News
News
X

In Car Movie Review - 'ఇన్ కార్' రివ్యూ : అమ్మాయిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్ళి రేప్ చేయబోతే?

Ritika Singh's In Car Movie Review : 'గురు' ఫేమ్ రితికా సింగ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఇన్ కార్'. నేడు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

FOLLOW US: 
Share:

సినిమా రివ్యూ : ఇన్ కార్
రేటింగ్ : 1.5/5
నటీనటులు : రితికా సింగ్, మనీష్ ఝాంజోలియా, సందీప్ గోయల్, సునీల్ సోని, గ్యాన్ ప్రకాష్ త‌దిత‌రులు
మాటలు : సుధీర్ కుమార్, హర్ష్ వర్ధన్
అడిషనల్ డైలాగ్స్ : తుషార్ ఖండేల్వాల్
ఛాయాగ్రహణం : మిథున్ గంగోపాధ్యాయ
సంగీతం : మథియాస్ డుప్లెసిస్ 
నిర్మాత‌లు : అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి
రచన, ద‌ర్శ‌క‌త్వం : హర్ష్ వర్ధన్
విడుదల తేదీ : మార్చి 3, 2023

'గురు' ఫేమ్ రితికా సింగ్ (Ritika Mohan Singh) ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'ఇన్ కార్' (In Car Movie 2023). సుమారు ఐదేళ్ళ విరామం తర్వాత ఆమె నటించిన తెలుగు చిత్రమిది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ రోజు విడుదలైంది. సినిమా ఎలా ఉంది? (In Car Movie Review)

కథ (In Car Story) : సాక్షి (రితికా సింగ్) స్టూడెంట్. పరీక్షలు రాయడానికి కాలేజీకి వెళ్లాలని బస్ స్టాపులో వెయిట్ చేస్తున్న సమయంలో కారులో వచ్చిన కొందరు పథకం ప్రకారం కిడ్నాప్ చేస్తారు. వారం రోజులు లైంగిక వాంఛలు తీర్చుకుని, అత్యాచారం చేసి తర్వాత వదిలేయాలని రిచీ (మనీష్ ఝాంజోలియా) భావిస్తాడు. అక్క ప్రేమిస్తున్న యువకుడిని కత్తితో పొడిచిన అతను. బెయిల్ మీద జైలు నుంచి బయటకు వస్తాడు. రిచీ కోరికలకు మేనమామ (సునీల్ సోని) వత్తాసు పలుకుతూ ఉంటాడు. తొలుత రిచీ సోదరుడు అడ్డుపడినా, కాసేపటి తర్వాత లైంగిక కోరిక తీర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తాడు. కారులో అమ్మాయిని అపహరించినా ఎవరూ ఎందుకు అడ్డు పడలేదు? మృగాళ్ల బారి నుంచి సాక్షి తప్పించుకుందా? లేదా? చివరకు ఏమైంది? అనేది మిగతా సినిమా. 

విశ్లేషణ : ఢిల్లీ నిర్భయ, హైదరాబాద్ దిశ తరహా ఘటనల స్ఫూర్తితో కథా రచయిత, దర్శకుడు హర్ష్ వర్ధన్ 'ఇన్ కార్' సినిమా తెరకెక్కించారని ప్రచార చిత్రాలు చూస్తే అర్థం అవుతుంది. ఆ ఘటనలకు భిన్నంగా పతాక సన్నివేశాల్లో ట్విస్ట్ ఇచ్చారు.
 
దర్శకుడు హర్ష్ వర్ధన్ ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్ బావుంది. ప్రజెంటేషన్ మాత్రం వరస్ట్ గా ఉంది. తప్పించుకోవడానికి ప్రయత్నించే అమ్మాయి, నేర చరిత్ర ఉన్న యువకుడికి తోడు ప్రోత్సహించే మామ, రోడ్డు మీద ప్రయాణం... మలుపులతో ఉత్కంఠకు గురి చేస్తూ కథను ముందుకు తీసుకు వెళ్ళవచ్చు. హర్ష్ వర్ధన్ మాత్రం బూతులు, ద్వందార్థాలతో మాటలు నింపేసి సన్నివేశాలు తీసుకుంటూ వెళ్ళారు. ఒక్కటంటే ఒక్క సన్నివేశంలో కూడా ఉత్కంఠ అనేది ఉండదు. మామా అల్లుళ్ళ సంభాషణలు వెగటు పుట్టిస్తాయి. 'మీర్జాపూర్' తెలుగు వెర్షన్ డైలాగ్స్ ఈ సినిమాలో డైలాగుల ముందు దిగదుడుపే. 

పైత్యానికి పరాకాష్ట అనే రీతిలో కథ, కథనం, మాటలు, దర్శకత్వం ఉన్నాయి. ఏ దశలోనూ సంగీతం సినిమాపై ఆసక్తి గానీ, ఉత్కంఠ గానీ కలిగించలేదు. ఉన్నంతలో సినిమాటోగ్రఫీ బెటర్. డ్రోన్ షాట్స్, కారులో షాట్స్ బాగా డిజైన్ చేశారు. 

నటీనటులు ఎలా చేశారంటే? : 'ఇన్ కార్'లో నటించడానికి రితికా సింగ్ ఎందుకు అంగీకరించారు? అనే ప్రశ్నకు సమాధానం పతాక సన్నివేశాల్లో గానీ లభించదు. ఈ సినిమాలో ఆమె తప్ప తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు లేవు. కారులో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న సన్నివేశాల్లో రితికా సింగ్ నటన బావుంటుంది. అయితే, సన్నివేశాల్లో డెప్త్ లేకపోవడంతో నటిగా ఆమె కూడా నిస్సహాయ స్థితిలో కూర్చోవలసి వస్తుంది. చివరి పావుగంటలో భావోద్వేగభరిత సన్నివేశాల్లో రితికా సింగ్ అద్భుతంగా నటించారు. మిగతా ఆర్టిస్టుల నటన ఆయా క్యారెక్టర్లలో ఓకే అనిపిస్తుంది. 

Also Read 'బలగం' రివ్యూ : చావు చుట్టూ అల్లిన కథ - 'దిల్' రాజు ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?

చివరగా చెప్పేది ఏంటంటే? : కారులో నుంచి అమ్మాయి తప్పించుకోవడం, పతాక సన్నివేశం... రెండిటిపై నమ్మకంతో దర్శక, నిర్మాతలు సినిమా తీసినట్టు ఉన్నారు. పావుగంటలో చెప్పాల్సిన కథను పావుగంట తక్కువ రెండు గంటలు సాగదీశారు. షార్ట్ ఫిలింకు ఎక్కువ, ఓటీటీకి తక్కువ అన్నట్టు ఉందీ 'ఇన్ కార్'. బే'కార్' కోసం థియేటర్లకు వెళ్ళడం అనవసరం!   

Also Read : 'క్రాంతి' రివ్యూ : తొమ్మిది రోజుల్లో తీసిన సినిమా - రాకేందు మౌళి నటించిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?

Published at : 03 Mar 2023 01:42 PM (IST) Tags: Ritika Singh ABPDesamReview In Car Review In Car Movie 2023

సంబంధిత కథనాలు

John Wick 4 Review - 'జాన్ విక్ 4' రివ్యూ : కీనూ రీవ్స్ హాలీవుడ్ సినిమా ఎలా ఉందంటే?

John Wick 4 Review - 'జాన్ విక్ 4' రివ్యూ : కీనూ రీవ్స్ హాలీవుడ్ సినిమా ఎలా ఉందంటే?

Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?

Das Ka Dhamki Movie Review - 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Naga Shourya's PAPA Review - 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ : నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల సినిమా ఎలా ఉందంటే?

Naga Shourya's PAPA Review - 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ : నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల సినిమా ఎలా ఉందంటే?

Kabzaa Review: కబ్జ రివ్యూ: ఉపేంద్ర పాన్ ఇండియా సినిమా ఎలా ఉంది? ఎవరు ఎవరిని ‘కబ్జ’ చేశారు?

Kabzaa Review: కబ్జ రివ్యూ: ఉపేంద్ర పాన్ ఇండియా సినిమా ఎలా ఉంది? ఎవరు ఎవరిని ‘కబ్జ’ చేశారు?

టాప్ స్టోరీస్

Amalapuram Riots Case: అమలాపురం అల్లర్ల ఘటనపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం

Amalapuram Riots Case: అమలాపురం అల్లర్ల ఘటనపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

నా ఇంటికి రా రాహుల్ భయ్యా-  రేవంత్ ఎమోషనల్ ట్విట్