Lavanya Tripathi Marriage : వరుణ్ తేజ్ సీక్రెట్ బయటపెట్టిన అందాల భామ - లావణ్యా త్రిపాఠికి నచ్చిన వ్యక్తి దొరకలేదా?
వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి ప్రేమలో ఉన్నారని, పెళ్లి చేసుకోనున్నారని ఒక వైపు వార్తలు వినబడుతున్నాయి. మరోవైపు తనకు నచ్చిన వరుడు దొరకలేదని లావణ్య చెబుతున్నారు. లేటెస్టుగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ఆరడుగుల అందగాడు, మెగా ఫ్యామిలీ కథానాయకుడు వరుణ్ తేజ్ (Varun Tej). 'అందాల రాక్షసి'తో తెలుగు చిత్రసీమకు పరిచయమైన సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi). వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ దాన్ని ఖండించలేదు. అలాగని... అవును, నిజమేనని అంగీకరించలేదు.
'అంతరిక్షం', 'మిస్టర్' సినిమాల్లో వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డారని ఫిల్మ్ నగర్ గుసగుస. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని అప్పుడప్పుడూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారని, ఏడు అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారనేది కొత్త ఖబర్. అది పక్కన పెడితే... పెళ్లి గురించి లావణ్య సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి - లావణ్య
లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన 'పులి - మేక' వెబ్ సిరీస్ కొన్ని రోజుల క్రితం 'జీ 5' ఓటీటీలో విడుదలైంది. దానికి మంచి స్పందన లభిస్తోంది. ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ ప్రభ పాత్రలో లావణ్యా త్రిపాఠి నటనకు మంచి పేరు వచ్చింది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో పెళ్లి ప్రస్తావన వచ్చింది.
పెళ్లి గురించి లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ ''నా తల్లిదండ్రుల గురించి పెళ్లి విషయంలో ఒత్తిడి ఏమీ లేదు. అందుకని, నేనూ పెళ్లి గురించి ఆలోచించడం లేదు. పెళ్లి గురించి కలలు కూడా ఏమీ కనడం లేదు. ప్రస్తుతానికి నా దృష్టి అంతా సినిమాలపై ఉంది. నా పెళ్లి జరుగుతుంది... అది నాకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు'' అని చెప్పారు.
అందాల రాక్షసి మాటలకు అర్థం ఏమిటి? ఆమెకు నచ్చిన వ్యక్తి ఇంకా దొరకలేదా? లేదంటే దొరికినా సరే ఆమె పైకి చెప్పడం లేదా? త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారని వస్తున్న తరుణంలో ఈ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? త్వరలోసమాధానాలు వస్తాయేమో!?
ఆఫ్ స్క్రీన్ వరుణ్ తేజ్ వేరు!
'పులి - మేక' వెబ్ సిరీస్ (Puli Meka Web Series) రచయిత, నిర్మాత కోన వెంకట్, నటుడు రాజా, నటి సిరి హనుమంతుతో కలిసి సుమ కనకాల (Suma Kanakala) హోస్ట్ చేస్తున్న 'సుమ అడ్డా' కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ వరుణ్ తేజ్ గురించి లావణ్యా త్రిపాఠి మాట్లాడారు.
'మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు? అని అడిగితే మీరు ఎవరి పేరు చెబుతారు? ఎ) నాని, బి) వరుణ్ తేజ్?' అని సుమ కనకాల ప్రశ్న వేశారు. ''నేను వరుణ్ తేజ్ పేరు చెబుతా'' అని లావణ్యా త్రిపాఠి సమాధానం ఇచ్చారు. అంటే నాని హ్యాండ్సమ్ కదా? అని అడిగితే ''నాని ఈజ్ క్యూట్'' అని లావణ్య చెప్పారు. పక్కన ఉన్న సిరి ''నువ్వు స్మార్ట్'' అని కౌంటర్ వేశారు. కొంత మంది హీరోల ఫోటోలు చూపించి కొన్ని ట్యాగులు సుమ కనకాల చెప్పారు. ఏ హీరోకి సూట్ అవుతుందో చెప్పమని లావణ్యా త్రిపాఠిని అడిగారు.
Also Read : తారక రత్నను ఎవరూ అర్థం చేసుకోలేదు - అలేఖ్యా రెడ్డి టార్గెట్ ఎవరు? ఎందుకీ సెన్సేషనల్ కామెంట్స్?
''వరుణ్ తేజ్ ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ చాలా డిఫరెంట్. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వరుణ్ చాలా సరదాగా ఉంటారు. బయటకు ఆయన సీరియస్ గా కనపడతారు కదా! కానీ, అలా కాదు'' అని లావణ్యా త్రిపాఠి చెప్పారు. వరుణ్ తేజ్ హ్యాండ్సమ్ అని లావణ్యా త్రిపాఠి చెప్పిన సమాధానం హైలైట్ అవుతోంది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో త్వరలో వరుణ్ తేజ్ పెళ్లి కబురు చెబుతామని అన్నట్లు నాగబాబు వ్యాఖ్యానించారు. అప్పటి నుంచి ఆ పెళ్లి కబురు కోసం చాలా మంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
Also Read : 'ఇన్ కార్' రివ్యూ : అమ్మాయిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్ళి రేప్ చేయబోతే?