(Source: ECI/ABP News/ABP Majha)
Prabhas - Lokesh Kanagaraj : నేను ప్రభాస్‌తో చేయబోయే సినిమా అందులో భాగం కాదు - లోకేష్ కనగరాజ్
'లియో' ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఓ ఇంటర్వ్యూలో తాను ప్రభాస్ తో చేయబోయే మూవీ LCU లో భాగం కాదని స్పష్టం చేశారు.
ప్రస్తుత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) గురించే డిస్కషన్ నడుస్తోంది. అందుకు కారణం దళపతి విజయ్ (Vijay)తో లోకేష్ తెరకెక్కించిన తాజా మూవీ 'లియో'నే. ఇప్పటికే ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. రిలీజ్ టైం దగ్గర పడడంతో లోకేష్ కోలీవుడ్లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే 'లియో' మూవీతో పాటు తన తదుపరి చిత్రాలకు సంబంధించి అప్డేట్స్ ఇవ్వడంతో ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తన కెరీర్లో కేవలం 10 సినిమాలు మాత్రమే తీసి సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతానని లోకేష్ గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రకటించిన విషయం తెలిసిందే.
'ఖైదీ' మూవీతో ఓ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్... తాజాగా 'లియో' తెరకెక్కించగా అక్టోబర్ 19న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇది లోకేష్ కెరియర్ లో ఐదవ సినిమా. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు లోకేష్. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)తో లోకేష్ చేయబోతున్న సినిమా గురించి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ లోకేష్ క్లారిటీ ఇచ్చారు. లోకేష్, ప్రభాస్ తో చేసే మూవీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎండ్ గేమ్ గా ఉంటుందని గత కొద్ది రోజులుగా రూమర్స్ వినిపించాయి. ఇదే విషయంపై లియో ప్రమోషన్స్ లో భాగంగా లోకేష్ క్లారిటీ ఇచ్చారు.
ప్రభాస్ తో తాను చేయబోయే సినిమా LCU లో భాగం కాదని లోకేష్ కనగరాజ్ అన్నారు. ఆ మూవీ స్టాండలోన్ ప్రాజెక్టుగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా తన గత సినిమాలకు ప్రభాస్ తో చేసే సినిమాకి ఎలాంటి సంబంధం ఉండదని ఈ సందర్భంగా లోకేష్ స్పష్టం చేశారు. ఈయన కామెంట్స్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ఒక విధంగా నిరాశకు లోనయ్యారనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు లోకేష్ తీసిన సినిమాలన్నీ LCU భాగమే. 'ఖైదీ' తో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి దాన్ని 'విక్రమ్' మూవీ కి లింకు పెట్టాడు. ఆ తర్వాత 'లియో' కూడా LCU లో భాగమే అని తెలుస్తోంది.
Also Read : రోజాకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా - మహేష్‌తో సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్
లియో తర్వాత సూర్యతో చేయబోయే 'రోలెక్స్' కూడా అందులో భాగంగా ఉంటుంది. ఇక ఈ సినిమాటిక్ యూనివర్స్ ముగింపు గురించి కూడా లోకేష్ చెప్పారు. కమలహాసన్ తో చేసే 'విక్రమ్ 2' మూవీతోనే LCU ముగుస్తుందని క్లారిటీ ఇవ్వడంతోపాటు ప్రభాస్ కోసం ఒరిజినల్ స్టోరీని సిద్ధం చేస్తానని అన్నారు. కాగా ప్రభాస్ - లోకేష్ మూవీ పట్టాలెక్కాలంటే మరో రెండేళ్ల సమయం అయినా పట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 'లియో' విషయానికొస్తే.. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.ఎస్ లలిత్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష కథానాయికగా నటిస్తుండగా, అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.
Also Read : 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆ క్రెడిట్ కొట్టేసిన ఇండియన్ మూవీ విజయ్ 'లియో'
Join Us on Telegram: https://t.me/abpdesamofficial