అన్వేషించండి

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

దర్శకుడు హను రాఘవపూడి రూపొందించిన 'సీతారామం' సినిమాను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య చూశారు. చక్కటి సినిమా తీసినందుకు చిత్రయూనిట్‌ను అభినందించారు.

ఇటీవల థియేటర్లలో విడుదలై విజయవంతంగా ఆడుతున్న "సీతారామం" చిత్రం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును సైతం ఆకట్టుకొంది. చిత్రాన్ని వీక్షించిన ఆయన.... చాలాకాలం తర్వాత ఓ చక్కని సినిమా చూసిన అనుభూతి కలిగిందని కొనియాడారు. నటీనటుల అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై, చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైందని విశ్లేషించారు. సాధారణ ప్రేమకథలా కాకుండా దానికి ఓ వీర సైనికుని నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలన్నారు. రణగొణ ధ్వనులు లేకుండా, కళ్లకు హాయిగా ఉండేలా ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించిన చిత్ర దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాత అశ్వనీదత్‌, చిత్రబృందాన్ని అభినందించారు.

దర్శకుడు హను రాఘవపూడి రూపొందించిన 'సీతారామం' సినిమా ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకొచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. క్లాస్, మాస్‌ అందరి అభిమానాన్ని అందుకుంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించారు. రష్మిక కీలకపాత్రలో కనిపించింది. తొలిరోజు తొలి షో నుంచే ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. క్లాసిక్ లవ్ స్టోరీ అంటూ తెగ పొగిడేస్తున్నారు సినీ అభిమానులు.

'సీతా రామం' చిత్రానికి పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ బాగా హెల్ప్ అయ్యింది. మంచి కలెక్షన్స్ వచ్చాయి. బాక్సాఫీస్ బరిలో సినిమా స్టడీగా నిలబడింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో కలెక్షన్లు చూస్తే మతిపోతుంది. శుక్రవారం కోటిన్నర షేర్, శనివారం రూ. 2.08 కోట్ల షేర్, ఆదివారం రూ. 2.62 కోట్ల షేర్ వసూలు చేసిందీ సినిమా. అలా వారం రోజుల పాటు బాక్సాఫీస్‌ను కళకళలాడించింది. 
 

'సీతా రామం' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ చూస్తే...
నైజాం : రూ. 2.54 కోట్లు 
ఉత్తరాంధ్ర : రూ. 85 లక్షలు
సీడెడ్ : రూ. 65 లక్షలు
నెల్లూరు :  రూ. 23 లక్షలు
గుంటూరు :  రూ. 47 లక్షలు
కృష్ణా జిల్లా : రూ. 50 లక్షలు
తూర్పు గోదావ‌రి : రూ. 56 లక్షలు
పశ్చిమ గోదావ‌రి : రూ. 40 లక్షలు

ఈ తరానికీ ఒక క్లాసిక్ ప్రేమకథ ‘సీతారామం‘

‘లవ్ స్టోరీ’ అంటే పరమ బోర్, లేదా రొమాన్స్ అంటే శృంగారమే అనే భావనలో ఉన్న నేటితరం ప్రేక్షకులకి ఒక చక్కటి ప్రణయ కావ్యం లాంటి చిత్రం ఇది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మీకు ఆస్వాదించే మనసుంటే.. మిమ్మల్ని కట్టిపడేసే ప్రేమకథను అందించే దమ్ము నాకుంది అంటూ దర్శకుడు హను రాఘవపూడి ప్రేక్షకులకు రాసిన లేఖ ‘సీతారామం’ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా వీకెండ్ లో ఎంజాయ్ చేసి తెల్లారగానే మర్చిపోయే నైట్ పార్టీ లాంటిది మాత్రం కాదు. ఎప్పుడైనా సెలవులకు మన ఊరు  వెళ్ళినప్పుడు.. ఉదయమే లేచి సూర్యోదయాన్ని పలకరించినప్పుడు కలిగే అనుభూతి లాంటిది. సినిమా అయిపోయాక కూడా ఆ భావన లోనుంచి రావడం చాలా కష్టం. ముఖ్యంగా రామ్ పాత్ర మనల్ని వెంటాడుతుంటే.. సీతామాలక్ష్మి నన్నెలా మరువగలవు  అంటూ నిలదీస్తుంది. ప్రతీ 15 సంవత్సరాలకూ ఒక తరం మారుతుంది అనే మాట నిజమైతే ఈ తరంలో ఇప్పటి వరకూ రాని క్లాసిక్ లవ్ స్టోరీ సీతారామం. హిందీ వీర్ ఝరా నుంచి అప్పుడెప్పుడో వచ్చిన కాలాపానీ పోలికలు చూచాయగా  కనిపించినా సీతారామం ప్రత్యేకత వేరు. హను రాఘవపూడి పెన్నుతో కాకుండా మనసుతో రాసిన స్క్రీన్ ప్లే ఇది. సెకండాఫ్ చెడగొడతాడు అనే పేరుపడ్డ హను రాఘవపూడి చేతనైతే ఇంతకంటే చిక్కటి ప్రేమకథను తీయండి చూద్దాం అంటూ నవతరం దర్శకులకు ప్రేమతో విసిరిన సవాల్ సీతారామం. అందుకే అందర్నీ మరోసారి ప్రేమలో పడేస్తోందీ ప్రేమ కావ్యం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
Embed widget