MAD Square Teaser: 'స్వీట్ పేరు కాదురా.. అమ్మాయి పేరు చెప్పాలి' - లడ్డూ గాని పెళ్లికి వెళ్దామా.. కడుపుబ్బా నవ్వించేందుకు 'మ్యాడ్' గ్యాంగ్ వచ్చేసింది
MAD Square: బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్‌టైనర్ మ్యాడ్ చిత్రానికి సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్' మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. కామెడీ పంచులు, డైలాగ్స్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది.

MAD Square Teaser Released: బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్' (MAD) చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న మూవీ 'మ్యాడ్ స్క్వేర్' (MAD Square). ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచీ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన 'లడ్డు గానీ పెళ్లి', 'స్వాతి రెడ్డి' పాటలు ఆడియన్స్‌ను ఎంతగానో అలరించాయి. ఇప్పుడు అంచనాలను మరింత పెంచేలా 'మ్యాడ్ స్క్వేర్' నుంచి టీజర్ విడుదలైంది. విడుదలైన నిమిషాల్లోనే ఈ టీజర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వేసవికి మూవీ మరింత వినోదాన్ని పంచేందుకు సిద్ధమని టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. 'మ్యాడ్' సినిమాలో తనదైన ప్రత్యేక శైలి, కామెడీ సీన్స్, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్.. ఈ సీక్వెల్‌తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు.
మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ (లడ్డు).. 'మ్యాడ్ స్క్వేర్'లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. టీజర్‌లో వారి అల్లరి, పంచ్ డైలాగ్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్నాయి. ఈ మూవీని టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ హైలెట్‌గా నిలుస్తుందని.. ప్రేక్షకులు ఊహించిన దాని కంటే ఎక్కువ వినోదాన్ని, ఎక్కువ మ్యాడ్ నెస్‌ను మూవీలో చూడబోతున్నారని చిత్ర బృందం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మార్చి 29న థియేటర్లలో విడుదల కానుంది.
టీజర్‌లో నవ్వులే నవ్వులు..
మ్యాడ్ మూవీలో కాలేజీలో స్నేహితుల మధ్య కథను సరదాగా చూపించగా.. కామెడీ సీన్స్, అదిరే పంచులు ఆడియన్స్‌ను ఎంతో అలరించాయి. ఇప్పుడు అంతకు మించేలా హాస్య సన్నివేశాలు ఉంటాయని టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. లడ్డు గానీ పెళ్లి స్టోరీతో ఈ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. టీజర్ స్టార్టింగ్ నుంచి నవ్వులు మొదలవుతున్నాయి. దర్శకులు వెంకీ అట్లూరి, అనుదీప్ కేవీ, నిర్మాత నాగవంశీ పేర్లతో కూడిన చదివింపులతో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. 'స్వీట్ పేరు కాదు.. అమ్మాయి పేరు చెప్పాలి' అంటూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. పెళ్లిలో సరదాగా కలిసే స్నేహితులు మళ్లీ వారు చేసే అల్లరి.. అనంతరం బ్యాచిలర్ పార్టీకని గోవా వెళ్లి వారు చేసే ఎంజాయ్‌మెంట్ అన్నీ కలిపి స్టోరీగా రాబోతున్నట్లు తెలుస్తోంది. గోవాలో ఏం జరిగిందో తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. మ్యాడ్ సినిమాలో వన్ లైనర్ కామెడీతో ఎంటర్‌టైన్ చేసిన మూవీ టీం ఇందులోనూ అంతకు మించి నవ్వించబోతున్నట్లు అర్థమవుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

