అన్వేషించండి

Anant Ambani Pre Wedding: అంబానీ ప్రి-వెడ్డింగ్: రామ్ చరణ్‌కు రెమ్యునరేషన్ ఇవ్వలేదు? పైగా అవమానం!

Anant Ambani Pre Wedding: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో ‘నాటు నాటు’ పాటకు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ స్టెప్పులేశారు. కానీ దీనికోసం వారు ఏ రెమ్యునరేషన్ తీసుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

Khans Dance at Anant Ambani Pre Wedding: రెమ్యునరేషన్ లేకుండా స్టార్ హీరోలు ఎక్కువశాతం ఏ పని చేయరు. ఒక్క నిమిషం గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడానికి అయినా వారు.. దానికి తగిన రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇది చాలామంది ప్రేక్షకులకు తెలిసిన విషయమే. అయితే తాజాగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఇలా బాలీవుడ్‌లో ముగ్గురు బడా ఖాన్స్ హాజరయ్యారు. దీంతో ఈ ముగ్గురు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడానికి, ఆడి పాడడానికి భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా అసలు ఆ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడానికి వారు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని మరో రూమర్ వైరల్ అవుతోంది.

రిజెక్ట్ చేశారు..

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడు రోజులు జరిగాయి. అందులో రెండోరోజు సంగీత్ లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అంబానీ ఫ్యామిలీ. ఆ సంగీత్‌లో ఎంతోమంది హాలీవుడ్, బాలీవుడ్ స్టార్లు పాల్గొన్నారు. పాటలు పాడారు, డ్యాన్సులు చేశారు. అదే రోజు షారుఖ్, సల్మాన్, అమీర్ కలిసి ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేయడం మొత్తం సెలబ్రేషన్స్‌లోనే హైలెట్‌గా నిలిచింది. దీనికోసం ఈ ముగ్గురు ఖాన్స్ భారీగానే ఛార్జ్ చేసుంటారని ప్రేక్షకులు చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీనికోసం వారికి రెమ్యునరేషన్ ఇవ్వడానికి ప్రయత్నించినా వారు రిజెక్ట్ చేసి.. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో గెస్టులను ఎంటర్‌టైన్ చేయడం వారికి ఆనందం కలిగించిందని చెప్పారట. ఈ వేదికపై ఖాన్స్‌తో కాలు కదిపిన రామ్ చరణ్‌కు కూడా ఎలాంటి రెమ్యునరేషన్ ఇవ్వలేదని తెలిసింది. దీంతో.. చెర్రీకి ఏమీ ఇవ్వకపోగా.. అవమానించి పంపారంటూ ఆయన అభిమానులు వాపోతున్నారు.

ఆనందంగా పాల్గొన్నారు..

స్టేజ్‌పై ఎక్కడానికి, డ్యాన్స్ చేసి గెస్టులను అలరించడానికి షారుఖ్, సల్మాన్, అమీర్.. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అందరూ ఆనందంగా పాల్గొన్న తర్వాత దానికోసం రెమ్యునరేషన్ అందుకోవడం కరెక్ట్ కాదు కదా అని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈ ముగ్గురు ఖాన్స్ పర్ఫార్మెన్స్‌తో పాటు అదే రోజు హాలీవుడ్ సింగర్ రిహాన్నా కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం రిహాన్నాను ఇండియాకు తీసుకురావడంపై ప్రజలు ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. కాసేపు పర్ఫార్మ్ కోసం రిహాన్నాకు రూ.75 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు కూడా వైరల్ అయ్యాయి.

దాదాపు బాలీవుడ్ అంతా హాజరు..

రిహాన్నాతో పాటు దిల్‌జిత్ దొసాంజ్, శ్రేయా ఘోషల్, ఉదిత్ నారాయణ్, అర్జిత్ సింగ్ లాంటి సింగర్స్ కూడా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాటలు పాడి అందరినీ ఎంటర్‌టైన్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ కోసం దాదాపు బాలీవుడ్‌లోని బడా స్టార్లు అంతా తరలివచ్చారు. మూడు రోజుల పాటు జామ్‌నగర్‌లో జరిగిన ఈ సెలబ్రేషన్స్ కోసం స్టార్లంతా తమ కాల్ షీట్స్‌ను పక్కన పెట్టారు. తమ బిజీ షెడ్యూల్స్‌లో ఈ సెలబ్రేషన్స్‌కు టైమ్ ఇచ్చారు. దీంతో కచ్చితంగా వారంతా రెమ్యునరేషన్ తీసుకొని ఉంటారని ప్రేక్షకులు భావించినా.. అదంతా నిజం కాదని ఇప్పుడు తేలిపోయింది. ఫైనల్‌గా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా బాలీవుడ్ ఖాన్స్.. ప్రీ వెడ్డింగ్‌కు వచ్చిన గెస్టులతో పాటు నెటిజన్లను కూడా ఎంటర్‌టైన్ చేశారు.

Also Read: రీరిలీజ్‌కు సిద్ధమైన ఉదయ్‌ కిరణ్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీ - ఆ రోజే థియేటర్లో 'నువ్వు నేను' సందడి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Kidney Health : కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Embed widget