K-RAMP: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా 'కె ర్యాంప్' ఫస్ట్ సాంగ్ రెడీ... 'ఓనమ్' రిలీజ్ ఎప్పుడంటే?
K-RAMP Onam Song: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా 'కె ర్యాంప్' నుంచి అప్డేట్ వచ్చింది. సినిమాలో మొదటి పాట విడుదల తేదీ అనౌన్స్ చేశారు. 'ఓనమ్' రిలీజ్ ఎప్పుడో తెలుసుకోండి.

కిరణ్ అబ్బవరం ఫుల్ జోష్‌లో ఉన్నారు. తిరుపతి వెళ్లి కుమారుడు హను అబ్బవరం నామకరణం చేశారు. ఇప్పుడు తన కొత్త సినిమా 'కే ర్యాంప్'లో మొదటి పాట 'ఓనమ్' గురించి అప్డేట్ ఇచ్చారు.
ఓనమ్ రిలీజ్ ఎప్పుడంటే?
'కే ర్యాంప్' సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, ఇంకా రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మాతలు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన 'రంగబలి' ఫేమ్ యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
Onam Song Release Date: మలయాళీలు - కేరళ ప్రజలు ఎంతో సంతోషంగా, సంప్రదాయంగా జరుపుకొనే పండుగ 'ఓనమ్'. ఆ పేరుతో 'కే ర్యాంప్' సినిమాలో ఒక సాంగ్ చేశారు. ఆ పాటను ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ మాంచి ఎనర్జిటిక్ ట్యూన్ కంపోజ్ చేశారని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ పాటలో మలయాళ ట్రెడిషన్ చూపిస్తూ కలర్ ఫుల్ గా తీశారట.
View this post on Instagram
దీపావళి కానుకగా 'కే ర్యాంప్' రిలీజ్!
K Ramp movie release date: 'కే ర్యాంప్' సినిమాను దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18న విడుదల చేయనున్నట్టు తెలిపారు. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి, యాక్షన్: పృథ్వీ, కూర్పు: ఛోటా కె ప్రసాద్, ఛాయాగ్రహణం: సతీష్ రెడ్డి మాసం, సంగీతం: చేతన్ భరద్వాజ్, సహ నిర్మాత: బాలాజీ గుట్ట, నిర్మాతలు: రాజేష్ దండా - శివ బొమ్మకు, రచన - దర్శకత్వం: జైన్స్ నాని.
Also Read: ఎవరీ వెంకటేష్ నాయుడు? ఆయనతో తమన్నాకు సంబంధం ఏమిటి? గోల్డ్ - లిక్కర్ స్కాంలో మిల్కీ బ్యూటీ





















