అన్వేషించండి

Keerthy Suresh: తొలిసారి అలాంటి సీన్స్‌లో కీర్తి సురేష్? మొదటి ముద్దు ఆ హీరోకేనట!

ఇప్పటి వరకు అందాల ఆరబోతకు, లిప్ లాక్ సన్నివేశాలకు దూరంగా ఉన్న కీర్తి సురేష్, ఇక హద్దులు చెరిపేయబోతోందని తెలుస్తోంది. తొలి హిందీ మూవీలోనే ముద్దు సీన్లతో కుర్రకారును కవ్వించబోతోందని టాక్.

Keerthy Suresh Kiss Scenes: తెలుగుతో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ‘మహానటి‘ సినిమాతో దేశ వ్యాప్తంగా చక్కటి పేరు తెచ్చుకుంది. విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమాలో అద్భుత నటనకు గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అదీ అందాల ప్రదర్శనకు దూరంగా ఉంటూ. సౌత్ లో అగ్ర నటిగా కొనసాగుతున్న కీర్తి, ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయిన నటిస్తుంది. గత ఏడాది ‘దసరా’ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అటు తమిళంలో ‘మామన్నన్’ మూవీతో సత్తా చాటింది. అటు ‘భోళా శంకర్’ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్రలో నటించినా, ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం తమిళంలో మూడు, నాలుగు సినిమాలు చేస్తోంది.  

తొలి హిందీ మూవీలోనే అందాల ప్రదర్శన, ముద్దు సన్నివేశాలు

ఇక ఇప్పటి వరకు ఎలాంటి ఎక్స్‌ పోజింగ్‌ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు కీర్తి సురేష్. కానీ, ఈ మధ్యే బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శనకు హద్దులు చెరిపేయాలని భావిస్తోందట. ముద్దు సన్నివేశాలు చేయకపోతే అక్కడ రాణించడం కష్టమని ఫీలవుతుందట. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుణ్ ధావన్‌తో కలిసి 'బేబీ జాన్’ అనే హిందీ సినిమా చేస్తోంది.

కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘తేరి’ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ప్రారంభంలో ఎలాంటి లిప్ లాక్ సన్నివేశాలు లేవట. కానీ, దర్శకుడు ఉంటే బాగుంటుందని చెప్పారట. తొలుత నో చెప్పిన కీర్తి, ఆ తర్వాత సరే అన్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో నటించిన కీర్తి సురేష్ ఏ హీరోతోనూ లిప్ లాక్ చేయలేదు. గ్లామర్ షో కూడా చేయలేదు. కానీ, ‘బేబీ జాన్’ సినిమాలో మాత్రం వరుణ్ ధావన్‌‌తో పెదాలు కలిపినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, అందాల ప్రదర్శనతో కుర్రకారు మతిపోగొట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే, ఆమె అభిమానులు మాత్రం ఈ వార్తలను కొట్టిపడేస్తున్నారు. ఎన్ని కోట్లిచ్చినా కీర్తి సురేష్ అలాంటి సన్నివేశాల్లో నటించదని అంటున్నారు. మరి, దీనిపై కీర్తి స్పందిస్తుందో లేదో చూడాలి.

ఆ హీరోయిన్ల బాటలో కీర్తి సురేష్

సౌత్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగిన చాలా మంది ఇక్కడ ఎక్స్ పోజింగ్ చేయకపోయినా, బాలీవుడ్ కు వెళ్లగానే తమ మనసు మార్చుకుంటున్నారు. ఇప్పటికే తమన్నా, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, రష్మిక  సౌత్‌లో ముద్దుగా కనిపించినా, బాలీవుడ్ ఆఫర్ రాగానే గ్లామర్ షోకు ఏమాత్రం వెనుకాడలేదు. ఇప్పుడు ఈ లిస్టులో కీర్తి సురేష్ కూడా చేరుతుందా లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా ఆ మూవీ రిలీజ్ అయ్యే వరకు ఈ వార్తలే నిజమని నమ్మేయకూడదు. 'బేబీ జాన్' సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also: అదంతా జస్ట్ షో, పనైపోగానే డబ్బులిస్తారు - బాలీవుడ్ తారల బండారం బయటపెట్టిన ప్రియమణి

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget