కీర్తి సురేష్‌కు కాబోయే భర్త అతడేనా? వైరల్ అవుతోన్న ఫొటో
దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కీర్తి సురేష్.. తన కాబోయే భర్తను పరిచయం చేసిందా.. రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోల్లో ఉన్న వ్యక్తితో డేటింగ్ చేస్తుందంటా టాక్. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
Keerthi Suresh : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా షేర్ చేసిన పలు ఫొటోలు వైరల్ గా మారాయి. రీసెంట్ గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు ఆమె వ్యక్తిగత జీవితంపై పలు ఊహాగానాలకు దారి తీస్తోంది. ఇంతకీ ఆమె ఏం ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోల్లో ఉన్నది ఎవరు. ఆ ఫొటోలపై ఎలాంటి వార్తలు వస్తున్నాయి?
సెలబ్రెటీలకు సంబంధించిన ఏ వ్యక్తిగత విషయమైనా తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు. ముఖ్యంగా వారి పెళ్లికి సంబంధించిన వార్తలపై మరింత ఇంట్రస్ట్ చూపించడం సాధారణమైన విషయమే. తాజాగా కీర్తి సురేష్ పెళ్లిపై కూడా పలు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలే. మే 18న కీర్తి సురేష్.. దుబాయ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. అతనితో దిగిన కొన్ని ఫొటోలను పంచుకున్నారు. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే.. ఈ ఫొటోలపై కొన్ని వార్తలు ప్రచారం అయ్యాయి. ఆ ఫొటోల్లో ఉన్న వ్యక్తితో కీర్తి సురేష్ డేటింగ్ చేస్తోందని, త్వరలో వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ క్రియేట్ చేశారు.
ఇక కీర్తి సురేష్ షేర్ చేసిన ఫొటోలోని వ్యకి విషయానికొస్తే.. అతను దుబాయ్‌కి చెందిన రియల్టర్ ఫర్హాన్ బిన్ లియాఖత్ అని తెలుస్తోంది. అతని పేరును కూడా ఆమె ఇన్ స్టా స్టోరీలో రాసుకువచ్చింది. ఈ ఫొటోల్లో ఇద్దరూ పసుపు రంగు దుస్తులు ధరించి కెమెరా ట్విన్నింగ్ కోసం పోజులిచ్చారు. ఇదిలా ఉండగా ఫర్హాన్ తన అకౌంట్ లో చేసిన పోస్టులోనూ కీర్తితో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. ఆ చిత్రాన్ని కూడా కీర్తి సురేష్ మళ్లీ షేర్ చేసింది.
రూమర్స్‌పై కీర్తి సమాధానం
ఈ పోస్టుపై కొన్ని గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో పలు వార్తలు పుట్టుకురావడంతో.. కీర్తి, ఫర్హాన్ అలాంటిదేమీ లేదని సూచించారు. అయితే, కొన్ని వార్తా సంస్థలు.. అతడే కీర్తికి కాబోయే భర్త అంటూ ప్రచారం చేస్తూనే ఉన్నాయి.
కేరళకు చెందిన ఫర్హాన్ దుబాయ్‌లో ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. పలు నివేదికల ప్రకారం పర్హాన్, కీర్తితో కొంతకాలంగా స్నేహంగా ఉంటున్నాడు. కేరళకు చెందిన పలువురు ప్రముఖులతో ఫర్హాన్‌కు సంబంధాలు ఉన్నాయి. ఇప్పటివరకు, కీర్తి సురేష్ తన వ్యక్తిగత జీవితంపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. కాగా తాజాగా వైరల్ అవుతోన్న ఫొటోలను బట్టి డేటింగ్ లేదా వివాహం చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని తెలుస్తోంది.
30వ జాతీయ అవార్డు గ్రహీతగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్.. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలలో అనేక సినిమాల్లో నటించి విజయాలను సొంతం చేసుకుంది. కొన్ని మలయాళ చిత్రాలలో కూడా కనిపించిన ఆమె.. మహానటిలో నటనకు గానూ 2018లో ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఆమె రెమో, సర్కార్, గుడ్ లక్ సఖి, సర్కారు వారి పాట వంటి హిట్‌లలో కూడా కనిపించింది. కీర్తి సురేష్ చివరిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘దసరా’లో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా.. రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిన ఫిలింగానూ నిలిచింది.
Read Also : తన బాడీగార్డ్స్ చేసిన పనికి షాకైన రష్మిక - ఫ్యాన్స్ మనసు దోచుకున్న నేషనల్ క్రష్!