Kollywood: మద్రాసు హైకోర్టులో తమిళ నిర్మాతలకు షాక్ - రివ్యూలపై బ్యాన్ గురించి ఏం చెప్పిందంటే?
Madras High Court - Movie Review: మూవీ రివ్యూల విషయంలో కోర్టుకు వెళ్లిన కోలీవుడ్ నిర్మాతలకు షాక్ తగిలింది. తమిళ నిర్మాతలు దాఖలు చేసిన పిటీషన్ మీద కోర్టు ఏం చెప్పిందంటే?
తమిళ చిత్ర పరిశ్రమ నిర్మాతలకు మద్రాస్ హైకోర్టు (Madras High Court)లో చుక్కెదురు అయ్యింది. రివ్యూల (Movie Review) మీద బ్యాన్ విధించమంటూ కోర్టుకు వెళ్లిన కోలీవుడ్ నిర్మాతలకు మింగుడు పడని తీర్పు వచ్చిందని చెన్నై సినిమా వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అసలు ఏం జరిగింది? నిర్మాతల కోర్టుకు ఎందుకు వెళ్లారు? వంటి వివరాల్లోకి వెళితే...
రివ్యూలపై బ్యాన్ కుదరదు...
స్పష్టం చేసిన చెన్నై హైకోర్టు!
యూట్యూబ్ సోషల్ మీడియా రివ్యూల వల్ల సినిమాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, నిర్మాతలు భారీగా నష్టపోతున్నారని, కలెక్షన్లకు గండి పడుతుందని కొన్ని రోజుల క్రితం తమిళ నిర్మాతల మండలి అభిప్రాయ పడింది. అంతే కాదు... 'ది తమిళ ఫిలిం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్' (The Tamil film actor producers association - TFAPA) ఈ విషయంలో మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.
సినిమా విడుదలైన తర్వాత మూడు రోజుల పాటు రివ్యూలు ఇవ్వకుండా బ్యాన్ విధించాలని కోరింది తమిళ ఫిలిం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్. మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో యూట్యూబ్, సోషల్ మీడియా రివ్యూస్ పేరుతో హీరోల మీద పర్సనల్ అటాచ్ చేయడం వల్ల నిర్మాతలు చాలా నష్టపోతున్నారని పేర్కొన్నారట. అయితే, రివ్యూలపై బ్యాన్ విధించడం కుదరదు అని కోర్టు స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది.
నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వారిపై కంప్లైంట్ ఇవ్వండి!
మూవీ రివ్యూలపై మూడు రోజులపాటు బ్యాన్ విధించడం కుదరదు అని చెప్పిన మద్రాస్ హైకోర్టు... మూవీ విడుదలైన తర్వాత హీరో లేదా సినిమాపై నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్న వారిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చినట్లు తమిళ మీడియా పేర్కొంది. రివ్యూ ఇవ్వకుండా బ్యాన్ విధించడం అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని అభిప్రాయపడ్డారట న్యాయమూర్తి.
Also Read: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేయాలి...
థియేటర్ యాజమాన్యాలకు నిర్మాతల విజ్ఞప్తి!
మూవీ రివ్యూల మీద తమిళ నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేయడం ఇది మొదటి సారి కాదు. సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేయమని కోరుతూ థియేటర్ యాజమాన్యాలకు నవంబర్ 20వ తేదీన తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక లేఖను పంపింది. దాని తర్వాత కొంతమంది థియేటర్ ఓనర్లు తమ సినిమా హాల్ పరిధిలోకి యూట్యూబ్ ఛానళ్లను రానివ్వలేదు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు శివ కలయికలో వచ్చిన 'కంగువ' విడుదల తర్వాత తమిళ నిర్మాతలు రివ్యూలపై ఎక్కువ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ 'వెట్టయాన్', కమల్ హాసన్ 'ఇండియన్ 2' సైతం రివ్యూల వల్ల నష్టపోయాయని కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ అంటోంది. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.
Also Read: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?