూరు కారం' (Guntur Karam Movie). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్య హైదరాబాద్ సిటీలో షూటింగ్ మొదలైంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?

'గుంటూరు కారం' ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆరు రోజుల్లో తీయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేశారట. ఆ మేరకు షెడ్యూల్స్ వేశారట. అయితే... మహేష్ బాబు ఆ సీన్స్ అన్నీ కేవలం మూడు అంటే మూడు రోజుల్లో పూర్తి చేశారట. 'గుంటూరు కారం' చిత్రీకరణ గురువారం నుంచి సారధి స్టూడియోస్ లో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ప్రారంభం కానుందని సమాచారం. అందులో జగపతి బాబుతో పాటు రమ్యకృష్ణ మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారట. మహేష్ కూడా ఈ షూటింగులో జాయిన్ అవుతారని తెలిసింది.

Also Read సగమే తీసుకున్న వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు - నిర్మాతకు లాభాలే ముఖ్యమంటూ   

ఒక్క షర్ట్ రేటు 75 వేలా?
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'గుంటూరు కారం' చిత్ర బృందం రెండు ఫోటోలు విడుదల చేసింది. అందులో ఆయన చాలా మాసీగా కనిపిస్తున్నారు. ఆ రెండు షర్టుల్లో ఓ షర్ట్ మాత్రం చాలా కాస్ట్లీ! ఫార్ ఫెచ్ (farfetch) కంపెనీకి చెందిన R13 బ్లీచ్ వాష్ ప్లైడ్ లాంగ్ స్లీవ్ షర్ట్ వేశారు మహేష్. అదీ క్లాసిక్ బ్లాక్ కలర్! దాని రేటు అక్షరాలా 74,509 రూపాయలు. ఒక్క షర్ట్ రేటు అంతా? అని కొందరు నోరెళ్ళ బెడుతుంటే... మరి కొందరు సూపర్ స్టార్ షర్ట్ అంటే ఆ మాత్రం రేటు ఉంటుందని చెబుతున్నారు.

Also Read విజయ్ దేవరకొండతో ఆ రెండూ మిస్ - 'ఖుషి' వాళ్ళ కాంబినేషన్‌లో మూడోది!

మహేష్ బాబు పుట్టినరోజు నాడు మరో స్టిల్ కూడా విడుదల చేశారు. అందులో రెడ్ కలర్ చెక్ షర్ట్ వేసుకున్నారు. దాని రేటు కేవలం మూడు వేల రూపాయలే అని టాక్. అటువంటి షర్ట్స్ ఆన్‌లైన్‌లో మూడు వేలకు వస్తున్నాయట.

మహేష్ బాబు సరసన శ్రీ లీల, మీనాక్షీ చౌదరి!
'గుంటూరు కారం'లో మహేష్ సరసన యువ కథానాయికలు శ్రీ లీల, మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. సూపర్ స్టార్ సినిమా వాళ్ళిద్దరికీ తొలిసారి అవకాశం వచ్చింది. ఆ కారణంతో ఇద్దరూ ఆనందంతో ఉన్నారు. 'గుంటూరు కారం' చిత్రాన్ని తొలుత వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నట్లు తెలిపారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఒక్క రోజు ముందుకు వచ్చారు. జనవరి 12న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఆయన్ను తప్పించినట్లు వార్తలు వచ్చాయి. అయితే... వాటిలో నిజం లేదు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Pavala Shyamala: ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత... చివరి రోజుల్లో ఎవరికీ అటువంటి దుస్థితి రాకూడదు
ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత... చివరి రోజుల్లో ఎవరికీ అటువంటి దుస్థితి రాకూడదు
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Mahendragiri Varahi : మహేంద్రగిరి వారాహి రిలీజ్ డేట్ ఫిక్స్ - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్?... ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్!
మహేంద్రగిరి వారాహి రిలీజ్ డేట్ ఫిక్స్ - అమ్మవారిగా ఐశ్వర్య రాజేష్?... ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Embed widget