Actress Raj Tarun Case: రాజ్‌తరుణ్ ప్రేమ కేసులో మరో బిగ్ ట్విస్ట్- లావణ్య, మాల్వీ పోటాపోటీ ఫిర్యాదులు- అబార్షన్ చేయించాడని ఆరోపణ
Raj Tarun VS Lavanya: రాజ్‌తరుణ్ కేసు మరో టర్న్ తీసుకుంది. ఇవాళ లావణ్య, మాల్వీ పోటాపోటీగా పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. కొన్ని ఆధారాలు కూడా సమర్పించారు.
![Actress Raj Tarun Case: రాజ్‌తరుణ్ ప్రేమ కేసులో మరో బిగ్ ట్విస్ట్- లావణ్య, మాల్వీ పోటాపోటీ ఫిర్యాదులు- అబార్షన్ చేయించాడని ఆరోపణ Lavanya once again meets the police officers against actress Raj Tarun and Malvi Malhotra also approach to police against lavanya Actress Raj Tarun Case: రాజ్‌తరుణ్ ప్రేమ కేసులో మరో బిగ్ ట్విస్ట్- లావణ్య, మాల్వీ పోటాపోటీ ఫిర్యాదులు- అబార్షన్ చేయించాడని ఆరోపణ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/10/622c16fc9539ab09555e839224d65d691720593269443215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Raj Tarun And Lavanya Case Latest Updates:: నటుడు రాజ్‌తరుణ్ ప్రేమ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పదేళ్లు క్రితం పెళ్లి చేసుకున్నామని ఆరోపిస్తున్న ప్రియురాలు లావణ్య ఇప్పుుడు మరో షాకింగ్ న్యూస్ పోలీసులకు చెప్పారు. పదేళ్లుగా తాము గుట్టుగా కాపురం చేస్తున్నామని కొన్నేళ్ల క్రితం తనకు అబార్షన్ కూడా అయిందన్నారు. రాజ్‌తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని ఆరోపించారు లావణ్య.
ఇవాళ మరోసారి పోలీసులను కలిసిన లావణ్య... మరిన్ని వివరాలు అందజేశారు. పదేళ్లుగా అన్విక పేరుతో కాపు చేస్తున్న రాజ్‌తరుణ్ తాను చాలా సార్లు విదేశాలకు వెళ్లినట్టు కూడా చెప్పుకొచ్చారు. ఆ పేరుతోనే విదేశాలకు వెళ్లినట్టు కూడా చెబుతున్నారు. అయితే మాల్వీ రాకతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చెప్పారు లావణ్య.
మాల్వీతో క్లోజ్‌గా ఉంటున్న రాజ్‌తరుణ్ తనను దూరం పెట్టాడని ఆరోపించారు. ఆ విషయంపై నిలదీయడంతోనే తనను దూరం పెట్టినట్టు చెబుతున్నారు లావణ్య. ఆమెను కలవడానికి తరచూ ముంబై వెళ్తున్నాడని ఆ విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్టు వివరించారు. నార్సింగి పోలీసులను కలిసిన లావణ్య కొన్ని ఆధారాలు సమర్పంచారు. ఫోన్ స్క్రీన్‌షాట్‌లు సహా కొన్ని డాక్యమెంట్స్ ఇచ్చారని చెబుతున్నారు.
లావణ్యపై కూడా నటి మాల్వీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిల్మ్‌నగర్ పీఎస్‌లో మాల్వీ కంప్లెయింట్ ఇచ్చారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తుందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. వేరే వాళ్లతో తనకు ఫోన్‌లు చేసి బెదిస్తోందని... అసభ్య పదజాలంతో తిట్టిస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: జాతిరత్నాలు ఫరియా అబ్దుల్లా లుక్ మొత్తం మార్చేసింది..ఇక వరుస ఆఫర్లు రావడం ఖాయం!
ఓ వైపు లావణ్య వరుస ఫిర్యాదులు ఆరోపణలు, మరోవైపు మాల్వీ కూడా ఫిర్యాదులు చేస్తోంది. కానీ ఇందులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌తరుణ్ మాత్రం సైలెంట్‌గా ఉంటున్నాడు. వివాదం తెరపైకి వచ్చిన రోజు ప్రెస్‌మీట్ పెట్టి అన్నింటికీ తన లాయర్ ద్వారా పోలీసులకు వివరిస్తానని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు ఏం జరగనట్టు సైలెంట్‌గా ఉండిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)