Kiran Abbavaram: తెలుగు సినిమాలకు తమిళనాడులో నో థియేటర్స్... కానీ ఇక్కడ... - కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్
Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తెలుగు హీరోల సినిమాలకు తమిళనాడులో థియేటర్స్ దొరకడం లేదన్నారు.

Kiran Abbavaram About Telugu Movie Releases In Tamilnadu: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ లవ్ ఎంటర్‌టైనర్ 'కె ర్యాంప్' ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. మూవీ టీం ప్రమోషన్లలో బిజీగా ఉండగా హీరో కిరణ్ తాజాగా ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమిళనాడులో తెలుగు హీరోల సినిమాలు రిలీజ్ చేయడం చాలా కష్టమన్నారు.
అక్కడ థియేటర్స్ దొరకలేదు
తమిళ హీరోల సినిమాలకు ఇక్కడ థియేటర్స్ ఈజీగా దొరుకుతాయని... కానీ తెలుగు హీరోల సినిమాలకు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో స్క్రీన్స్ దొరకవని చెప్పారు కిరణ్ అబ్బవరం. 'నాన్ తెలుగు హీరోల సినిమాలు తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంటాయి. మన తెలుగు వారు కంటెంట్ మంచిగా ఉంటే ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. అయితే, మన తెలుగు హీరోల సినిమాలను మాత్రం తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రిలీజ్ చేయాలంటే అవాంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
గతేడాది నేను హీరోగా నటించిన 'క' మూవీ తెలుగు మంచి విజయం సాధించింది. దీన్ని తమిళనాడులో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేసేందుకు ట్రై చేశాను. అయితే, వాళ్లు డైరెక్ట్‌గానే చెప్పేశారు. పండుగల టైంలో తెలుగు హీరోల సినిమాలకు స్క్రీన్స్ దొరకవు అని చెప్పేశారు. చివరకు ఫస్ట్ వీక్ తెలుగు వెర్షన్‌కు కూడా నాకు థియేటర్స్ దొరకలేదు. కేవలం 10 స్క్రీన్లలో రిలీజ్ చేశాను. ఆ తర్వాత మెల్లగా థియేటర్స్ పెరిగాయి. ఇది నాకు చాలా బాధగా అనిపించింది. తమిళ స్టార్స్, యువ హీరోల మూవీస్ మేము ఇక్కడ చూస్తాం. కానీ మన తెలుగు హీరోల మూవీస్ అక్కడ రిలీజ్ చేయాలంటే ఎందుకో కష్టం అవుతుంది.' అని చెప్పారు.
Also Read: ట్రెండింగ్‌లో ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' ట్రైలర్ - ఏదైనా లెఫ్ట్ హ్యాండ్‌తో డీల్ చేస్తున్నారా?
ఇక్కడ తమిళ యాక్టర్స్‌కు మార్కెట్ ఉందని అన్నారు కిరణ్ అబ్బవరం. 'తెలుగులో మంచి మార్కెట్ ఉన్న 10 మంది తమిళ హీరోలు ఉన్నారు. వారి సినిమాలు ఇక్కడ ఎప్పుడు రిలీజ్ అయినా మంచిగా థియేటర్స్ దొరుకుతాయి. తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన 'డ్యూడ్' ఈ దీపావళికి తెలుగులో రిలీజ్ అవుతుంది. అద్భుతమైన స్క్రీన్స్ దొరికాయి. కానీ అదే టైంలో తెలుగు సినిమాలకు అక్కడ థియేటర్స్ దొరకడం లేదు. కె ర్యాంప్ సినిమాను తమిళంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నా థియేటర్స్ దొరకడం లేదు. మేము తమిళ స్టార్స్‌ను ప్రేమిస్తూ సపోర్ట్ ఇస్తాం. వారి నుంచి కూడా అలాంటి సపోర్ట్ లభిస్తే బాగుంటుంది.' అని అన్నారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కిరణ్‌కు మద్దతుగా నెటిజన్లు కొందరు ట్వీట్స్ చేస్తున్నారు.
'కె ర్యాంప్' మూవీలో కిరణ్ సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటు నరేష్, సాయి కుమార్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ సమర్పపణలో రాజేశ్ దండ, శివబొమ్మకు నిర్మిస్తున్నారు.





















