Kingdom First Day Collection: 'కింగ్డమ్' కలెక్షన్స్... విజయ్ దేవరకొండ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్? మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Kingdom First Day Box Office Collection: విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమాకు మొదటి రోజు మిక్స్డ్ టాక్ లభించింది. అయితే ఓపెనింగ్స్ మాత్రం భారీగా వచ్చాయి. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

'ది' విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' చిత్రానికి కామన్ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. రౌడీ ఫ్యాన్స్‌కి అయితే సినిమా బాగా నచ్చింది. విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్‌లోనూ పరిణితి కనిపించింది. గౌతమ్ తిన్ననూరి టెక్నికల్ టీంను అద్భుతంగా వాడుకున్నారు. అనిరుధ్ బీజీఎం ప్రతీ సీన్‌కు డ్యూటీ చేశారు. మరి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా?
ఫస్ట్ డే రూ.39 కోట్లు
'కింగ్డమ్' మీద ముందు నుంచి పెరిగిన హైప్‌తో ఓపెనింగ్ డే అయితే చాలా చోట్ల హౌస్ ఫుల్స్‌తో నడిచింది. అన్ని చోట్లా 'కింగ్డమ్'కు మంచి వసూళ్లే వచ్చినట్టుగా తెలుస్తోంది. నైజాంలో దాదాపు 8 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా సమాచారం. సీడెడ్, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో యాభై శాతం రికవరీ చేసినట్టుగా టాక్. అలా మొత్తంగా ఈ చిత్రానికి మొదటి రోజు రూ.39 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ఈ విషయాన్ని మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. 'రాజు రాక బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది' అంటూ ట్వీట్ చేసింది.
The King’s arrival has created havoc 🔥
— Sithara Entertainments (@SitharaEnts) August 1, 2025
𝗢𝗻 𝗮 𝗻𝗼𝗻 𝗵𝗼𝗹𝗶𝗱𝗮𝘆 𝗧𝗵𝘂𝗿𝘀𝗱𝗮𝘆 𝗿𝗲𝗹𝗲𝗮𝘀𝗲, 𝗗𝗮𝘆 𝟭 𝗪𝗼𝗿𝗹𝗱𝘄𝗶𝗱𝗲 𝗚𝗿𝗼𝘀𝘀 𝗶𝘀 ~ 𝟯𝟵 𝗖𝗿𝗼𝗿𝗲𝘀+ 💥💥
A true display of the hysteria created among the audience ❤️🔥❤️🔥#BoxOfficeBlockbusterKingdom… pic.twitter.com/JsF8qidrrx
Also Read: రేపిస్టులు, హంతకులు హాయిగా బతకొచ్చు... కానీ కుక్కలకు? - రేణూ దేశాయ్ ఆవేదన
Daily sales of #Kingdom on BMS
— ABP Desam (@ABPDesam) August 1, 2025
Sunday: 29.39K
Monday: 34.81k
Tuesday: 70.42k
Wednesday: 132.83k
Thursday: 222.06k#BoxOfficeBlockbusterKingdom #VijayDeverakonda #BhagyashriBorse #SatyaDev pic.twitter.com/6vlpK1qfbg
బాలీవుడ్ కలెక్షన్స్ అనౌన్స్ చేసే ట్రేడ్ పోర్టల్స్ బట్టి 'కింగ్డమ్' మొదటి రోజు కలెక్షన్ 15 కోట్ల షేర్ అని టాక్. 'లైగర్' కంటే ఇది తక్కువ. కానీ, తెలుగు వరకు విజయ్ దేవరకొండ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్. 'లైగర్' సినిమాకు హిందీలో భారీ వసూళ్లు వచ్చాయి. 'కింగ్డమ్'కు ఆ స్థాయిలో రాలేదు. నాని 'హిట్ 3' తర్వాత తెలుగులో డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన హీరోగా విజయ్ దేవరకొండ నిలిచినట్టు తెలుగు ట్రేడ్ పోర్టళ్లు రిపోర్ట్ చేస్తున్నాయి.
Also Read: ప్రాణ స్నేహితులే రాజకీయ శత్రువులు - రాష్ట్ర విధిని మార్చిన కథ... ఆసక్తికరంగా 'మయసభ' ట్రైలర్
'కింగ్డమ్' కోసం భారీగా ఖర్చు పెట్టిన తీసిన 'హృదయం లోపల' పాటను సినిమాలో లేపేశారు. రొమాంటిక్, విజయ్ దేవరకొండ - భాగ్య శ్రీ లిప్ లాక్ అంటూ తెగ హడావిడి చేశారు. ఆ పాటను అంతలా ప్రమోట్ చేసి చివరకు స్పేస్ లేదని, అడ్డంగా ఉందని పాటని తీసేశారు. ప్రేక్షకులకు అదొక నిరాశ. అయితే చాలా చోట్ల చాలా చిత్రాల నుంచి సీన్లను తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. రీసెంట్‌గా వచ్చిన సూర్య 'రెట్రో' మూవీలోని కొన్ని సీన్లను చూసినట్టుగా అనిపిస్తుంది. 'కింగ్డమ్' మీద చాలానే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా కొంత మంది నిరాశ చెందారు. అలా 'కింగ్డమ్' మీద ఇప్పుడు మిక్స్డ్ టాక్ అయితే ఉంది. వీకెండ్ వరకు ఈ టాక్‌తో కింగ్డమ్ ఎంత రాబడతాడో చూడాలి. ఇక వీక్ డేస్‌లో అయితే హౌస్ ఫుల్స్ అవ్వడం అనేది ఇప్పుడు ఎంత కష్టంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కలెక్షన్ల పోస్టర్ల గురించి, వసూళ్ల గురించి నాగవంశీ ఎంత లైట్‌గా చెబుతున్నాడో అందరూ చూస్తున్నారు. పోస్టర్లది ఏముందిలే.. ఎంత కావాలో చెప్పండి.. అంత వేసేద్దాం అని అంటున్నారు. అలాంటప్పుడు వీళ్లు వేసే కలెక్షన్ పోస్టర్లను జనాలు నమ్ముతారా? లేదా? అన్నది కూడా అనుమానమే.





















