అన్వేషించండి

Ideas Of India Summit 3.0: అదంతా పెళ్లి తర్వాతే జరిగింది, ఆ విషయంలో ప్రేక్షకులకే థ్యాంక్స్ చెప్పాలి - కియారా అద్వానీ

Kiara Advani: పెళ్లి తర్వాత నటీమణుల కెరీర్ ముగిసిపోతుంది అని చాలామందికి ఉన్న అపోహలపై కియారా అద్వానీ క్లారిటీ ఇచ్చింది. ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌‌లో ఈ విషయంపై తను మాట్లాడింది.

Kiara Advani at Ideas Of India Summit 3.0: ఏబీపీ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో జరిగిన ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో పాల్గొన్న బాలీవుడ్ భామ కియారా అద్వానీ.. ఎన్నో విషయాలపై తన అభిప్రాయాలను బయటపెట్టింది. తను సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి ఎంత కష్టపడిందో చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకులు చూశానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా పెళ్లి అయితే ఇక హీరోయిన్స్.. సినిమాల్లో నటించలేరు అని కొందరు ప్రేక్షకులకు ఉన్న నెగిటివ్ అభిప్రాయంపై కూడా కియారా స్పందించింది. సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన సమయంలో బాలీవుడ్‌లో తనకు ఇకపై ఆఫర్లు రావని అందరూ విమర్శించారని చెప్పుకొచ్చింది.

ఆడియన్స్‌కే థ్యాంక్స్..

పెళ్లికి ముందు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను ఒక దారిలోకి తెచ్చుకుంది కియారా అద్వానీ. పైగా తను నటించిన సినిమాలు అన్ని హిట్ అవుతూ తనకు మరెన్నో ఆఫర్లు రావడం కూడా మొదలయ్యింది. ఇంతలోనే సిద్ధార్థ్ మల్హోత్రాతో పెళ్లి అని ప్రకటించింది. దానిపై కొందరు చేసిన విమర్శలను ఏబీపీ ఈవెంట్‌లో గుర్తుచేసుకుంది. ‘‘తను ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? తను ఇప్పుడే మంచి స్థాయికి చేరుకుంటుంది అని ఏదేదో అన్నారు. కానీ నేను ప్రేక్షకులకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వారిలోనే మార్పు వచ్చింది. మామూలుగా ఈ విషయంపై దర్శకులకు, నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాం. కానీ నిజానికి ఆడియన్స్‌కే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వారు మమ్మల్ని కేవలం ఒక పాత్రగానే చూస్తారు’’ అంటూ ప్రేక్షకులకే క్రెడిట్ మొత్తం ఇచ్చేసింది కియారా.

ఇదే మార్పు..

‘‘నేను పెళ్లి చేసుకున్నా, తల్లైనా, ఇంకొకరి కూతురు అయినా, ఏదైనా సరే.. ఆ క్షణంలో నేను కేవలం ఆ పాత్ర రూపంలోనే కనిపిస్తాను. పెళ్లి తర్వాతే నేను రెండు అతిపెద్ద ప్రాజెక్ట్స్ సైన్ చేశానని గర్వంగా చెప్తున్నాను. నాలాగే చాలామంది నటీమణులు ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ నటీమణులు అందరూ పెళ్లైనవారే. ఎంత మార్పు వచ్చిందో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు.. ఇదే ఒక పాజిటివ్ మార్పుకు నిదర్శనం’’ అని తెలిపింది కియారా అద్వానీ. అంతే కాకుండా సిద్ధార్థ్‌తో తన రిలేషన్‌షిప్‌పై కూడా ఈ భామ స్పందించింది. ‘‘నేను చాలా ప్రేమించే కుటుంబం మధ్య పెరిగాను. అందులో చాలా గారాభం ఉంటుంది. అలాంటి ప్రేమనే నేను సిద్ధార్థ్ దగ్గర చూశాను’’ అని తెలిపింది.

బ్యాలెన్స్ చేస్తాను..

‘‘నా పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసే విషయంలో విజయం సాధించానని అనుకుంటాను. నేను ఏదైనా చేయాలనుకుంటే అది చేసేస్తాను’’ అని తన కెరీర్ నిర్ణయాల గురించి స్టేట్‌మెంట్ ఇచ్చింది కియారా అద్వానీ. ప్రస్తుతం కియారా చేతిలో ఒక భారీ బడ్జెట్ హిందీ ప్రాజెక్ట్‌తో పాటు ఒక తెలుగు ప్రాజెక్ట్ కూడా ఉంది. రణవీర్ సింగ్, ఫర్హన్ అఖ్తర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘డాన్ 3’లో కియారానే హీరోయిన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రానున్న ‘గేమ్ ఛేంజర్’లో కూడా తనే లీడ్ రోల్‌లో సెలక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక 2023 ఫిబ్రవరీ 7న సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది కియారా అద్వానీ.

Also Read: నేనేం రాత్రికిరాత్రే స్టార్‌ అయిపోలేదు - అదే నన్ను ఈ స్థాయికి చేర్చింది..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
State Wise EV Subsidy: ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు - ఏపీ, తెలంగాణల్లో ఎంత వస్తుంది?
ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు - ఏపీ, తెలంగాణల్లో ఎంత వస్తుంది?
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Embed widget