LEO Naa Ready Song : విజయ్ ఫ్యాన్స్‌కు పండగ - 'లియో'లో మాంచి మాస్ డ్యాన్స్ నంబర్!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'లియో'. ఈ రోజు హీరో పుట్టినరోజు సందర్భంగా మిడ్ నైట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు.
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా లియో (Leo Vijay Movie). 'విక్రమ్' విజయం తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇంతకు ముందు విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో 'మాస్టర్' వచ్చింది. అయితే, ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే... లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (Lokesh Cinematic Universe)లోనిది.
విజయ్ అభిమానులకు పండగ
విజయ్ అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ రెండు గిఫ్ట్స్ ఇచ్చారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈ రోజు విజయ్ పుట్టినరోజు (Vijay Birthday). ఈ సందర్భంగా నిన్న అర్ధరాత్రి 'లియో'లో హీరో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ రోజు సాయంత్రం ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు.
విజయ్ సినిమా అంటే అనిరుధ్ రవిచంద్రన్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇస్తారు. 'కత్తి', 'మాస్టర్', 'బీస్ట్' సినిమాల్లో పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడీ 'లియో' సినిమాలో ఫస్ట్ సాంగ్ 'నా రెడీ...' సాంగ్ కూడా ఇన్స్టంట్ గా చార్ట్ బస్టర్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా విజయ్ వేసిన స్టెప్పులు అభిమానులను అలరిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఫస్ట్ లుక్ రెస్పాన్స్ అదిరింది!
LEO First Look : 'లియో' ఫస్ట్ లుక్ రెస్పాన్స్ పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇందులో విజయ్ సుత్తి పట్టుకుని కనిపించారు. ఎవరినో బలంగా కొట్టినట్లు కనబడుతోంది. ఆ బ్లడ్ చూస్తే విజయ్ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే మాస్ యాక్షన్ సీన్లు లోకేష్ డిజైన్ చేసినట్లు అర్థం అవుతోంది.
Also Read : రామ్ చరణ్ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే
'లియో'... ప్రత్యేకతలు ఎన్నో!
విజయ్, త్రిష 14 ఏళ్ళ విరామం తర్వాత నటిస్తున్న సినిమా 'లియో'. 'విక్రమ్'లో ఏజెంట్ టీనా రోల్ చేసిన వాసంతి ఇందులో కూడా ఉన్నారు. 'ఖైదీ', 'విక్రమ్' సినిమాలతో 'లియో'ను ఎలా కనెక్ట్ చేస్తారు? అనే దానిపై చాలా థియరీలు వినిపిస్తున్నాయి.
లోకేష్ కనగరాజ్ సినిమాల్లో హీరోయిన్లకు అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. సినిమా మధ్యలో హీరోయిన్లు హత్యకు గురైనట్లు చూపిస్తారు. అందువల్ల, 'లియో'లో త్రిష పాత్రను మధ్యలో చంపేస్తే ఊరుకునేది లేదని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో అల్టిమేటం జారీ చేస్తున్నారు. అంతే కాదు... త్రిషను చంపేస్తే శవాలు లేస్తాయ్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అదీ సంగతి!
Also Read : పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్'లో ఛాన్స్ కొట్టేసిన 'ఏజెంట్' బ్యూటీ!
View this post on Instagram
'లియో' చిత్రాన్ని సెవెన్ స్కీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి నిర్మిస్తున్నారు. ఇందులో త్రిషతో పాటు మరో హీరోయిన్ ప్రియా ఆనంద్ కూడా ఉన్నారు. ఇంకా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ తదితరులు ఉన్నారు. ఎవరి పాత్రలు ఏమిటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమాకు ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస, కూర్పు : ఫిలోమిన్ రాజ్, కళ : ఎన్. సతీష్ కుమార, యాక్షన్ : అన్బరివ్.