Nagarjuna : నాగార్జునకు వెరీ వెరీ స్పెషల్ - ఫస్ట్ సినిమా విక్రమ్, ANR లాస్ట్ మూవీ మనం ఇవాలే రిలీజ్
Nagarjuna Movie Journey : కింగ్ నాగార్జునకు, అక్కినేని ఫ్యామిలీకి ఈ రోజు వెరీ స్పెషల్ డే. నవ మన్మథుడి సినీ జర్నీలో మే 23కి ఉన్న ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా...

King Nagarjuna Started His Journey On This Date : మే 23.... అక్కినేని ఫ్యామిలీకి ఈరోజుతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇదే రోజున కింగ్ నాగార్జున తన సినీ కెరీర్‌కు నాంది పలికారు. ఆయన హీరోగా నటించిన ఫస్ట్ మూవీ 'విక్రమ్' 1986లో ఇదే రోజున థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఓ సరికొత్త లెజెండ్ పరిచయం అయిన రోజు ఇదే కావడం విశేషం.
తన సినీ కెరీర్‌లో హీరోగా ఎన్నో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నారు నాగ్. ఆఖరి పోరాటం, గీతాంజలి, మజ్ను ఇలా ప్రతీ సినిమా ఓ మైలురాయి అనే చెప్పాలి. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'శివ' నాగ్ కెరీర్‌లోనే కాకుండా ఏకంగా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఓ సరికొత్త ట్రెండ్‌నే క్రియేట్ చేసింది. ఇండస్ట్రీలో శివ ముందు తర్వాత అనేంతలా రికార్డు సృష్టించింది. ఈ మూవీకి నాగ్ బెస్ట్ యాక్టర్‌గా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. హిందీలో కూడా అదే పేరుతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున.
Today, May 23rd
— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 23, 2026
నా సిని జీవితం మొదలైన రోజు
Akhil నాకో చిన్న surprise ఇచ్చాడు చూస్తుంటే చాలా హాయి గా ఉంది
మీరు చూడండి.
👉🏽 https://t.co/QG2BFis2XT
మనోడు వస్తున్నాడు…. #ManoduVasthunnadu #LeninOnJune26th
నవ మన్మథుడు
90s జనరేషన్ అయినా ఇప్పటి Zen Z జనరేషన్ అయినా నాగ్ యూత్‌కు ట్రెండ్ సెట్టర్. అమ్మాయిలకు నవ మన్మథుడే. టాలీవుడ్‌లో సెల్లులాయిడ్ శాస్త్రవేత్తగా ముద్దుగా పిలుచుకునే నాగార్జున తనను తాను కంటిన్యూగా కొత్తగా ఆవిష్కరించుకుంటూ తన మూవీ జర్నీ కొనసాగించారు. గీతాంజలితో ప్రేమకు కొత్త నిర్వచనం చెబితే... అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి వంటి మూవీస్‌తో ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తించారు.
హలో బ్రదర్, మన్మథుడు, కింగ్, బంగార్రాజు వంటి మూవీస్‌తో న్యూ ట్రెండ్ సెట్ చేశారు. వేగంగా మారుతున్న తెలుగు సినీ ప్రపంచంలో వయసుతో సంబంధం లేకుండా ఏ జనరేషన్ వారికైనా యంగ్ కింగ్ స్టైలిష్ ఐకాన్‌గా నిలిచారు.
Also Read : ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఏఎన్నార్ లాస్ట్ మూవీ
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
ట్రెండింగ్ వార్తలు























