Kingdom: మే 30న కాదు... జూలైకు వెళ్లిన విజయ్ దేవరకొండ - ఇదిగో 'కింగ్‌డమ్' న్యూ రిలీజ్ డేట్
Kingdom Release Date: విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' సినిమా విడుదల వాయిదా పడింది. మే 30న రిలీజ్ కావాల్సిన సినిమా జూలైకు వెళ్ళింది. ఇవాళ న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా 'మళ్ళీ రావా', 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్‌డమ్' (Kingdom). ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మే 30వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా జూలైకు వెళ్ళింది.
మే 30వ తేదీన కాదు...
జూలై 4న 'కింగ్‌డమ్' రిలీజ్!
మే 30వ తేదీ నుంచి జూలై 4కు 'కింగ్‌డమ్'ను వాయిదా వేసిన విషయాన్ని ఈ రోజు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ''మా 'కింగ్‌డమ్'ను మే 30వ తేదీకే తీసుకు రావాలని ఎంతో ట్రై చేశాం. కానీ, ఇటీవల దేశంలో జరిగిన ఊహించని ఘటనలు జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమోషన్స్ చేయడం, ఈవెంట్స్ నిర్వహించడం కష్టమని వాయిదా వేశాం. జూలై 4న సినిమాను విడుదల చేస్తాం'' అని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పేర్కొంది. థియేటర్లలోకి 'కింగ్‌డమ్' ఆలస్యంగా వచ్చినా అభిమానులతో పాటు ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని తెలిపింది.
#KINGDOM and its Arrival ‼️
— Sithara Entertainments (@SitharaEnts) May 14, 2025
JULY 04th, 2025 🔥@TheDeverakonda @anirudhofficial @gowtam19 #BhagyashriBorse @dopjomon #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @artkolla @NeerajaKona @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios @AdityaMusic pic.twitter.com/ASQbpCJUs9
'కింగ్‌డమ్' కోసం 'తమ్ముడు వాయిదా?
''విడుదల తేదీ మార్చుకునేందుకు తమకు ఎంతో మద్దతు ఇచ్చినందుకు నిర్మాత 'దిల్' రాజు గారికి, హీరో నితిన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము" అని 'కింగ్‌డమ్' చిత్ర బృందం పేర్కొంది. జూలై 4న నితిన్ హీరోగా 'దిల్' రాజు నిర్మించిన 'తమ్ముడు'ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు 'కింగ్‌డమ్' కోసం వాయిదా వేసినట్టు తెలిసింది.
'కింగ్‌డమ్'లో విజయ్ దేవరకొండ స్పై (గూఢచారి) రోల్ చేస్తున్నారు. ఆయనకు జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వరిస్తున్నారు. జాతీయ పురస్కార గ్రహీత నవీన్ నూలి ఈ చిత్ర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.





















