అన్వేషించండి

KV Reddy Death Anniversary: ఎన్టీఆర్‌ను దేవుణ్ణి చేసిన దర్శకుడు... రాజమౌళిని మించిన గొప్ప దార్శనికుడు... నేడు కేవీ రెడ్డి వర్ధంతి

ఈతరం గొప్ప దర్శకుడు రాజమౌళికి స్ఫూర్తిగా నిలిచిన దర్శకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్‌ను దేవుడిని చేసిన దర్శకుడు కేవీ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన సినిమా ప్రయాణంలో కొన్ని విశేషాలు...

ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రాజమౌళి. ఆయన తీసిన సినిమాలు సాధించిన రికార్డులు కలెక్షన్స్ అందుకోవడానికి మిగిలిన డైరెక్టర్లు పోటీ పడుతుంటారు. కలెక్షన్స్ మాటెలా ఉన్నా తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన దార్శనికుడు గా టాలీవుడ్ లో రాజమౌళి స్థానం చెక్కుచెదరనది. అయితే రాజమౌళికే నిరంతరం స్ఫూర్తిని ఇచ్చే దర్శకుడు మరొకరున్నారు. ఆయనే కేవీ రెడ్డి. పూర్తి పేరు కదిరి వెంకట రెడ్డి అయినా కేవీ రెడ్డి గానే ఆయన తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితులు. మాయాబజార్ సినిమా ఒక్కటి చాలు ఆయన దర్శకత్వ ప్రతిభ చాటడానికి.

మాయా బజార్, పాతాళ భైరవి సినిమాల డైరెక్టర్
ఈ జనరేషన్ కు కేవీ రెడ్డి పేరు తెలియక పోయినా 'మాయా బజార్', 'పాతాళ భైరవి' సినిమాల పేరు చెబితే చాలా తెలుగు సినిమా ప్రేక్షకుడు గర్వంతో ఇవి మా తెలుగు సినిమాలు అని చెప్పుకునే పరిస్థితి. ఆ సినిమాలను తెరకెక్కించింది కేవీ రెడ్డినే. ప్రతిష్ఠాత్మక విజయా బేనర్ లో ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు సంస్థ స్థాయిని పెంచాయి. 30 ఏళ్ల కెరీర్ లో తీసినవి 16 సినిమాలు (అందులో రెండు బైలింగ్వల్ మూవీస్ లో భాగంగా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా తీసిన 'మాయా బజార్', 'పాతాళ భైరవి' సినిమాలు). ఈ పదహారు సినిమాల్లో 12 సూపర్ హిట్ అయ్యాయి. వాహినీ పిక్చర్స్ లో ప్రొడక్షన్ మేనేజర్ గా కెరీర్ ప్రారంభించిన కేవీ రెడ్డి నెమ్మదిగా డైరెక్టర్ స్థాయికి ఎదిగి 1943లో అదే సంస్థలో నాగయ్య హీరోగా 'భక్త పోతన' సినిమా తీశారు. అది సూపర్ హిట్ కావడంతో వాహినీ ,విజయా సంస్థల్లో వరుస సినిమాలు తీశారు. 'భక్త పోతన' (1943) తరువాత 'యోగి వేమన', 'గుణ సుందరి కథ', 'పాతాళ భైరవి' (తెలుగు, తమిళం),'పెద్ద మనుషులు', 'దొంగ రాముడు', 'మాయా బజార్' (తెలుగు, తమిళం), 'పెళ్ళి నాటి ప్రమాణాలు', 'జగదేక వీరుని కథ', 'శ్రీ కృష్ణార్జున యుద్ధం', 'సత్య హరిశ్చంద్ర', 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ', 'భాగ్య చక్రం', 'శ్రీ కృష్ణ సత్య' సినిమాలు కేవీ రెడ్డి డైరెక్ట్ చేశారు.

ఎన్టీఆర్‌ను స్టార్‌నూ... ఆపై దేవుడినీ చేసింది కేవీ రెడ్డినే
అప్పటి వరకూ మామూలు హీరోగా ఉన్న ఎన్టీఆర్ ను 'పాతాళ భైరవి'తో స్టార్ హీరోను చేసింది కేవీ రెడ్డినే. హీరోగా చిత్తూరు నాగయ్య శకం ముగుస్తున్న సమయం అది. జానపద హీరోగా అక్కినేని నాగేశ్వర రావు వెలుగొందుతున్న సమయం కూడా అదే. అయితే 'పాతాళ భైరవి'లోని తోట రాముడి పాత్రకు వాళ్ళెవరూ సూట్ కారనీ భావించిన కేవీ రెడ్డి అనుకోకుండా ఎన్టీఆర్ ను చూడడం ఆయన్ను తోట రాముడి గా ఫిక్స్ చేయడం ఎన్టీఆర్ కెరీర్ ను మార్చేసింది. 'పాతాళ భైరవి' (1951) బ్లాక్ బస్టర్ కావడంతో ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ అందుకున్నారు. ఆపై 1957లో కేవీ తీసిన 'మాయా బజార్' అయితే ఎన్టీఆర్ ను ఏకంగా దేవుడ్ని చేసేసింది. అంతకు ముందు వేరే సినిమాలో కాసేపు కృష్ణుడి పాత్రలో కనిపించిన ఎన్టీఆర్ ఆ సినిమా ఫెయిల్ కావడంతో 'మాయా బజార్'లో ఆ పాత్ర వేసేందుకు వెనుకాడారు. అయితే విజయ నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి, దర్శకుడు కేవీ రెడ్డి ఆయనకు నచ్చజెప్పి శ్రీ కృష్ణుడిగా 'మాయా బజార్'లో నటింపజేశారు. ఆ తర్వాత జరిగింది అందరికీ తెలిసిన చరిత్రే. రాముడిగా కృష్ణుడిగా తెలుగునాట ఎన్టీఆర్ నిలిచిపోయారు. అలాగే తనకు 'దొంగ రాముడు', 'పెళ్ళినాటి ప్రమాణాలు', 'శ్రీ కృష్ణార్జున యుద్ధం', 'మాయా బజార్' లాంటి హిట్స్ ఇచ్చిన కేవీ రెడ్డి అంటే అక్కినేని నాగేశ్వర రావుకూ ఎంతో గౌరవం. అందుకే ఎన్టీఆర్, అక్కినేని లాంటి వాళ్ళు తమ సొంత సంస్థల్లో సైతం కేవీతో సినిమాలు తీయించడం గౌరవంగా భావించారు.

కేవీ రెడ్డి డైరెక్షన్... మిగిలిన వాళ్లకు ఒక పాఠం
కేవీ రెడ్డి డైరెక్షన్ చాలా డిఫరెంట్ గా ఉండేది. ఆయన దగ్గర 'మాయా బజార్'కు అసిస్టెంట్ గా పనిచేసిన సింగీతం శ్రీనివాసరావు అందించిన వివరాల ప్రకారం... కేవీ రెడ్డి సినిమా తీసేముందు అందరి అభిప్రాయాలు తీసుకునేవారు. కానీ ఒక్కసారి స్క్రిప్ట్ లాక్ అయ్యాక మాత్రం ఎవ్వరినీ వేలు పెట్టనిచ్చేవారు కారు. గ్రాఫిక్స్ లేని రోజుల్లో కెమెరామెన్ మార్కస్ బార్టలేతో కలిసి కేవీ తీసిన 'గిల్పం - గింబళి' సీన్, 'లాహిరి లాహిరి లాహిరిలో...' పాటకు వాడిన లైటింగ్, 'పాతాళ భైరవి' సినిమాలోని దేవత గుహలోని సీన్ల మేకింగ్ ఇప్పటికీ టాలీవుడ్ డైరెక్టర్లకు ఒక పాఠమే. తరువాత కాలంలో డైరెక్టర్ గా ఎన్టీఆర్ తన గురువు కేవీ రెడ్డి శైలిని అనుకురించేవాడి నని చెప్పుకునేవారు. రాజమౌళి సైతం 'యమదొంగ' సినిమా మేకింగ్ టైంలో మాయాబజార్ సీన్లను తన VFX టీమ్ తో కలిసి పదేపదే చూసి కథలో గ్రాఫిక్స్ ను ఎలా మిక్స్ చెయ్యాలో నేర్చుకున్నానని చాలా సార్లు చెప్పారు. ఇప్పటికీ తనకు కేవీ రెడ్డి స్ఫూర్తి అని అంటారు దర్శక ధీరుడు రాజమౌళి.

కెరీర్ చివర్లో కాస్త తడబాటు
ఎన్నో క్లాసిక్స్ తీసిన కేవీ రెడ్డి కెరీర్ చివర్లో కాస్త తడబడ్డారు. 'ఉమా చండీ గౌరీ శంకరుల కథ', 'భాగ్య చక్రం' లాంటి సినిమాలు ఆడలేదు. దానితో ఆయనతో సినిమా తీయడానికి ఒకప్పుడు వెంట పడిన నిర్మాతలు ముఖం చాటేశారు. ఒక హిట్ మూవీని డైరెక్ట్ చేసి రిటైర్ అవుదామని అనుకుంటున్న కేవీ రెడ్డినీ ఆర్థికంగానూ ఆదుకునే ఉద్దేశ్యంతో తమ సొంత సినిమా 'శ్రీ కృష్ణ సత్య'కు డైరెక్షన్ చేయమని కోరారు ఎన్టీఆర్. నిజానికి ఆ సినిమా టైంకు కేవీరెడ్డి ఆరోగ్యం బాలేదు. ఆయనను డైరెక్టర్ కుర్చీలో కూర్చోబెట్టి మొత్తం సినిమా ఎన్టీఆర్ నే డైరెక్ట్ చేశారని నాటి విషయాలు తెలిసిన వాళ్ళు అంటారు. ఆ సినిమా (1971) హిట్ కావడంతో తృప్తిగా ఆ మరుసటి ఏడాది 1972 సెప్టెంబర్ 15 అంటే సరిగ్గా ఇదే రోజున కన్నుమూశారు. కేవీ రెడ్డి.

కేవీ రెడ్డి దర్శకత్వ వారసత్వం
1912 జులై 1న కదిరిలో పుట్టిన కేవీ రెడ్డి ఎక్కువగా మేనమామ దగ్గర అనంతపురంలో పెరిగారు. వాహినీ సంస్థలో చిన్న ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి సినిమాపై పూర్తి పట్టు సాధించారు. ఆయన స్క్రీన్ ప్లే ఎంత పకడ్బందీగా ఉండేది అంటే ఆ పాత రీళ్ళ కాలంలోనే పేపర్ పై ఎన్ని అడుగుల సినిమా తీస్తానని చెప్పేవారో సరిగ్గా అంతే పొడవు సినిమా తీసేవారట. దీనివల్ల నిర్మాతలకు ఎంతో ఖర్చు మిగిలేది. అలాగే కెమెరా ట్రిక్స్ విషయంలో ఇప్పటికీ ఆయన సాధించిన విజయాలు పద్ధతులు సింగీతం శ్రీనివాస రావు నుండి రాజమౌళి వరకూ లెజెండరీ దర్శకులకు ఒక రిఫరెన్స్ లా పనికి వస్తున్నాయి. ఇటీవల ఒక జాతీయ న్యూస్ సంస్థ దేశ వ్యాప్తంగా చేసిన సర్వేలో ఆల్ టైం గ్రేట్ 50 సినిమాల్లో జాతీయ స్థాయిలో 'మాయా బజార్', 'పాతాళ భైరవి' ఉండడం కేవీ రెడ్డి స్థాయిని చెబుతోంది.

Also Read: అన్నయ్యా... అన్నయ్యా... అన్నయ్యా... నీది మాములు విలనిజం కాదన్నయ్యా... ఎస్.జె. సూర్య బెస్ట్ విలన్ రోల్స్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget