By: ABP Desam | Updated at : 03 Mar 2023 03:24 PM (IST)
తారకరత్న, అలేఖ్యా రెడ్డి
నందమూరి కుటుంబ వారసుడు, యువ కథానాయకుడు తారక రత్న (Nandamuri Taraka Ratna) ఈ ఏడాది ఫిబ్రవరి 18న కన్నుమూశారు. ఫిబ్రవరి 22న ఆయన పుట్టినరోజు. బర్త్ డేకి సరిగ్గా నాలుగు రోజుల ముందు ఆయన కాలం చేశారు. తారక రత్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు కానీ ఆయన భార్య జ్ఞాపకాల్లో మాత్రం జీవించి ఉన్నారు.
తారక రత్న జయంతి నుంచి ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి (Alekhya Reddy Nandamuri) సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. భర్తను తలుచుకుని భావోద్వేగానికి గురి అవుతున్నారు. గురువారం అలేఖ్యా రెడ్డి చేసిన పోస్ట్ కించిత్ అనుమానాలకు తావు ఇచ్చేలా ఉంది.
తారకరత్నను ఎవరూ అర్థం చేసుకోలేదు!
జీవితంలో కష్టాలు పడుతూనే తాము ఇంత దూరం వచ్చామని అలేఖ్యా రెడ్డి లేటెస్ట్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. జీవితంలో కష్టసుఖాలు చూశామని, వరస్ట్ మూమెంట్స్ ఫేస్ చేశామని ఆమె తెలిపారు. ''నువ్వు, నేను కలిసి మంచి రోజుల కోసం ఎదురు చూశాం. మనకు చిన్న కుటుంబాన్ని క్రియేట్ చేసుకున్నాం'' అని అలేఖ్యా రెడ్డి పేర్కొన్నారు. ఆ తర్వాత ''నిజమైన తారక రత్న ఎవరికీ తెలియదు. తారక రత్నను ఎవరూ అర్థం చేసుకోలేదు. నిన్ను నేను అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. బాధను గుండెల్లో దాచుకుని మాకు ప్రేమను పంచావు. మన చుట్టూ ఎన్ని అబద్దాలు ప్రచారంలో ఉన్నా నేను ధైర్యంగా నిలబడతా. నిన్ను ఈ రోజు మేం మిస్ అవుతున్నాం'' అని అలేఖ్యా రెడ్డి పోస్ట్ చేశారు.
Also Read : ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ను అవమానించిన బాలకృష్ణ?
వివాహం అనంతరం తారక రత్న, అలేఖ్యా రెడ్డి దంపతులను ఇరు కుటుంబాలు దూరం పెట్టాయి. ఆ సమయంలో తమను ఎవరూ అర్థం చేసుకోలేదని ఆమె ఫీల్ అవుతున్నారా? ఆ విషయాన్ని పరోక్షంగా ఇలా తెలిపారా? లేదంటే ఆమె మనసులో మరొకటి ఉందా? ఆమె టార్గెట్ ఎవరు? పోస్ట్ చూసిన తర్వాత నెటిజనులలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఫ్యామిలీతో చివరి ఫోటో!
కొన్ని రోజుల క్రితం ఫ్యామిలీ అంతా కలిసి దిగిన చివరి ఫోటోను అలేఖ్యా రెడ్డి పోస్ట్ చేశారు. ''ఇదే మన చివరి ట్రిప్, ఇదే మన చివరి ఫోటో అని నమ్మాలంటే నా గుండె చెరువు అవుతోంది. ఇది అంతా కల అయితే బావుంటుందని కోరుకుంటున్నాను. 'అమ్మా బంగారు...' అంటూ నీ వాయిస్ కాలింగ్ తో నిద్ర లేస్తున్నాను'' అని అలేఖ్యా రెడ్డి పోస్ట్ చేశారు. ఏడు కొండల వెంకటేశ్వర స్వామికి చిన్న కుమార్తె, కుమారుడు తల నీలాలు సమర్పించడానికి కుటుంబంతో కలిసి తిరుమల తిరుపతి వెళ్లారు తారక రత్న. అప్పుడు ఆలయం వెలుపల తీసిన ఫోటో ఇది.
Also Read : 'ఇన్ కార్' రివ్యూ : అమ్మాయిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్ళి రేప్ చేయబోతే?
తిరుపతి వెళ్ళినప్పుడు దిగిన ఫ్యామిలీ పిక్ పోస్ట్ చేయడానికి కొన్ని రోజుల ముందు తారక రత్న చేతిని తన చేత్తో పట్టుకున్న ఫోటో పోస్ట్ చేసిన అలేఖ్యా రెడ్డి ''మన జీవితం ఎప్పుడూ సాధారణంగా లేదు. కార్లలో నిద్రపోయిన రోజుల నుంచి ఇప్పటి వరకు కలిసే పోరాటం చేశాం. కలిసే చివరి వరకు ఉన్నాం. నువ్వు పోరాట యోధుడివి. నువ్వు ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించలేరు'' అని పేర్కొన్నారు. అలేఖ్యా రెడ్డి సోషల్ మీడియా పోస్టుల్లో ఆమె ఎంత బాధ పడుతున్నారనేది అర్థం అవుతోందని నెటిజనులు, తెలుగు ప్రజలు చెబుతున్నారు. భగవంతుడు ఆమెకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నారు.
ఆ సామాన్యుల చేతిలో ఆస్కార్ - పట్టరాని ఆనందంలో ‘ఎలిఫ్యాంట్ విష్పర్స్’ జంట
అలా చేయనన్నానని హీరోయిన్ పాత్ర నుంచి తొలగించారు: నటి సన
Mohan Babu on Manoj: కుక్కలు మొరుగుతూనే ఉంటాయి పట్టించుకోను - మనోజ్ రెండో పెళ్లిపై మోహన్ బాబు రియాక్షన్
Ravi Teja Brother Raghu Son : యూత్‌ఫుల్ సినిమాతో హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు
Chiranjeevi As Chief Guest : సినిమా ఇవ్వలేదు కానీ ఆశీసులు ఇస్తున్న చిరంజీవి
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ
Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?
Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్ టార్గెట్ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు