Keerthy Suresh: చిరంజీవి vs విజయ్... బెస్ట్ డ్యాన్సర్ కాంట్రవర్సీపై కీర్తీ సురేష్ రియాక్షన్
Chiranjeevi Vs Thalapathy Vijay: మెగాస్టార్ చిరంజీవి, దళపతి విజయ్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్? అనే ప్రశ్నకు విజయ్ పేరు చెప్పడంతో కీర్తి సురేష్ ట్రోలింగ్‌కు గురైంది. ఆ వివాదంపై ఇప్పుడు స్పందించారు.

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) డాన్సులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నటుడిగా ఆయనకు ఎంత మంది అభిమానులు ఉన్నారో... అంతకు మించి ఆయన వేసే స్టెప్పులకు అభిమానులు ఉన్నారు. డాన్సుల్లో చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకున్న హీరోలు ఎంతో మంది! అటువంటి చిరంజీవి కంటే దళపతి విజయ్ బెస్ట్ డాన్సర్ అంటావా? అని కీర్తి సురేష్ (Keerthy Suresh)ను తెలుగు ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా మెగా అభిమానులు చాలా మంది ట్రోల్ చేశారు. ఆ వివాదం పట్ల కీర్తి సురేష్ స్పందించారు.
చిరంజీవి నా నిజాయితీని మెచ్చుకున్నారు!
Keerthy Suresh Latest Release: కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన డార్క్ కామెడీ ఫిలిం 'రివాల్వర్ రీటా' (Revolver Rita). ఈ శుక్రవారం అంటే నవంబర్ 28న తమిళంతో పాటు తెలుగులో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సినిమాను ప్రమోట్ చేయడానికి హైదరాబాద్ వచ్చారు కీర్తి సురేష్. అప్పుడు చిరంజీవి వర్సెస్ దళపతి డాన్స్ కాంట్రవర్సీని ఆవిడ ముందు ఉంచారు ఒక జర్నలిస్ట్.
అసలు వివాదం ఏమిటి? అనే విషయంలోకి వెళితే.... ఓ తమిళ ఇంటర్వ్యూలో 'మెగాస్టార్ చిరంజీవి, దళపతి విజయ్ ఇద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సర్?' అనే ప్రశ్న ఎదురైంది. అప్పుడు కీర్తి సురేష్ విజయ్ పేరు చెప్పారు. ఆ వివాదం గురించి ఇప్పుడు ప్రశ్నించగా... ''ఒకరు గొప్ప, మరొకరు తక్కువ అని నేను చెప్పలేదు. ఇద్దరూ గొప్ప నటులు. ఆఫ్ కోర్స్ ఆయన మెగాస్టార్ అని కూడా చెప్పాను. చిరంజీవి గారు లెజెండ్ అని కూడా చెప్పాను. దళపతి విజయ్ సార్ తమిళనాడులో లెజెండ్. ఆ ఇంటర్వ్యూలో నా అభిప్రాయం అడిగినప్పుడు ఎవరి పేరు చెప్పాలనేది నా ఛాయిస్. నేను విజయ్ గారి పేరు ఎందుకు చెప్పాను అంటే... ఆయన సినిమాలు ఎక్కువ చూశాను. అంతే తప్ప చిరంజీవి గారిని తక్కువ చేసే విధంగా నేను మాట్లాడలేదు. దీని గురించి నేను చిరంజీవి గారితో కూడా డిస్కస్ చేశా. ఆయనతో కూడా కన్వర్జేషన్ జరిగింది. నా నిజాయితీని చిరంజీవి గారు మెచ్చుకున్నారు. ఒకవేళ అభిమానుల మనసు నోచుకున్నట్లు అయితే వాళ్లు గనక హర్ట్ అయితే సారీ చెబుతున్నాను'' అని అన్నారు.
Also Read: బాలయ్యతో బాలయ్యకే పోటీ... మళ్ళీ డ్యూయల్ రోల్... ఇవాళే పూజతో ఎన్‌బీకే111 షురూ
'రివాల్వర్ రీటా' సినిమా విషయానికి వస్తే... అందులో సునీల్ గారు చాలా డిఫరెంట్ రోల్ చేశారని కీర్తి సురేష్ తెలిపారు. ప్రేక్షకులు అందరూ సినిమాను తప్పకుండా ఎంజాయ్ చేస్తారని, రాధిక శరత్ కుమార్ గారు మరొక చక్కని పాత్ర చేశారని, ఆమెతో తన కెమిస్ట్రీ చాలా బాగుంటుందని, ఇది ఒక పర్ఫెక్ట్ డార్క్ కామెడీ ఫిల్మ్ అని ఆమె అన్నారు. ఇప్పటివరకు ప్రేక్షకులు డార్క్ కామెడీ సినిమాలు చాలా చూసి ఉంటారని, అయితే ఇది ఒక ఫిమేల్ లీడ్ చేస్తున్న డార్క్ కామెడీ సినిమా అని కీర్తీ సురేష్ వివరించారు.
Also Read: 'అఖండ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్... డేట్, టైమ్, గ్రౌండ్ డీటెయిల్స్ తెలుసా?





















