Bro Movie: పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సినిమాలో ఆ మాస్ బీట్ సాంగ్ - ఇక థియేటర్లలో రచ్చ రచ్చే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘బ్రో’ మూవీ ఈ నెల 28 న విడుదల కానుంది. ఈ మూవీలో పవన్ ఫ్యాన్స్ కోసం ఒక స్పెషల్ సాంగ్ ను వేయనున్నారట. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Bro Movie: తమిళ దర్శకుడు సముద్రఖని డైరెక్షన్ లో పపర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా ‘బ్రో’. ఈ మూవీ తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు తెలుగు రీమేక్. ఈ మూవీ జులై 28 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు, పాటలు మంచి టాక్ ను సొతం చేసుకున్నాయి. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవలే మూవీ టీమ్ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ వేడుక గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ‘కిల్లి కిల్లి’ సాంగ్ లేటెస్ట్ వెర్షన్ తో స్పెషల్ ట్రీట్ ను అందించింది మూవీ టీమ్.
పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే..
పవన్ కళ్యాణ్ నటించిన ఈ ‘బ్రో’ మూవీ అతి త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసం మేకర్స్ ఒక స్పెషల్ ట్రీట్ ను ప్లాన్ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘గుడుంబా శంకర్’ సినిమాలోని ‘కిల్లి కిల్లి’ అనే సాంగ్ ను రీక్రియేట్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కలిసి సరికొత్త స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఈ పాటలో ప్రారంభానికి ముందు పవన్ మూవీ తమ్ముడులో అయన పాడిన ‘నబో నబో నబరి గాజులు’ పాట లిరిక్స్ పెట్టారు. ఈ లిరిక్స్ కు పవన్, సాయి ధరమ్, తమన్ స్టెప్పులేయడం ఈ వీడియోలో చూడొచ్చు. ఇందులో పవన్ కళ్యాణ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ పాట ప్రోమోను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ పాటను సినిమా ఎండ్ క్రెడిట్స్ లో వేస్తారని అందరూ అనుకుంటున్నారు.
వింటేజ్ పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్స్..
పవర్ స్టార్ సినిమాల్లో ఇలాంటి జానపద, పల్లె గీతాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒకప్పుడు తొలి ప్రేమ, తమ్ముడు, ఖుషీ, గుడుంబా శంకర్ లాంటి సినిమాల్లో పవన్ ఇలాంటి పాటలతో యూత్ ను ఆకట్టుకునేవారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో అలాంటి పాటలను కలగలిపి ఓ లేటెస్ట్ వెర్షన్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ పాటతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయనే చెప్పాలి. ఇది చూసిన అభిమానులు వింటేజ్ పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి మూవీలో ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.
ఇక ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ తో మరోసారి అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన సినిమా జర్నీ గురించి చెప్పిన విశేషాలు ఆకట్టుకున్నాయి. అలాగే తెలుగు ఇండస్ట్రీ గురించి కూడా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు తెలుగు సినిమాను ప్రపంచ పటంలో నిలబెట్టాయని అన్నారు. అందరి సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని, తమిళ్ పరిశ్రమ కూడా ఇలాగే అందర్నీ కలుపుకొని ప్రపంచ స్థాయి సినిమాలను తెరకెక్కించాలని అన్నారు. తమిళ నటుడు సముద్రఖని తెలుగు నేర్చుకొని తెలుగులో కథ చెప్పి తెలుగు సినిమా తీయడం పట్ల అభినందనలు తెలియజేశారు. తాను కూడా తమిళ్ నేర్చుకొని తమిళ్ లో స్పీచ్ ఇస్తానని అన్నారు. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ, ఊర్వశి రౌతేలా, ప్రియా ప్రకాష్ వారియర్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకు మాటలు, స్క్రీన్ ప్లే అందించారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై మూవీను నిర్మించారు.
Also Read: వరుణ్ తేజ్‌తో జతకట్టనున్న నోరా ఫతేహి, మరి మీనాక్షి చౌదరి సంగతేంటి?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial